నాలుగో ప్రశ్న వేసిన అమ్మాయి!
మీకో నాలుగు ప్రశ్నలను... నాలుగు జవాబులను పరిచయం చేస్తాను. నాతో రండి... ఇంతకీ నేనెవరనుకుంటున్నారు? నేనో అండాన్ని అవును అనాదిగా స్త్రీ దేహంలో తయారవుతున్న అండాన్ని. ఆడగానో, మగగానో ఎవరిగానో పుట్టే తీరతాను లేదా పుట్టాక ఆడో మొగో కూడా తేల్చుకుంటాను. కానీ నిరంతరం ఒక భయంతో... ఆందోళనతోనే ప్రతీ నెల కోట్లాది మంది స్త్రీ దేహాల్లో తయారవుతూ... ఉంటాను... సందేహంగా రాలిపోతూ ఉంటాను కూడా ఆ స్త్రీలు పెళ్ళి చేసుకుంటే ఇక నేను ఆడపిల్లగా పుట్టేస్తానేమో అని వణికిపోతుంటాను. ఆ స్త్రీ భర్త వీర్యకణాల్లోని వై క్రోమోజోముతో అండాన్నై నాలోపని ఎక్స్ క్రోమోజోమ్ కన్నీరు కారుస్తూ భయపడ్తు