Uncategorized వ్యాసాలు

ఒడిశాలోని లాంజిబెర్నా గ్రామంలో దాల్మియా గనితవ్వకాల విస్తరణ : గ్రామస్తుల నిరసన

2026 మార్చి 5  (ఈ కథనం ఒడిశాలో గని తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్న వివిధ ఉద్యమాలు, సమస్యలపై క్షేత్రస్థాయి నివేదికల పరంపరలో ఒక భాగం.) మేరీ జెమా కుల్లుకు ఈ మధ్య నిద్ర పట్టడం లేదు. రాత్రిపూట కొంచెం శబ్దం వచ్చినా ఆమెకు మెలకువ వచ్చేస్తోంది. ఆమె ఇంటికి కేవలం కొన్ని మీటర్ల దూరంలో నిరంతరం వినిపించే డ్రిల్లింగ్ శబ్దాలు... వారు తమ ఇంట్లోకి వచ్చారని, దానిని ధ్వంసం చేస్తున్నారనే నిజాన్ని ప్రతి క్షణం ఆమెకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. 68 ఏళ్ల కుల్లు, ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా రూర్కెలాకు గంట దూరంలో ఉన్న 'లంజీబెర్నా' అనే చిన్న