కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఆమె… ఒక డిస్ఫోరియా

నా కథ చెబుతా వినండి... ‘‘నా పేరు మమత. ప్రతిసారీ మీరు చెప్పే సమస్యలు వింటున్నాను. వింటున్నకొద్దీ బాధ మరింత ఎక్కువ అవుతూ ఉన్నది. నా కలల ప్రపంచాన్ని ఛిద్రం చేసిన నా జీవితం గుర్తుకు వచ్చి మరింతగా నొప్పి అనిపిస్తున్నది. ఈ స్నేహిత సంస్థలో ప్రతి ఒక్కరూ తమ జీవితం గురించి చెప్పేటప్పుడు మీ అందరి జీవితాలకంటే నా జీవితం, కథా దుర్భరమైనవి, భిన్నమైనవి అంటూ ఉన్నారు. నేనూ అదే చెప్పబోతున్నాను. నిజానికి నా జీవితం మీ అందరికంటే భిన్నమైనది. చాలా మంది భర్తల అత్యాచారాల రూపాలు మన అందరికీ.. కొన్నిసార్లు ఒకే రకంగా మరికొన్ని సార్లు
కథలు

ఉడుకు!

యూత్ అసోషియేషన్ సభ్యులంతా జమయ్యిన్రు. బస్తీలో చెయ్యాల్సిన కార్యక్రమాన్ని గురించి చర్చోపచర్చలు చేసి తీర్మానం కూడా చేసిన్రు. “ఒరేయ్... మీరంతా గుండు చేపించుకుంటారా?” అడిగిండు వో దోస్తు. “మనమేం మాట్లాడినాం? వీడేమంటున్నాడ్రా?” యెవరికీ యేమీ అర్థంకాలే. మెంటలోన్ని చూసినట్టు చూసిన్రు. “సరే, నేను పైసలిస్తాను, మీరంతా గుండు చేపించుకుంటారా?” దోస్తుగాడు అన్నమాట మీదే వున్నడు. “ఒరే హవ్లే, యింట్లో యెవరు పోయిన్రని... గుండు చేపించుకుంటారు?” ఆ దోస్తుని తిరిగి అంతా అడిగిన్రు. “మీ తాత పోయిండు. మీ జేజమ్మ పోయింది. ఊ... మీ చిన్నాయిన పోయిండు. ఆ... మీ పెద్దమ్మ కూడా పోయింది. ఒరే, మీ బావ కరోనా
హస్బెండ్ స్టిచ్ - 3

నాలుగో ప్రశ్న వేసిన అమ్మాయి!

మీకో నాలుగు ప్రశ్నలను... నాలుగు జవాబులను పరిచయం చేస్తాను. నాతో రండి... ఇంతకీ నేనెవరనుకుంటున్నారు? నేనో అండాన్ని అవును అనాదిగా స్త్రీ దేహంలో తయారవుతున్న అండాన్ని. ఆడగానో, మగగానో ఎవరిగానో పుట్టే తీరతాను లేదా పుట్టాక ఆడో మొగో కూడా తేల్చుకుంటాను. కానీ నిరంతరం ఒక భయంతో... ఆందోళనతోనే ప్రతీ నెల కోట్లాది మంది స్త్రీ దేహాల్లో తయారవుతూ... ఉంటాను... సందేహంగా రాలిపోతూ ఉంటాను కూడా ఆ స్త్రీలు పెళ్ళి చేసుకుంటే ఇక నేను ఆడపిల్లగా పుట్టేస్తానేమో అని వణికిపోతుంటాను. ఆ స్త్రీ భర్త వీర్యకణాల్లోని వై క్రోమోజోముతో అండాన్నై నాలోపని ఎక్స్‌ క్రోమోజోమ్‌ కన్నీరు కారుస్తూ భయపడ్తు
హస్బెండ్ స్టిచ్ - 3

‘’ ఆజో మ తోన బేటా దూన్చు ‘’ !

