ఆర్ధికం

ఎటూ తేలని చర్చలు.. ఆగని యుద్ధం

రష్యా, యుక్రెయిన్‌ల మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి 24 నుంచి కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇరు దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ యుద్ధంలో యుక్రెయిన్‌ సర్వనాశనం కాగా, రష్యా పశ్చిమ దేశాల నుండి ఒంటరి అయింది. యుక్రెయిన్‌పై రష్యా డ్రోన్‌ దాడులు, వైమానిక దాడులు, ఆప్టిక్‌ పైబర్‌ డ్రోన్‌ దాడులు వంటివి జరుగుతున్నాయి. రష్యా పలుసార్లు యుక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపించింది.  రోజురోజుకూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి మొదటి నుంచి అండదండగా నిలుస్తున్న ఐరోపా దేశాలు రష్యా దూకుడుపై ఆగ్రహంతో ఉన్నాయి. యుక్రెయిన్‌ రష్యా మధ్య శాంతి
సమకాలీనం

ఈ మరణాలు ప్రజాస్వామ్య సంక్షోభానికి సూచికలు

కొద్దికాలంపాటు నేను మౌన జీవితంలోకి వెళ్లిపోయాను. కానీ రాజ్య ప్రాయోజిత హింస పెరుగుదల, భారతదేశం అంతటా పునరావృతమయ్యే సంఘర్షణ మరింత లోతైన ప్రతిస్పందనకు బలవంతం చేసింది. మధ్య భారతదేశంలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన హత్యలు విడి ఘటనలు కావు. ప్రజాస్వామ్య ఆరోగ్యం, అట్టడుగు వర్గాలతో వ్యవహారానికి సంబంధించిన విస్తృతమైన, కొనసాగుతున్న సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబాళ్ళ కేశవ రావు @ బసవరాజ్ సహా మావోయిస్టులుగా గుర్తించిన పలువురు వ్యక్తుల మరణానికి దారితీసిన ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన భద్రతా కార్యకలాపాలు మరోసారి ఆదివాసుల ప్రాంతాలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణపట్ల దృష్టిని ఆకర్షించాయి. విభేదాలు, తిరుగుబాటులను
సమకాలీనం

శాంతి చర్చలు-రాజ్యాంగబద్ధత: తెలంగాణలో కాల్పుల విరమణ ఆవశ్యకత

(విర‌సం ఆవిర్భావ దినం సంద‌ర్భంగా జూలై 6న హైద‌రాబాదులో నిర్వ‌హించిన స‌ద‌స్సులో *తెలంగాణ‌లో కాల్పుల విర‌మ‌ణ ఆవ‌శ్య‌క‌త‌* అనే అంశంపై జ‌రిగిన సెష‌న్ కోసం రాసిన పేప‌ర్‌) మావోయిస్టు పార్టీ మార్చి 28న కాల్పుల విరమణ ప్రతిపాదనతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ సూచన చేసింది. ప్రజా ప్రయోజనం కోసం తాను కాల్పుల విరమణకు సిద్ధమనితెలంగాణ ప్రభుత్వం ముందు కూడా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మారణకాండను ఆపివేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడితో సహా
ఆర్ధికం

పశ్చిమాసియాలో అమెరికా యుద్ధోన్మాదం

మనుషుల శవాల గుట్టలపై, ఎముకల కుప్పలపై, రక్త ప్రవాహాలపై రాజ్యపాలనని సుస్థిర పరచుకునే దుష్ట లక్ష్యంతో దోపిడీ పాలకవర్గాలు కృత్రిమ యుద్ధాలు సృష్టస్తాయని, రెండు దేశాలు లేదా రెండు కూటముల మధ్య జరిగే యుద్ధాలు సారాంశంలో తమ సొంత  దేశ పేద వర్గాలపై సాగే యుద్ధాలు అని లెనిన్‌ చాలా స్పష్టంగా చెబుతాడు. సామ్రాజ్యవాద రక్త పిపాసి, పెట్టుబడి లాభాపేక్ష లేకుండా మానవాళి చరిత్రలో జరిగే యుద్ధాలు దాదాపు అరుదు. ఈ యుద్ధ జ్వాలల్లో సామాన్యులే సమిధలవుతారు. తాజా పశ్చిమ ఆసియా పరిణామాలు కూడా దీనికి మినహాయింపు కాదు. పన్నెండు రోజులపాటు జరిగిన యుద్ధం అటు ఇరాన్‌లోను, ఇటు
సమకాలీనం

