సాహిత్యం

Viyyukka: Morning star in Indian literature

Revolutionary women writers have made an incredible contribution to Telugu literature and in fact it is a significant addition to Indian literature as well. It has been four decades since women revolutionaries started writing short stories, but except a few most of them are unknown to mainstream literature. Now virasam, (Revolutionary Writers Association) along with other friends took the tedious project of compiling nearly 300 stories written by 53 women
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఈ మోహన్రావున్నాడు చూడండీ..!

అవును... మీరందరూ వినాలి. నేనెలా చనిపోయానో నేను మీకందరికీ చెప్పి తీరాలి. నా కథ మీకు వింతగా కనిపించవచ్చు పోనీ ఒఠ్ఠి చోద్యంగానూ అనిపించవచ్చు. నాలాంటి స్త్రీల కథలు ఎవరు రాస్తారో తెలీదు కానీ ఒకవేళ రాస్తే మాటుకు రాసిన వాళ్ళని కూడా మీరు తెగడతారు. ఒఠ్ఠి బలుపు... బూతూ రాస్తుందీవిడ అని ఆమెను పాపం మనస్తాపానికి గురి కూడా చేయవచ్చును మీరంతటి వాళ్లే సుమా! ఇంతకీ నేనెలా పోయానో మీకు చెప్పాలి. ఈవిడేదో మళ్ళా ఒక పురుషుడ్నో... అంటే భర్తని విలన్‌గా నిలబెడ్తుందని మీరనవచ్చు కానీ నా కథలో ఇది నిజమే. అవును మరి నిండు నూరేళ్లు
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఫ్రాక్చర్‌

దేవయాని బాధతో మూల్గింది. మెల్లగా వాకర్‌ పట్టుకుని నడుస్తూ బాత్‌రూం నుంచి బయటకు వచ్చి మెల్లిగా మంచం మీద కూర్చుంది... ఇంకా ఎన్ని రోజులో ఈ బాధ... దేవయానికి తనకి అయిన యాక్సిడెంట్‌ గ్నాపకం వచ్చింది. కోడలుగా అత్తకు చాలా సేవలు చేసింది. మలమూత్రాలు ఎత్తిపోసింది. నోటికి ముద్దలు పెట్టింది... చంటిబిడ్డకు పోసినట్లు స్నానాలు పోసింది. పిచ్చెక్కి రోడ్లమీద పారిపోతే ఎన్నిసార్లు ఉరుకులు పరుగులెత్తి తెచ్చుకుందో... ఒక్కతే పిచ్చి అత్తను పట్కొని హాస్పిటల్‌ చుట్టూ తిరిగిందో ఆమెకి కూడా ఆరోగ్యం ఏమీ బాగుండదు. అయినా అత్తను తల్లికంటే ఎక్కువ చూస్కుంది. ‘ఆ పుణ్యమంతా ఆమెదే. అందుకే నిన్న రాత్రి
కథలు

మనుషులను కలపడమే మన పని

నేను కొత్తగా దళంలోకి వెళ్లిన రోజులవి. నేను కొత్తగా దళంలోకి వెళ్లిన రోజులవి. ఉదయాన్నే ఐదు గంటలకు ‘లెగండి లెగండి.. బయలుదేరాలి..’ అంటూ డిప్యూటీ కమాండర్‌ అరుపులతో అందరం నిద్ర లేచాం. నేను కళ్లు తెరిచి చూసేసరికే ఒకరిద్దరు కిట్లు సర్దుకుంతున్నారు. దీర్ఘ ప్రయాణం చేసి రాత్రి డ్యూటీ పడ్డ కామ్రేడ్స్‌ లేవడానికి ఇబ్బంది పడుతున్నారు. మూత పడుతున్న కళ్ళతోనే పాలిథిన్‌ కవర్లు మడత పెట్టుకుంటున్నారు. ఆ ప్రశాంత వాతావరణంలో కామ్రేడ్ల కదలికల జోరుతో పాలిథిన్ల చప్పుడు తోడైంది. నేను బద్ధకంగా లేచి కూర్చున్నాను. అది గమనించిన మా దళం ఫ్రంట్‌ పైలెట్‌ మంగన్న ‘నిర్మలక్క ఇక్కడే ఉంటది.
కథలు

వేగుచుక్క

ఆదివారం సాయంత్రం ఇంటి ముందు అరుగు మీద కుర్చీలో కూర్చున్న గోపాలరావు సిగరెట్‌ కాలుస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అతని కళ్లు విషాదంతో నిండి వున్నాయి. అతని హృదయంలో సుళ్లు తిరుగుతున్న దుఃఖం, వేదన ఏమిటో 40 ఏళ్లుగా అతనితో జీవితం పంచుకున్న జానకమ్మకు తెలుసు. జానకమ్మ అతడిని గమనిస్తూనే మౌనంగా అతడికెదురుగా కత్తిపీట ముందేసుక్కూర్చుని ఉల్లిపాయలు కోస్తున్నది. అతడు జానకమ్మను చూసాడు. ఆమె చెంపల మీదుగా కన్నీళ్లు కిందకు జారుతున్నాయి. అవి ఉల్లిపాయల ఘాటు వలన కాదని అతనికి తెలుసు. ఆమె మౌనం, కన్నీళ్ల వెనుక వున్న ఆవేదనను అతను అర్థం చేసుకోగలడు. ఆమెనలా చూస్తుంటే అతనికి గుండె
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

