భారత్‌ను ఆవరిస్తున్న ఆర్థిక మాంద్యం
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో మనదేశ పరిస్థితి చూస్తే రూపాయి విలువ వెలవెలపోతూ… రికార్డు స్థాయి పతనాన్ని చవి చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చరిత్రలోనే ఇదివరకూ ఎప్పుడూ లేని స్థాయిలో రూపాయి పతనమయ్యింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్ల పెంపునకు తోడు పలు దేశీయ కారణాలతో సెప్టెంబర్ 27న రూపాయి విలువ 82కు పతనమయ్యింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెటులో డాలరుతో రూపాయి మారక విలువ అక్టోబర్ 19న ఏకంగా 79 పైసలు కోల్పోయింది. తొలిసారి రూపాయి మారకం విలువ 83.20కి క్షీణించింది. రూపాయి మారక విలువ చరిత్రలోనే ఇది అతిపెద్ద పతనం. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రూపాయి మారకం