బీహార్ జైళ్ల నిజస్వరూపం

బీహార్ జైళ్ళను ఎవరైనా ఊహించుకుంటే మేరీ టేలర్ చిత్రించిన చెరగని చిత్రాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు హజారీబాగ్ ఇంకా బీహార్‌లో భాగం. దాదాపు అర్ధ శతాబ్దం తరువాత బి. అనురాధ ఐదేళ్ళు రాజకీయ ఖైదీగా గడిపి అదే హజారీబాగ్ జైలులో ఖైదీల కష్టాలను తన జైలు  కథల్లో చెప్పారు. కాలంతో పాటు అంతా మారుతుంది కానీ బీహార్, జార్ఖండ్ జైళ్లు ఈ మార్పు నియమానికి మినహాయింపులా? విజయ్ కుమార్ ఆర్య ఒక మావోయిస్టు రాజకీయ ఖైదీ. ప్రస్తుతం పాట్నాలోని బేవుర్ జైలులో ఉన్నాడు.. కేంద్రమావోయిస్ట్ పార్టీ  కేంద్ర  కమిటి సభ్యుడనే ఆరోపణ మీద ఎన్‌ఐఏ కేసులో అరెస్టయ్యిన అయ్యాడు.
మీరీ పుస్తకం చదివారా ?

కవిత్వం యుద్ద మైదానమే!

కొన్ని ప్రశంసాపూర్వక వాక్యాలు, మరికొన్ని ముఖస్తుతి పదబంధాలు, ఇంకొన్ని పొగడ్తతో ముంచెత్తి  ఈ కవిని కవిత్వాన్ని అభినందించాలని  కాదు. ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ ఎదో తెలియని బాధ. ఇలా కదా చెప్పాల్సింది. ఇలా కదా మాట్లాడాల్సింది. ఇలా కదా రాయాల్సింది. నివురుగప్పిన నిప్పుకణికలతో మరిన్ని నిప్పుకణికల్ని ఇలా కదా మండించాలి అనిపించింది. ఆలోచింపజేసేలా ఈ కవిత్వం కవి నాయుడు గారి జయన్న రాశారు. తెలంగాణలోని గద్వాల ప్రాంతానికి చెందిన కవి. సామాన్యజనం ఈ సమాజాన్ని ఎలా చూస్తారన్నది వారి చైతన్యం మీద, స్పృహ మీద ఆధారపడి వుంటుంది. కాని కవికి ఈ సమాజం పట్ల మాత్రం బాధ్యత ఉందని
మీరీ పుస్తకం చదివారా ?

గాథలు కావివి.. జీవితాలు

ఇటీవలకాలంలో ప్రగతిశీల ఉద్యమాల్లో ఉన్న కొంతమంది కవులు పద్యకావ్యాలతో అభ్యుదయకవిత్వాన్ని రాస్తున్నారు. ప్రజా సమస్యల్ని, ప్రజల బాధల్ని గాథల్ని కవిత్వంగా రాయడం ఈ మధ్య తెలుగుకవిత్వంలో సహజంగా చూస్తుంటాం. కానీ పద్యంలోనూ ఉద్యమాలను రాయడం ఆరదు. అయితే ఈ పద్యకావ్యాలు ప్రాచుర్యంలోకి పెద్దగా రావడం లేదు. వారు ఎక్కడికక్కడే రాసి పుస్తకాలను ముద్రించుకుంటున్నారు. ఏ జిల్లాకాజిల్లాకే వాళ్ళు పరిమితమవుతున్నా, ప్రపంచాన్నంతా కవిత్వంగా రాస్తున్నారు. ఆ కోవలోకి చెందిన కవి కర్నూలులో కనిపించారు. ఆయన రాసేవన్నీ పద్యాలే. అవి కారల్‌ మార్క్స్‌, లెనిన్‌, చెగువేరా..ఇలా మహనీయుల గూర్చి, ప్రజా ఉద్యమాల గూర్చి, సమస్యలగూర్చి రాస్తుంటారు. వాటిని పద్యాల్లో పరిచయం చేస్తుంటారు.
సమకాలీనం

