సాహిత్యం కవిత్వం

ఆకలి జోలె

జోలెకుఅటు అతడుఇటు నేను.. మా ఇద్దరి మధ్యజోలె పెరు ఆకలి.. అల్యూమినియం బిళ్ళ కోసంఇద్దరిని దేహీ అంటూ అడిగిందిదేశ భవిష్యత్తు.. జోలెకు అటువైపు వ్యక్తి..ప్రభువు దుఃఖంతో నిండినదరిత్రి మీదికి వస్తున్నాడని చెప్పాడు..ఇటు వైపు నేను..వస్తే ఛిద్రమైతూమనమద్యున్నా ఈ దేశ భవిష్యత్ తో మాట్లాడే ధైర్యం చెయ్యమన్నాను.. రాం, రహీం,జీసస్ఎవరచ్చిన అంగట్లోఅర్థకలితో,ఆర్తితో పోటీపడుతున్నభవిష్యత్ భారతవనిని పలకరిస్తారా..?అంతటి ధైర్యం చేస్తారా..? (కరీంనగర్ బస్ స్టాండ్ లో జోలెతో ఉన్న చిన్నారితో ఎదురైనా సంఘటన పై)21/01/2022
సాహిత్యం వ్యాసాలు

వివాదాస్పద వ్యక్తిత్వం

ఎంవి రమణారెడ్డి వాక్యం సరళంగా ఉంటుంది. ఆయన  ఏది రాసినా, మాట్లాడినా    నేరుగా  అర్థమైపోతారు. ఆయన వ్యక్తిత్వం దీనికి పూర్తి వ్యతిరేకం.  అందులో అనేక ఎత్తుపల్లాలున్నాయి.  ఆగాధాలు ఉన్నాయి.   చిక్కుముళ్లు ఉన్నాయి.  అలాంటి ఎంవిఆర్‌ గురించి సరళంగా   ఏం చెప్పినా అది తప్పే అవుతుంది. ఆయన్ను పట్టిచ్చే ఒకే ఒక వాక్యం రాయడం ఎవ్వరికైనా కష్టమవుతుంది. ఒక ప్రశంసాత్మక వాక్యం రాస్తే దాని పక్కనే ప్రశ్నించే వాస్తవం వచ్చి నిలదీస్తుంది.   ఆయన సామాజిక, రాజకీయ జీవితం  గుంటూరు మెడికల్‌ కాలేజీ విద్యార్థి దశలోనే ఆరంభమైంది. నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల ప్రచార వేదికగా ప్రభంజనం పత్రిక ఆరంభించారు. విరసం
సాహిత్యం కవిత్వం

నా తలపుల తలుపులు తెరిచీ..

నా జ్ఞాపకాలునీ రెక్కలునీ రెక్కలునా జ్ఞాపకాలు ఎగరు సీతాకోకనింగి అందేదాకా ఎంత సున్నితంగాతాకుతాయో కదా నీ రెక్కలుగాలిని నీ రెక్కల కుంచెతోగాలి కాన్వాస్ మీదఎన్ని వర్ణచిత్రాలు వర్షిస్తావో కదా రుతువుల మోములన్నీమోహపు వీణలౌతాయి కవితలేవో నేను అల్లడానికికుట్ర పన్నుతాయి నీ రెక్కలు కదిలినప్పుడంతానాలో స్ళేఛ్ఛా కాంక్ష పురి విప్పిన నెమలి అవుతుందిఅరణ్యం పై పరుచుకునే కెంజాయరంగౌతుంది అపుడునా ఏకాంతాన్నీ,నా భావాలనూనీ భుజాలు నొప్పెట్టెలా  మోస్తావు నా ఊహల స్పర్శతోనీ రెక్కలు పులికిస్తాయోనీ రెక్కల స్పర్ళతో నా ఊహలు అలలై కదులుతాయో తెలియదు కానీ నీ రెక్కలు కదిలేప్పుడంతానేనూ కదులుతానునా గుండెకొక లయ ఉన్నట్టనిపిస్తూనాకు నేను కొత్త కావ్యాన్నై పరిచయమౌతాను
సాహిత్యం వ్యాసాలు

పంజరంతో ప‌క్షి యుద్ధం

ఆఫ్ఘాన్ మహిళా కవిత్వం "అందరూ నిన్ను తమ దానిగా చెప్పు కుంటారు..కాని, నేను నిన్ను నిన్ను గానే చూస్తాను. "  Jalaluddin Rumi balki. (రూమి ) ఆప్ఘాన్ లు అన్ని సాహిత్య ప్రక్రియ ల కన్నా  కవిత్వానికి పెద్ద పీట వేస్తారు..తాము భావాల్ని కేవలం కవిత్వం ద్వారా మాత్రమే చెప్పగలమన్నది వాళ్ళ విశ్వాసం.. అక్కడ కవులు, కవయిత్రులు కవిత్వాన్ని బైటికి చదవడానికే ఇష్ట పడ్తారు(recitation)...ఆప్ఘాన్లు సాధారణంగా కవిత్వాన్ని  పర్షియన్(దారి), ఫస్తో భాషల్లో రాస్తారు..వాళ్ళు ఎక్కువగా "లాండై"(ద్విపద)పద్ధతిలో రాస్తుంటారు. పదమూడవ శతాబ్దంలో జన్మించిన సూఫీ కవి,జలాలుద్దీన్ రూమి బల్కీ ని వాళ్లు ఆదికవి గా భావిస్తారు.ఆయన కవిత్వంలో ఆధ్యాత్మికత
సాహిత్యం కవిత్వం

ఎడారి పుష్పం

పొగమంచు కౌగిలిలో ఈ రోజు తెలవారింది.నేల తన దేహాన్ని చలిపూలతో సింగారించుకుంది. నెగళ్ళ వేడిలో లోకం సెదదీరుతోంది మనసుని మంచుగడ్డలా మార్చేసినఈ శీతాకాల వేళనా రెప్పల మీద వెచ్చటి పెదవుల బరువునిమోపిపోయావుదేహం పులకరింతల పూల తపనల పలవరింతలలోచలించిపోయింది రేపన్నదొకటి నా ఆయుష్షులోకి దిగిఉంటేనేనేం కోరుకోవాలి? తల్లి ఒడిలాంటి వెచ్చదనం తెలిసిననీ ముద్దూనీ ఆలింగనం తప్పనీతో ఏకాంతంలో నడిచే కొన్ని అడుగులు తప్ప భయపడకు ప్రియామన అడుగులు పడే  దారిలో నీకై పూలూనాకై ముళ్ళూ ఉంచబడ్డాయిగాయాలనే పూలని నమ్మే నాకుపూలు కూడా గాయం చేయగల సున్నితమైన ప్రియురాలుండడం గొప్ప బహుమానం కదూ? కాదనే అనుకుందాం కాసేపు ఎడారి లాంటి నా