వర్తమానం

వెనుజులాపై దాడి – సామ్రాజ్యవాద సాధారణ ఆర్ధిక సంక్షోభానికి పరాకాష్ట

జనవరి 3 వ తేదీ అర్ధరాత్రి వెనుజులా రాజధాని కారకాస్ లోని అధ్యక్ష భవనంపై 200 మంది అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్రత్యేక బలగాలు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన జీవిత సహాచరిని ఎత్తుకెళ్లి అక్రమంగా అమెరికాలో నిర్భంధించారు.ఈ కిడ్నాప్ కు ముందు ఏ అంతర్జాతీయ సంస్థలలో ఏలాంటి చర్చా లేదు.అమెరికా చట్ట సభ కాంగ్రెస్ అనుమతి కూడా లేకుండా అధ్యక్షుడు ట్రంప్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.1989 లో పనామా దురాక్రమణ తరువాత లాటిన్ అమెరికా ప్రాంతంలో అమెరికా మిలటరీ చేసిన ఈ దురాక్రమణ పూరిత సామ్రాజ్యవాద దాడిని ఇతర ఖండాల,భూభాగాలలోని జాతుల రాజ్యాలైన
ఈ తరం సాహిత్య విమర్శ

ఏదీ విమర్శ?

తెలుగు సాహిత్యంలో విమర్శ తిరోగమనదిశగా ప్రయాణం చేస్తుందనే చెప్పవచ్చు. విమర్శ పేరుతో రాస్తున్నవన్నీ విమర్శకుండే మౌలికసూత్రాలకు అనుగుణంగా రాయడం లేదనే అపవాదు ఇటీవల బలంగా వినిపిస్తున్నది. అసలు విమర్శకుని కర్తవ్యం ఏమిటి? ఒక పుస్తకాన్ని ఎలా పరీక్ష చేయాలి? కవిత్వమైతే కావ్యపరీక్ష ఎలా చేయాలి? కథ అయితే వర్తమాన సమాజంతో పోల్చి ఎలా చెప్పాలి? నవల ప్రయాణం ఎలా సాగింది? ఇలా సాహిత్య ప్రక్రియలన్నింటినీ ఎలా మూల్యాంకనం చేయాలన్నదే విమర్శలో కీలకం. ఎవరెన్ని చెప్పినా విమర్శకు మార్క్సిజమే పునాది రాయి అనే విషయాన్ని ఎప్పుడైతే విమర్శకులు విస్మరిస్తారో విమర్శప్రయాణం తిరోగమనమే. ఈ ముగ్గుర్ని చదవకుండా విమర్శ చేస్తున్నారు! విమర్శకులకు
నివాళి

ప్ర‌జా యుద్ధంలో, ప్ర‌త్యామ్నాయ నిర్మాణంలో పాక హ‌నుమంతు

ప్రజాయుద్ధ నాయకుడు, దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి, మావోయిస్టు ముఖ్య నేత కామ్రేడ్ పాక హనుమంతు అలియాస్ వుయికె గణేష్ డిసెంబర్ 25న ఒడిశా లో అమరత్వం, 28వ తేదీన అన్ని ఆటంకాలను, కుట్రలను దాటుకొని పోరాటాల నల్లగొండ జిల్లా, చండూరు మండలం, పుల్లెంల గ్రామంలో తను పుట్టిన గడ్డమీద ఆ మహా నాయకుడి పార్థివ దేహానికిఅత్యంత గౌరవపూర్వకంగా జరిగిన అంతిమయాత్రలో అంతే చైతన్య పూర్వకంగా వేలాదిమంది పాల్గొని ఎర్రెర్రని నివాళులు అర్పించిన సందర్భంగా గణేష్ అన్నకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు, (2000 సంవత్సరం నుండి 2013 వరకు సంబంధించినవి). ఇప్పుడు ఆపరేషన్ కగార్ ను  భూతద్దంలో చూపెడుతూ, దాని
కవిత్వం