’అయ్యో నేను వస్తున్నా .. ఆమె నా బెహెన్ సార్ .. మా చాంద్  బాయి , ఆడనె  ఉంచుండ్రి  ఇగో  ఐదు  నిమిషాల్లో ఇప్పుడే వస్తున్న” భూక్యా ఖంగారుగా అంటూ .. భార్య పద్మ తో “చాంద్  బాయి  జ్యోతి నగర్ లో ఒకల యింట్ల  ఉన్నదంట  నేన్  పోయి తొలుకొని వస్తా” అన్నాడు . “ నేను గూడ వస్తా పా “ అన్నది పద్మ .   చాంద్ బాయి ., భూక్యా చెల్లెలు.                                                             **** “ఆజో ., మ తోన బేటా దూన్చు”.,{ నాతో రా నీకో కొడుకుని ఇస్తా }
కథలు

పేగుబంధం

'కన్న కొడుకునే చంపేందుకు ఎందుకు తెగబడ్డావు?' గురిపెట్టిన తుపాకీలా తన కళ్లలోకే చూస్తున్నపోలీసు అధికారి ముఖం మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా భగభగమండిపోతోంది. మండే సూర్యుడి దిక్కు నిలువలేక వాడిన గడ్డిపువ్వులా ఆ తల్లి నేలచూపు చూసింది. 'నిన్నే అడిగేది?' అంటూ పోలీస్‌ ఆవేశం గదులు ప్రతిధ్వనించింది. పులి గర్జనకు లేడి భయంతో చెంగుచెంగున ఉరికినట్టే.. అధికారి ఆవేశానికి తిరుపత్త గజగజా వణికిపోతూ నాలుగడుగుల వెనక్కి వేసింది. ఏదో మాట్లాడాలని నోరు విప్పబోతోంది. మనసులోని మాటను బయటపెట్టడానికి ఆగిపోతోంది. ఏమి చేయాలో తెలియక, ఏం చెప్పాలో తోచక ఆమె సతమతవుతోంది. ఒకవైపు భయం వణికిస్తోంది. గుండె వేగం పెరిగిపోతోంది. చెమటలు
సాహిత్యం

गुमुड़ावेल्लीरेणुका – कड़वेंडीकीलाडलीबेटी, जनताकीअमरयोद्धा

कॉमरेड गुमुड़ावेल्ली रेणुका का जीवन एक खुली किताब की तरहहै. तीन दशकों की उनकी क्रांतिकारी यात्रा और क्रांतिकारी आंदोलन में योगदान को उनके जीवन से भी बड़ा कहा जा सकता है. उनका तीस साल का क्रांतिकारी संघर्ष उत्पीड़ित महिलाओं के लिए मुक्ति का संदेश है. कॉमरेड रेणुका एक अटल और समर्पित कम्युनिस्ट क्रांतिकारी थीं. वह एक दृढ़निश्चयी योद्धा थीं, जिन्होंने गुरिल्ला जीवन की कठिनाइयों, कष्टों और पीड़ाओं से कभी भी
సాహిత్యం

నేటితరానికి గర్వకారణం భూమిక

(విప్లవ రచయిత్రి, విప్లవోద్యమ సీనియన్ కార్యకర్త  కామ్రేడ్ విజయ లక్ష్మి @భూమిక కథల సంపుటి *ప్రజలు అజేయులు *కు  రాసిన ముందు మాట ఇది . ఆమె ఈ ఏడాది మే 21 న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నారాయాణపూర్  గుండెకోట్  అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎదురుకాల్పుల్లో అమరురాలైంది) భారత విప్లవ ప్రజానీకానికి తీవ్రమైన గుండెకోత మిగిల్చిన గుండె కోట్‌ అమరులలో ఒకరు తెలంగాణ పోరు బిడ్డ వన్నాడ విజయలక్ష్మి. విప్లవోద్యమంలోని మిత్రులకు భూమిక. రచయితగా పాఠకులకు వసుధ. ఉస్మానియా యూనివర్సిటీలో తన చదువుకున్న వారికి బహుశా విజ్జి అయి ఉంటుంది. గత కొంతకాలంగా ‘ఇక విద్యార్థులు
కథలు

