విరసం మహాసభలను విజయవంతం చేసిన సాహితీ మిత్రులకు, రచయితలకు, ప్రజాసంఘాలకు, విప్లవాభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు.
అనేక నిర్బంధాలు, ఒత్తిళ్ళ మధ్య విరసం 28వ మహాసభలు నెల్లూరులో విజయవంతంగా ముగిశాయి. *సాంఘిక విముక్తి కోసం ప్రత్యామ్నాయ సంస్కృతి* లక్ష్యంగా సంస్కృతి - మార్క్సిజం ఇతివృత్తంగా తలపెట్టిన ఈ మహాసభల సన్నాహాల దగ్గరి నుండి చివరి దాకా నెల్లూరు మిత్రుల సహకారం మరువలేనిది. వీళ్లంతా విరసం పనిని తమ పనే అనుకొని ముందుకు వచ్చారు.అడిగిన వెంటనే వేదిక ఇవ్వడానికి ముందుకొచ్చిన సంఘమిత్ర స్కూల్ యాజమాన్యం అర్ధరాత్రి పోలీసుల బెదిరింపులు ఎదుర్కోవలసి వచ్చింది. ఏకంగా స్కూల్ గుర్తింపును రద్దు చేయిస్తామనే దాకా పోలీసులు వెళ్లారు. ఇది రాజ్య దుర్మార్గానికి పరాకాష్ట.భిన్నాభిప్రాయాలను చర్చించలేనితనం, సహించలేనితనం ఫాసిస్టు లక్షణం. గత కొన్నేళ్లుగా