అంతం తప్పదు

శాంతి పావురాలను చిదిమేసే "శాంతిదూత" జగానికి "ప్రేమ" దిక్సూచిననిప్రకటిస్తున్నాడు ఆక్రమణదురాక్రమణలతో శాంతిని నెలకొల్పుతానంటున్నాడు ప్రపంచ దేశాలసంపదను దోచుకునేముఠా నాయకుడు..మారణహోమం జరిపేరక్త పిపాసిఆనందంగా ఉండే అన్నాతమ్ముళ్లకీ చిచ్చుపెట్టే జిత్తులమారి నక్కపెట్టుబడిదారీ రక్కసిజగత్తుపై జరిపేహింసోన్మాదానికి నల్ల రాజు తర్వాతిబంటు ఈ తెల్లవాడు..తెలుపు, శాంతికి చిహ్నంఈయన మనసు, అశాంతి క్రోధానికి నిలయం..విశ్వవ్యాప్తంగా పెల్లుబికేప్రజా వెల్లువలోఆకలి మంటల్లోనిరుద్యోగపు జ్వాలల్లో..శ్వేతసౌధం నిశ్శేషం కాక మానదు.యుద్ధోన్మాది అంతం తప్పదు..
తొలికెరటాలు

దొంగ సారా: ఒక విషాద సామాజిక చిత్రణ

భారతక్క (ఎండపల్లి భారతి) రచనలో ఊర్లో మనుషుల మధ్యలో ఉండి వాళ్ల మాటలు విన్నట్టు అనుభవమవుతుంది. ఆమె రాత అంత సహజంగా, ఏబ్బేట్టుగా లేకుండా ఉంటుంది – చదువుతుంటే ఊరి గాలి, మాటలు, బాధలు కళ్ల ముందు కనిపిస్తాయి. భారతక్క పుస్తకం చదివితే సారా కాయడం, అమ్మడం ఊర్లలో ఎంత పెద్ద సమస్యో అర్థమవుతుంది. ఇది కేవలం తాగుడు సమస్య కాదు – ఇది ఆర్థికం, సామాజికం, రాజకీయం కలిసిన పెద్ద విషాదం. సారా కాయడం – దాని వాస్తవ రూపం ఒకప్పుడు సారా సోక్కంగా (సహజంగా, సాంప్రదాయ పద్ధతిలో) తయారు చేసేవారు. కానీ తరువాత లాభం కోసం
సంభాషణ

కళింగనగర్ (ఓడిశా)ఆదివాసీ మృత వీరులకు జోహార్లు

జనవరి 2,2006 న నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని బిజెడి-బిజెపి ఉమ్మడి ప్రభుత్వ పోలీసుల కాల్పుల్లో సామూహికంగా హత్య చేయబడ్డ 14 మంది కళింగనగర్ (ఓడిశా) ఆదివాసీ మృత వీరులకు జోహార్లు. కార్పోరేట్ కంపెనీల కోసం సాగిన బలవంతపు భూసేకరణ,గ్రామాల ధ్వంసం, భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా 2005 నుండి కళింగనగర్ ఆదివాసులు వీరోచితంగా పోరాడుతున్న క్రమంలో జనవరి 2, 2006 న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం జరిపిన పోలీసు కాల్పుల సామూహిక మారణకాండలో 14 మంది ఆదివాసీలు మృతి చెంది నేటికి 20 సంవత్సరాలు.ఇంకా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేసే క్రమంలో
కవిత్వం

వసంతం

వసంతం వచ్చినప్పుడుపువ్వులు ఒక్కసారిగా వికసించవుఅవి అప్పుడే నేలపై వెలిసినట్లుమన కళ్ళకు మాత్రమే అలా కనిపిస్తాయి పూసే ముందుభూమి గర్భంలోనే ఉంటాయిచీకటిలో మాటలులేని తపనతోతమ రంగును శ్వాసలా దాచుకుంటాయిఎవరికీ చేరని లోతుల్లోవాన చప్పుడు వింటాయివేళ్ల నరాల ద్వారాకాలం చేసిన గాయాలను తట్టుకుంటూ నిలబడుతాయి వసంతం అంటేపువ్వుల ఉత్సవం కాదుచీకటిని ఓర్చుకున్నభూమి గుండె తిరుగుబాటు చేసిన క్షణంఅందుకేప్రతి పువ్వు ఒక గాయమేఆ గాయమేఈ ప్రపంచాన్ని పరిమళభరితం చేస్తుంది.
పత్రికా ప్రకటనలు