మిస్టర్ ఏ

విజయవంతమైన వ్యక్తి  జీవిత కథను మనం చదివినప్పుడు, వారు వారి జీవితంలోని సవాళ్లను ఎలా  అధిగమించారు అనే దాని గురించి మనకు చాలా అంతర్దృష్టిని అందిస్తుంది. ఈ పాఠాలు మన జీవితాలను నడపటానికి,  మన ప్రియమైనవారి కోసం మంచి భవిష్యత్తును ప్లాన్ చేయడంలోను  సహాయపడతాయి. నిజానికి మిస్టర్ ఏ  భారత ఆర్థిక వ్యవస్థ  ఆకాశంలో మెరిసే నక్షత్రం. మిస్టర్ ఏ, అంబానీల తర్వాత రెండవ సంపన్న కుటుంబం. కానీ ఇతర వ్యాపార దిగ్గజాల మాదిరిగా కాకుండా, మిస్టర్ ఏ తన తండ్రి నుండి అదృష్టాన్ని వారసత్వంగా పొందలేదు. బదులుగా, అతను తన విధిని మార్చడానికి చాలా కష్టపడ్డాడు. మిస్టర్ ఏ  విజయగాథను పరిశీలిస్తే,  అతని బలమైన
కథలు

ఎకనమిక్స్‌

వారం కింద. ఒకరోజు.  ఉదయం ఇంటర్వెల్‌ అయిపోయింది. అంతా ఎవరి క్లాసులకు వాళ్ళం పోతున్నాం. నేను టెన్త్‌ క్లాస్‌  గదిలోకి వెళ్ళాను. సెంటు వాసన గుప్పు మంటోంది. బోర్డువైపు చూశాను. ఇంగ్లీష్‌ టీచర్‌ ఆరోజు థాట్‌ ఫర్‌ ది డే ఇలా రాశారు. If  you light a lamp for someone elseIt  will also brighten your own path బోర్డు తుడుస్తూ ఆలోచిస్తున్నాను. ఎకనామిక్స్‌లో కొంచెం కవర్‌ చేద్దామనుకున్నాను. బోర్డువైపు తిరిగి  టాపిక్‌ రాసేంతలో  కిరణ్‌ కంప్లయింట్‌ ‘‘మేడం, మేడం శ్రావణ్‌ సెంటు తెచ్చాడు’’             కంప్లయిట్స్‌ పర్వం మొదలైౖంది. రఘు కూడా తెచ్చాడు,
కథలు

వెన్నెల వసంతం

ఈ కథ ఇప్పుడు మరోమారు చదివా.  అప్పుడెప్పుడో రాంగూడా హత్యాకాండ సమయంలో రాసినా ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న హత్యాకాండల నెత్తుటి తడి మనకు తగులుతుంది. ఒకసారి కథలివి వెళితే ..  . ఇప్పుడు అమ్మలేదు. ఆమె జ్ఞాపకాలు తప్ప. అమ్మ అరుణ. అమ్మ డైరీలో భద్రపర్చుకున్న జ్ఞాపకాలను తనలోకి ఒంపుకుంటుంది వెన్నెల. అమ్మా - వసంత్ అమ్మ అరుణ.మరి వసంత్ ఎవరు? అమ్మ జీవితంలోకి వసంతే వచ్చాడో! వసంత్ జీవితంలోకి అమ్మే వెళ్ళిందో కానీ, ఇద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోలేకపోయారు. అమ్మ 'కుటుంబం'గదిలో ఇరుక్కుపోయింది. వసంత్, అడవిలో వసంతమై విరబూసిండు. ఆదివాసిని అంతం చేసి ...అడవిని ఆక్రమించి