పత్రికా ప్రకటనలు Press notes

చ‌ల‌ప‌తి, విజ‌య‌వ‌ర్ధ‌న‌రావుల విడుదలకై పోరాడుదాం

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని అన్ని రాజ‌కీయ పార్టీల‌కూ, ప్ర‌జాసంఘాల‌కూ జీవిత ఖైదీల విడుద‌ల సాధ‌న స‌మితి త‌ర‌పున ఆహ్వానం. మిత్రులారా.. చిల‌క‌లూరి పేట బ‌స్సు ద‌హ‌నం కేసు మ‌న‌లో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. 1993 సంవ‌త్స‌రంలో జ‌రిగిన ఆ దుర్ఘ‌ట‌న కు బాధ్యులైన చ‌ల‌ప‌తిరావు విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు సంఘ‌ట‌న జ‌రిగిన రెండు మూడు రోజుల‌కే అరెస్ట్ అయ్యారు. వారు ఆ నేరం బ‌స్సులో ఉన్న వారిని చంపాల‌నే ఉద్దేశ్యంతో చేయ‌లేదు. కేవ‌లం బ‌స్సులో ప్ర‌యాణికుల‌ను బెదిరించి దోపిడీ చేసే ఉద్దేశ్యంతో మాత్ర‌మే చేశారు. అయితే అనుకోని విధంగా బ‌స్సు ద‌హ‌నం జ‌రిగిపోయింది. చ‌ల‌ప‌తి విజ‌య‌వ‌ర్ధ‌న‌రావులు అరెస్ట్ అయిపోయారు.
పత్రికా ప్రకటనలు

హర్యానా, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులు, మానవ హక్కుల కార్యకర్తల ఇండ్లపై ఎన్ ఐ ఏ  దాడులు

భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సంస్థలు భీమా కోరెగాన్ కేసులో వ్యవహరించినట్టుగానే ఈ శాన్య రాష్ట్రాల్లో కూడా  అసమ్మతిని అణచివేయడానికి దారులు వెతుకుతున్నాయి. విద్యార్థి నాయకులను, మానవ హక్కుల కార్యకర్తలను భీమా కోరెగాన్ కేసులో లాగానే కుట్రకేసుల్లో ఇరికిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారంతా  సీపీఐ(మావోయిస్టు)ల కోసం పనిచేస్తున్నారని, ‘ఉత్తర ప్రాంతీయ కమిటీ ని ’ (నార్తన్ రీజినల్ బ్యూరో) ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని ఎన్ ఐ ఏ ఆరోపిస్తోంది. రైతుల కోసం, అట్టడుగు వర్గాల వారి కోసం, విస్థాపన సమస్యకు గురైన  వారి కోసం పనిచేస్తున్న వారిని భారత ప్రభుత్వం అరెస్టు చేసింది. సీపిఐ (మావోయిస్టు) తరపున
పత్రికా ప్రకటనలు

Uniting for Justice: A Global Solidarity Call

On the occasion of the International Day of the World's Indigenous Peoples (August 9), the Solidarity Forum for Adivasi Rights Struggle, based in the southern Indian states of Telangana and Andhra Pradesh, urges the global community to join in observing Solidarity Week from August 9 to August 15, 2024. This solidarity week is dedicated to supporting the ongoing struggles and advocating for the rights of Adivasis, the Indigenous people of
పత్రికా ప్రకటనలు

ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణను సామాజిక న్యాయ భావనగా చూడాలి

ఎస్సీ కులాలు వేల సంవత్సరాలుగా అంటరానితనాన్ని, సామాజిక వివక్షను అనుభవించాయి. సంపద మీద హక్కు లేకుండా ఆర్థిక వెనుకబాటుతనాన్ని చవిచూస్తున్నాయి. రాజ్యాంగంలో ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు కల్పించినా, చారిత్రక, సామాజిక కారణాల వల్ల వాటి పంపిణీలో అసమానతలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 341 ప్రకారం ఎస్సీ ఉప కులాలకు రిజర్వేషన్‌ ఫలాలను అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆగస్టు 1, 2024, గురువారం ఇచ్చిన తీర్పును విప్లవ రచయితల సంఘం స్వాగతిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలు వెంటనే ఎస్సీ రిజర్వేషన్‌ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఈ విద్యా సంవత్సరం
పత్రికా ప్రకటనలు

జార్ఖండ్‍లో ఆపరేషన్ క్లీన్‍ను ఆపాలి

ఆపరేషన్ క్లీన్‌లో భాగంగా భారత ప్రభుత్వం ఆదివాసీ రైతులపై అమలు జరుపుతున్న రాజ్య భీభత్సం గురించి జార్ఖండ్ నుండి వార్తలు వస్తున్నాయి. ఈ ఆపరేషన్ క్లీన్‌లో భాగంగా భారత రాజ్యం జార్ఖండ్‌లోని కోల్హాన్ డివిజన్‌లో కొత్త ముందస్తు కార్యాచరణ క్యాంపులను (ఫార్వర్డ్ ఆపరేషనల్ క్యాంపు) ఏర్పాటు చేస్తోంది. ఆపరేషన్ అనకొండ కంటే ముందు ఆపరేషన్ క్లీన్‌లో భాగంగా కొల్హాన్ సమీపంలోని సరండ అడవులలో ప్రభుత్వ బలగాల ఆధ్వర్యంలో హింసకాండను అనుభవించిన ఆదివాసీలు, ముఖ్యంగా పశ్చిమ సింగ్‌భూం జిల్లాలోని కొల్హాన్ డివిజన్‌లోని వాడ్, లిపుంగా ప్రాంతాలలో ప్రజలు, ఈ క్యాంపులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో నిరసన
పత్రికా ప్రకటనలు

