భావ స్వేచ్ఛకు డిజిటల్ సంకెళ్లు
కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడేళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చే ముందు జరిగిన ప్రచార ఉధృతిలో చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. సామాన్యులకు, సంక్షోభంలో ఉన్న రైతులకు, అణగారిన వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగే ఒక్క చర్య చేపట్టలేదు. సమర్థ పాలన స్థానే అసమర్థత, ఏ మాత్రం పారదర్శకత, సమిష్టి నిర్ణయాలు లేని, నియంతృత్వ పోకడలున్న పాలకుడే మోడీలో కనిపిస్తాడు. కొవిడ్ మహమ్మారి విలయ తాండవం చేసిన, చేస్తున్న కాలంలోనూ మోడీ, ఆయన లెప్టినెంట్ అమిత్ షాల అనాలోచిత, ప్రజావ్యతిరేక చర్యలు దేశ అభివృద్ధిని అతలాకుతలం చేశాయి. మోడీ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి.