నేటితరానికి గర్వకారణం భూమిక
(విప్లవ రచయిత్రి, విప్లవోద్యమ సీనియన్ కార్యకర్త కామ్రేడ్ విజయ లక్ష్మి @భూమిక కథల సంపుటి *ప్రజలు అజేయులు *కు రాసిన ముందు మాట ఇది . ఆమె ఈ ఏడాది మే 21 న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నారాయాణపూర్ గుండెకోట్ అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎదురుకాల్పుల్లో అమరురాలైంది) భారత విప్లవ ప్రజానీకానికి తీవ్రమైన గుండెకోత మిగిల్చిన గుండె కోట్ అమరులలో ఒకరు తెలంగాణ పోరు బిడ్డ వన్నాడ విజయలక్ష్మి. విప్లవోద్యమంలోని మిత్రులకు భూమిక. రచయితగా పాఠకులకు వసుధ. ఉస్మానియా యూనివర్సిటీలో తన చదువుకున్న వారికి బహుశా విజ్జి అయి ఉంటుంది. గత కొంతకాలంగా ‘ఇక విద్యార్థులు