ఆదివాసులపై  సైనిక దాడిని ఖండించండి

ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, జాతి హంతక బ్రాహ్మణ హిందుత్వ ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్-బిజెపి గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడం పేరిట ఆదివాసీ ప్రజలపై యుద్ధాన్ని, మారణహోమాన్ని ఉధృతం చేసింది. మైనింగ్ కార్పొరేట్ యజమానులను ప్రసన్నం చేసుకోవడానికి, విప్లవ ప్రజానీకం నేతృత్వంలో భూమి, నీరు, అడవి సంరక్షణ కోసం జరుగుతున్న పోరాటాన్ని నిర్మూలించడానికి ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ గ్రామాల్లో ఈ సంవత్సరం ప్రారంభం నుండి, ఐజి సుందర్‌రాజ్ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం వేలాది మంది పారామిలటరీ బలగాలను, కిరాయి మిలీషియాలను మోహరించింది. సంవత్సరం ప్రారంభం నుండి వారు 30 మంది కంటే ఎక్కువ
పత్రికా ప్రకటనలు

నిర్బంధంలో ఆదివాసీ నేతసుర్జు టేకమ్‌

సర్వ ఆదివాసీ సమాజ్ ఉపాధ్యక్షులు, బస్తర్ జన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కన్వీనర్, సుర్జు టేకమ్‌ను 2024ఏప్రిల్ 2  న క్రూర ఉపా, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్  కింద అరెస్టు చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. సుర్జు "మావోయిస్ట్ సానుభూతిపరుడు" అనే సాకుతో తెల్లవారుజామున 4 గంటలకు, ఛత్తీస్‌గఢ్‌లోని మన్‌పూర్-మొహ్లా-అంబగఢ్ జిల్లాలోని కల్వార్ గ్రామంలోని అతని ఇంటి నుండి బలవంతంగా తీసుకెళ్లారు. సాక్షుల వాంగ్మూలాల ప్రకారం, అతని ఇంట్లో జరిగిన మొదటి దఫా సోదాలో పోలీసులు, పారామిలటరీ సిబ్బందికి ఏమీ దొరకలేదు. కానీ ఆ తర్వాత వారు తిరిగి లోపలికి వెళ్లి, సర్జు టెకామ్ మావోయిస్టు సానుభూతిపరుడు,
పత్రికా ప్రకటనలు

WTO నుంచి బైటికి రావాలి

"డబ్ల్యుటిఓను విడిచి పెట్టండి " అనే నినాదంతో సంయుక్త్ కిసాన్ మోర్చా యిచ్చిన పిలుపును దేశంలోని 400 జిల్లాల్లో ట్రాక్టర్ ప్రదర్శన  జరిగింది. రైతులు డబ్ల్యుటిఓ దిష్టి బొమ్మను కాల్చారు. డబ్ల్యుటిఓను వదిలి పెట్టాలని డిమాండ్ చేసారు. రైతులపై కాల్పులు, దాడులకు గృహ మంత్రి అమిత్ షా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజల్‌ను బాధ్యులుగా పేర్కొంటూ వారి రాజీనామాను డిమాండ్ చేసింది.  పంజాబ్‌ను విచ్ఛిన్నం చేయడానికి, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఈ అంశాన్ని ఉపయోగించి  ఎన్నికల ప్రయోజనాన్ని పొందటానికి, పంజాబ్ రైతులపై తీవ్ర అణచివేతకు కుట్ర పన్నడానికి నేరుగా బాధ్యుడని కేంద్ర
పత్రికా ప్రకటనలు

పోరాడుతున్న రైతులకు అండగా నిలబడదాం!!

2022లో ఏడాదిపాటు సాగిన రైతుల సమ్మె యావత్ దేశానికి స్ఫూర్తినిచ్చింది. అన్ని దురభిమానాలను, అధికార దురహంకారాలను ఓడించి ఆ పోరాటం విజయవంతంగా ముగిసింది. రైతులు లేవనెత్తిన డిమాండ్లను అంగీకరిస్తూ ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించింది. 1) తుది విశ్లేషణలో దేశానికే హాని కలిగించే మూడు రైతు చట్టాల ఉపసంహరణ 2) ఎమ్.ఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన కనీస మద్దతు ధర అమలు 3) సమ్మె సంబంధిత కేసులు ఉపసంహరణ 4) సమ్మెలో మరణించిన వారి కుటుంబాలకు తగిన పరిహారం 5) వ్యవసాయ రుణాల మాఫీ 6) విద్యుత్ బిల్లులను తగ్గింపు - అమలు చేస్తామని ప్రభుత్వం హామీ
పత్రికా ప్రకటనలు

తొలి తరం విప్లవ రచయితశ్రీపతికి నివాళి

ప్రముఖ కథా రచయిత శ్రీపతి(పుల్లట చలపతి) ఫిబ్రవరి 7వ తేదీ హైదరాబాదులో మరణించారు. ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం భైరిపురం. హైదరాబాదులో ఉపాధ్యాయుడిగా, ఆ తర్వాత ఢల్లీిలో ఆలిండియా రేడియో న్యూస్‌ రీడర్‌గా పని చేసి తిరిగి హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. ఆయన కథా రచనలోకి ప్రవేశించాక కొద్ది కాలానికి శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం ఆరంభమైంది. ఆ పోరాటానికి ప్రతిస్పందించిన తొలి తరం విప్లవ రచయితల్లో, బుద్ధిజీవుల్లో శ్రీపతి ఒకరు. శ్రీకాకుళ పోరాట నాయకులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంతో, సుబ్బారావు పాణిగ్రాహితో ఆయనకు ప్రత్యక్ష సంబంధం ఉండేది. అందువల్ల కూడా ఆ పోరాట