భౌతిక నిష్క్రమణల వెనుక..
అర్ధాంతర భౌతిక నిష్క్రమణల వెనుక ఏ కారణాలు ఉంటాయి. పుట్టుక ,మరణానికి ఈ మధ్య ఉన్న విరామమేదో ప్రేరేపించవచ్చు. ఈ జీవితం ఇక చాలు అనిపించవచ్చు. ముగింపునకు మనిషి సిద్ధం చేసుకోవచ్చు. తనకి ఈ ప్రపంచం నచ్చలేదని, అసంతృప్తి ఉందనే,భావన కలగవచ్చు. భౌతిక నిష్క్రమణ తన అంతరంగ ఘర్షణ కావచ్చు . మనిషి వెళ్ళిపోయాడు. సాధారణ మరణం అయితే, ఆకస్మిక మరణం అయితే, యాక్సిడెంట్ అయితే, లేదా హత్యకు గురి అయితే మరణం తర్వాత మన దుఃఖ సమయాల తీవ్రత ఒక్కోరకంగా ఉంటుంది. ప్రతి మరణానికి ఒక దుఃఖపుకొలత ఉంటుంది. ఆ కొలతలతో ఆ మనిషి పట్ల చివరి