ఆమె… ఒక డిస్ఫోరియా

నా కథ చెబుతా వినండి... ‘‘నా పేరు మమత. ప్రతిసారీ మీరు చెప్పే సమస్యలు వింటున్నాను. వింటున్నకొద్దీ బాధ మరింత ఎక్కువ అవుతూ ఉన్నది. నా కలల ప్రపంచాన్ని ఛిద్రం చేసిన నా జీవితం గుర్తుకు వచ్చి మరింతగా నొప్పి అనిపిస్తున్నది. ఈ స్నేహిత సంస్థలో ప్రతి ఒక్కరూ తమ జీవితం గురించి చెప్పేటప్పుడు మీ అందరి జీవితాలకంటే నా జీవితం, కథా దుర్భరమైనవి, భిన్నమైనవి అంటూ ఉన్నారు. నేనూ అదే చెప్పబోతున్నాను. నిజానికి నా జీవితం మీ అందరికంటే భిన్నమైనది. చాలా మంది భర్తల అత్యాచారాల రూపాలు మన అందరికీ.. కొన్నిసార్లు ఒకే రకంగా మరికొన్ని సార్లు
హస్బెండ్ స్టిచ్ - 3

నాలుగో ప్రశ్న వేసిన అమ్మాయి!

మీకో నాలుగు ప్రశ్నలను... నాలుగు జవాబులను పరిచయం చేస్తాను. నాతో రండి... ఇంతకీ నేనెవరనుకుంటున్నారు? నేనో అండాన్ని అవును అనాదిగా స్త్రీ దేహంలో తయారవుతున్న అండాన్ని. ఆడగానో, మగగానో ఎవరిగానో పుట్టే తీరతాను లేదా పుట్టాక ఆడో మొగో కూడా తేల్చుకుంటాను. కానీ నిరంతరం ఒక భయంతో... ఆందోళనతోనే ప్రతీ నెల కోట్లాది మంది స్త్రీ దేహాల్లో తయారవుతూ... ఉంటాను... సందేహంగా రాలిపోతూ ఉంటాను కూడా ఆ స్త్రీలు పెళ్ళి చేసుకుంటే ఇక నేను ఆడపిల్లగా పుట్టేస్తానేమో అని వణికిపోతుంటాను. ఆ స్త్రీ భర్త వీర్యకణాల్లోని వై క్రోమోజోముతో అండాన్నై నాలోపని ఎక్స్‌ క్రోమోజోమ్‌ కన్నీరు కారుస్తూ భయపడ్తు
హస్బెండ్ స్టిచ్ - 3

‘’ ఆజో మ తోన బేటా దూన్చు ‘’ !

’అయ్యో నేను వస్తున్నా .. ఆమె నా బెహెన్ సార్ .. మా చాంద్  బాయి , ఆడనె  ఉంచుండ్రి  ఇగో  ఐదు  నిమిషాల్లో ఇప్పుడే వస్తున్న” భూక్యా ఖంగారుగా అంటూ .. భార్య పద్మ తో “చాంద్  బాయి  జ్యోతి నగర్ లో ఒకల యింట్ల  ఉన్నదంట  నేన్  పోయి తొలుకొని వస్తా” అన్నాడు . “ నేను గూడ వస్తా పా “ అన్నది పద్మ .   చాంద్ బాయి ., భూక్యా చెల్లెలు.                                                             **** “ఆజో ., మ తోన బేటా దూన్చు”.,{ నాతో రా నీకో కొడుకుని ఇస్తా }
కథలు

పేగుబంధం

'కన్న కొడుకునే చంపేందుకు ఎందుకు తెగబడ్డావు?' గురిపెట్టిన తుపాకీలా తన కళ్లలోకే చూస్తున్నపోలీసు అధికారి ముఖం మిట్ట మధ్యాహ్నం సూర్యుడిలా భగభగమండిపోతోంది. మండే సూర్యుడి దిక్కు నిలువలేక వాడిన గడ్డిపువ్వులా ఆ తల్లి నేలచూపు చూసింది. 'నిన్నే అడిగేది?' అంటూ పోలీస్‌ ఆవేశం గదులు ప్రతిధ్వనించింది. పులి గర్జనకు లేడి భయంతో చెంగుచెంగున ఉరికినట్టే.. అధికారి ఆవేశానికి తిరుపత్త గజగజా వణికిపోతూ నాలుగడుగుల వెనక్కి వేసింది. ఏదో మాట్లాడాలని నోరు విప్పబోతోంది. మనసులోని మాటను బయటపెట్టడానికి ఆగిపోతోంది. ఏమి చేయాలో తెలియక, ఏం చెప్పాలో తోచక ఆమె సతమతవుతోంది. ఒకవైపు భయం వణికిస్తోంది. గుండె వేగం పెరిగిపోతోంది. చెమటలు
కథలు

మిస్టర్ ఏ

విజయవంతమైన వ్యక్తి  జీవిత కథను మనం చదివినప్పుడు, వారు వారి జీవితంలోని సవాళ్లను ఎలా  అధిగమించారు అనే దాని గురించి మనకు చాలా అంతర్దృష్టిని అందిస్తుంది. ఈ పాఠాలు మన జీవితాలను నడపటానికి,  మన ప్రియమైనవారి కోసం మంచి భవిష్యత్తును ప్లాన్ చేయడంలోను  సహాయపడతాయి. నిజానికి మిస్టర్ ఏ  భారత ఆర్థిక వ్యవస్థ  ఆకాశంలో మెరిసే నక్షత్రం. మిస్టర్ ఏ, అంబానీల తర్వాత రెండవ సంపన్న కుటుంబం. కానీ ఇతర వ్యాపార దిగ్గజాల మాదిరిగా కాకుండా, మిస్టర్ ఏ తన తండ్రి నుండి అదృష్టాన్ని వారసత్వంగా పొందలేదు. బదులుగా, అతను తన విధిని మార్చడానికి చాలా కష్టపడ్డాడు. మిస్టర్ ఏ  విజయగాథను పరిశీలిస్తే,  అతని బలమైన