త్వరలో.. ఈ తరం సాహిత్య విమర్శ ప్రారంభం

తెలుగు సాహిత్యంలోకి  అనేక జీవ‌న మూలాల నుంచి కొత్త త‌రం ర‌చ‌యిత‌లు వ‌స్తున్నారు. కొత్త అనుభ‌వాలను ప‌రిచ‌యం చేస్తున్నారు.  అద్భుత నిర్మాణ ప‌ద్ధ‌తుల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. చాలా ప్ర‌శంస‌నీయ‌మైన ఈ కృషిలో   ఈ కాలపు జీవ‌న సంఘ‌ర్ష‌ణ ఎంత ఉన్న‌ది?  యువ ర‌చ‌యిత‌లు దాన్ని ఎంత మేర‌కు ఒడిసిపట్టుకోగ‌ల‌గుతున్నారు?  జీవితంలోని మార్పు క్ర‌మాల‌ను ఎంత లోతుగా, సంక్లిస్టంగా, తార్కికంగా చిత్రించ‌గ‌లుగుతున్నారు?  అనే ప్ర‌శ్నలు కూడా ఉన్నాయి. ఇలాంటివి  అన్ని త‌రాలు ఎదుర్కొన్న‌వే. సాహిత్య విమ‌ర్శ ఈ స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చ‌నీయాంశం చేయాలి. ప‌రిష్కారం చూపాలి.  తెలుగు  సాహిత్య రంగంలోకి కూడా సంఖ్యాప‌రంగా త‌క్కువే కావ‌చ్చుగాని,   కొత్త తరం ప్రవేశించింది.  ర‌చ‌యిత‌లైనా, విమ‌ర్శ‌కులైనా,
సమకాలీనం

భీమా కోరెగావ్ శౌర్య దివ‌స్ లో మనువాద వ్య‌తిరేక స్ఫూర్తి 

దేశంలోని మెజారిటీ ప్రజలపై మనువాద అణచివేత, దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2025, అక్టోబర్ ఆరవ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పై మనువాద భావజాలం కలిగిన ఒక లాయర్ బూటుతో దాడి చేశాడు. అనంతరం ఆ వ్యక్తి మాట్లాడుతూ తన మతానికి చెందిన దేవునిపై న్యాయమూర్తి వ్యాఖ్యలను నిరసిస్తూ దాడిచేశానని తనకు పశ్చాతాపం లేదని చెప్పారు. ఆ వ్యక్తిపై  కనీసం కేసు కూడా నమోదు కాలేదు.  అదే నెల 7 వ తేదిన హర్యానాలో కుల వివక్షత భరించలేక ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ సూసైడ్ చేసుకొన్నారు. అతను యస్సీ కులానికి చెందినవారు కావడంతో
ఓపెన్ పేజీ

హద్దులు లేని ద్రోహ చింతన

అప్రియ వచనాలు మాట్లాడనవసరం లేకుంటే బాగుండు. వ్యక్తులనుద్దేశించవలసిన కానికాలాన్ని ఎవరం కోరుకుంటాం? సత్యమే గీటురాయి అనుకుంటాంగాని, అందరికీ సత్యమే పరమం కానవసరం లేదు. ప్రకృతిలో తిరుగులేని సత్య భావన సమాజంలో తరచూ భంగపడుతూ ఉంటుంది. ప్రయోజనాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు సత్యాన్ని బతకనీయవు. కనీసం అందరికీ ఆమోదమయ్యే సత్యంగా నిలబడనివ్వవు. అందువల్ల సమూహాలతోపాటు మనుషులనూ ఉద్దేశించే సంభాషణ సాగవలసి వస్తుంది. విప్లవంలోని అనన్య సామాన త్యాగాల గురించి మాట్లాడటానికి ముఖం మొత్తిన కొంద‌రు మేధావులు సహితం ద్రోహాన్ని ద్రోహమని చెప్పేసరికి లేచి కూచున్నారు. ఎవరి ప్రియాలు వారివని సరిపెట్టుకోవచ్చు. కానీ సత్యాన్ని దాచేద్దామనుకున్నాక మాట్లాడక తప్పదు కదా. ద్రోహం గురించి