నువ్వేమో బూడిద అస్థికలు గంగలో కలుపుతావు మంత్రోచ్చారణల మధ్య
లేని మోక్షాన్ని కాంక్షిస్తావు
మా వాడిని కడచూపు ని కూడా చూడనివ్వవు
మా వాడు బతికున్నన్నాళ్ళు దడిసావు
చంపేసాక కూడా ఎక్కడ దింపుడు కల్లం లో లేసి వస్తాడేమోనని వణికావు
మా వాడికి బూడిద ఎముకలు కర్మకాండలు అన్నీ భ్రాంతి అని తెలుసు
ఏదో పిచ్చి తల్లి వృద్ధాప్యంలో కొడుకును చూడాలనుకుంది
అదీ తీరకుండానే చేసింది తాను నమ్ముకున్న మతాన్ని అడ్డుపెట్టుకుని ఏలుతున్న ఏలిక
అహంతో చేసిన నిర్బంధాల మధ్య
ఐదు వందల మంది చేసిన భోజనాల్లో
మా వాడిని సిక్కోలు యాది చేసుకుంది
ఆ నివురు గప్పిన నిప్పు రవ్వ ఆరదు
ఆకలి ఆవాసం ఉడుపు తీరనంత కాలం రగులుతూనే ఉంటుందనే చారిత్రక సత్యం!!

Ganga lo kalupadam…mantroccarana—-all are bogus beliefs
====================================
Buchireddy gangula