టెండూ ఆకును అమ్ముకునే  స్వేచ్ఛ కోసం కోరాపుట్ ఆదివాసుల పోరాటం

దేశ వ్యాప్తంగా ఆదివాసులకు కెండు లేదా టెండు ఆకు (బీడీ ఆకు) కేవలం అటవీ ఉత్పత్తి మాత్రమే  కాదు, వారి జీవనాధారం. పొడి నెలల్లో వచ్చే ఈ ఆకులు వేలాది కుటుంబాలకు కాలానుగుణ  ఆదాయాన్ని అందించే హామీనిస్తున్నాయి. కానీ అకారణ ఆలస్యాలు, అమ్ముకోడానికి అనుమతినివ్వడంలో ఆలస్యం, ప్రభుత్వ ఉదాసీన ప్రవృత్తి వల్ల ప్రతీ ఏడాదీ ఇబ్బందులు పడుతున్నారు. పంట కోత పూర్తి స్థాయిలో ఉండగా, రుతుపవనాలు వేగంగా సమీపిస్తున్న నేపథ్యంలో, ఒడిశాలోని కొరాపుట్‌లోని ని బోయిపారిగుడా బ్లాక్‌లోని ఎనిమిది గ్రామ సభలు ఈ సీజన్‌లో తాము సేకరించిన బీడీ ఆకును స్వతంత్రంగా అమ్ముకోవడానికి అనుమతి కోసం ఇంకా వేచి
మీరీ పుస్తకం చదివారా ?

నిప్పులుగా ప్రవహించే కవిత్వం

చాన్నాళ్ళుగా కవి వసీరా గూర్చి అన్వేషిస్తూనే ఉన్నాను. ఇప్పటికి దొరికారు. అప్పుడెప్పుడో ఎక్కడెక్కడో చదివిన కవిత్వం ఇప్పుడు ఒక్కచోట ఇలా వసీరా లోహనది పేరుతో లభించడం కవిత్వప్రేమికులకు...నాకూ ఆనందమే. కవి వసీరా రాసింది మూడంటే మూడు కవిత్వసంపుటాలే. ఎంతలోతుగా రాస్తారు. ఎంతగాఢతగా రాస్తారు. ఇది చదువుతున్నంతసేపూ కవిత్వం కోసమే కవిత్వం రాసిన అనుభూతి కలిగింది. ఆపకుండా చదివించాడీకవి. గుండెకు ప్రకంపనం కలిగింది. కవిత్వం చదువుతున్నంత సేపూ హృదయం లయాత్మక విన్యాసమైంది. ఎనబయ్యోదశకంలోనే ఎంతో గొప్ప కవిత్వం రాశారు. ఇప్పటికది అవసరమని భావించి ఈ కవిత్వం గూర్చి నాల్గుమాటలు రాయాలనిపించింది.          ‘అన్నా! నాకు నిరుద్యోగం వచ్చింది’ అని                
సమకాలీనం

మావోయిస్టులు ఎందుకు ఆయుధాలు విడిచిపెట్టరు?

భారత ప్రభుత్వానికి ప్రకటన రూపంలో శాంతి చర్చలు ప్రారంభించడానికి నిషేధిత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తమ సంసిద్ధతను తెలియజేసిన తరువాత,  భారత ప్రభుత్వ నాయకత్వం తాను బస్తర్‌లో శాంతి కోసం కట్టుబడి ఉన్నానని విశాల ప్రపంచానికి చూపించడానికి అనేక వాక్చాతుర్య ప్రకటనలు చేసింది. ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకుల పైన కూడా 'అర్బన్ నక్సల్స్'గా ఎర్ర ముద్ర వేసే పనిలో తీరిక లేకుండా ఉన్న గృహమంత్రి అమిత్ షా, నక్సలైట్లను తన సోదరులుగా భావిస్తున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించాడు. అమిత్ షా బహిరంగంగా శాంతి కేకలు వేస్తున్నప్పటికీ, ఆయన ఆధ్వర్యంలోని భద్రతా బలగాలు బస్తర్‌లో మావోయిస్టుల ఊచకోతను