త్వరలో.. ఈ తరం సాహిత్య విమర్శ ప్రారంభం
తెలుగు సాహిత్యంలోకి అనేక జీవన మూలాల నుంచి కొత్త తరం రచయితలు వస్తున్నారు. కొత్త అనుభవాలను పరిచయం చేస్తున్నారు. అద్భుత నిర్మాణ పద్ధతులను ప్రవేశపెడుతున్నారు. చాలా ప్రశంసనీయమైన ఈ కృషిలో ఈ కాలపు జీవన సంఘర్షణ ఎంత ఉన్నది? యువ రచయితలు దాన్ని ఎంత మేరకు ఒడిసిపట్టుకోగలగుతున్నారు? జీవితంలోని మార్పు క్రమాలను ఎంత లోతుగా, సంక్లిస్టంగా, తార్కికంగా చిత్రించగలుగుతున్నారు? అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇలాంటివి అన్ని తరాలు ఎదుర్కొన్నవే. సాహిత్య విమర్శ ఈ సమస్యలను చర్చనీయాంశం చేయాలి. పరిష్కారం చూపాలి. తెలుగు సాహిత్య రంగంలోకి కూడా సంఖ్యాపరంగా తక్కువే కావచ్చుగాని, కొత్త తరం ప్రవేశించింది. రచయితలైనా, విమర్శకులైనా,










