ఆర్కె స్మృతి నేరం కాదు
పాణి కామ్రేడ్ ఆర్కె మరణించి కూడా మనకు ఒక భరోసాను ఇచ్చాడు. ఈ చీకటి రోజుల్లోనూ ధైర్యాన్ని అందించాడు. తన విస్తారమైన ప్రజా జీవితంలో వలె మరణానంతరం కూడా మనలో ఆశను రగిల్చాడు. ఆర్కె జ్ఞాపకాల, రచనల సంపుటి ‘సాయుధ శాంతి స్వప్నం’ను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకోవడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. పుస్తకాలను ప్రచురణకర్తకు ఇచ్చేయాలని, ప్రింటర్ మీద పెట్టిన కేసు చెల్లదని ప్రకటించింది. న్యాయ పీఠాలు అన్యాయ స్థావరాలుగా మారిపోయిన వేళ ఇలాంటి తీర్పు వెలుబడిరది. తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద పోలీసులు ఈ కేసును నమోదు