సమకాలీనం కాలమ్స్

తబ్లీగీ జమాత్ కరోనా జిహాద్ అయితే మరి కుంభమేళా?

"కరోనా ఆయా౼ మౌలానా లాయా" అనే వ్యంగ్యపూరితమైన, అపహాస్యమైన, అవమానకరమైన, నేరారోపణతో కూడిన ఈ మాటలు గత సంవత్సరం సామాజిక మాధ్యమాలల్లో ప్రదానంగా ఉత్తర భారతంలో ఎక్కువగా వినిపించినవి. కరోనా చైనా సరిహద్దులు దాటి ప్రపంచాన్ని చుట్టేసే తరుణంలో అంతటా అలుముకున్న భయం భారతదేశం లోను విస్తరించింది. మునుపెన్నడూ చూడని ఒక మహా విపత్తు  అన్ని దేశాలను వణికించింది. యూరప్ లో అతి వేగంగా విస్తరించి, అమెరికాను ముంచెత్తిన కరోనా ఇండియా ను చేరడానికి పెద్దగా ఆలస్యమేమి చేయలేదు. ప్రపంచ వైద్య రంగం ఎన్నడూ ఎరుగని, అంతుపట్టని అదృశ్య జీవి సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఆ
కథావరణం కాలమ్స్

“దుఃఖానికి ఆసరా మనిషే!-అంటున్న కథ

ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. మనిషి లోపలి ఒంటరితనాల గురించి, బాహ్యప్రపంచంలో మనిషి ఎదుర్కొనే  ఒంటరితనాల గురించిన కథలు మనల్ని కల్లోల పరుస్తాయి. కలవర పెడతాయి. అప్పటిదాకా రాని ఆలోచనలు ఇలాంటి కథలు చదివితే కొత్తగా పుట్టుకు వస్తాయి. ఏవో ఖాళీలు, ఏవో అంతరాలు, మరేవో అడ్డుగోడలు ఒక్కసారిగా కథలో కనిపిస్తాయి. అవన్నీ అంతకు ముందు మనం చూసినవే, అయినా చూసినా  నిజంగా చూడలేనివి. అప్పటిదాకా చూసినదాన్నే, చూసినా చూడలేని దాన్నే కొత్తగా చూపించేవే మంచి కథలు. నడవడం స్థానంలో పరిగెత్తడం మొదలయ్యాక వేగం పెరిగాక, మనుషులకు దూరంగా మనుషులు కదలటం మనుషులు దూరంగా మనుషులు వెళ్లిపోవడం చాలా
ఆర్ధికం

డీ-డాలరైజేషన్

మొదటి ప్రపంచ యుద్ధ అనంతరం 1920ల నుండి అమెరికా డాలర్‌, బ్రిటన్‌ పౌండ్‌ స్టెర్లింగ్‌ను అంతర్జాతీయ రిజర్వ్‌ కరెన్సీగా   స్థానభ్రంశం చేయడం ప్రారంభించింది. యుద్ధం తర్వాత బంగారం ప్రవాహాలలో అమెరికా గణనీయమైన గ్రహీతగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మరింత బలమైన సూపర్‌ పవర్‌గా అవతరించింది.1944 నాటి బ్రెట్టన్‌ వుడ్స్‌ ఒప్పందం రెండవ ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను స్థాపించింది. దీంతో అమెరికా డాలర్‌ అంతర్జాతీయ వాణిజ్యం కోసం ప్రపంచంలోని ప్రాథమిక రిజర్వ్‌ కరెన్సీగా మారింది. యుద్ధానంతర కరెన్సీ బంగారంతో ముడిపడి ఉన్న ఏకైక అంతర్జాతీయ కరెన్సీ, ట్రాయ్‌ ఔన్సుకు 35 డాలర్లుగా స్థిరీకరించింది.
ఆర్ధికం

ఆహార నిల్వలున్నచోట  అకలి కేకలు

 ఎ.నర్సింహారెడ్డి           వ్యవసాయ రంగంలో వినూత్న పరిశోధనల ఫలితంగా పంటల ఉత్పత్తి పెరుగుతున్నా నేడు చాలా దేశాల్లో ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్న దీనదృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు పర్యావరణ విధ్వంసం, వీటికి తోడు అనేక దేశాల్లో అంతర్గత యుద్దాలు వెరసి ఆహారకొరత కోట్లాది మంది జీవితాలను నరకంగా మారుస్తున్నది. ప్రపంచంలో ప్రతి తొమ్మిది మందిలో కనీసం ఒకరు తగిన ఆహారానికి నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి నివేదికలు నిగ్గుతేల్చాయి. తగిన పోషకాహారం అందక పేద దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లోనూ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పోషకాహార లోపం మహిళలు, పిల్లల పాలిట
సమకాలీనం

చేయని నేరానికి ..

ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని ఆదివాసీ గ్రామాల్లో విషాదకర స్థితి ఏర్పడింది . ఇక్కడి ఆదివాసీలు తమ హక్కులు, గౌరవం, మనుగడ కోసం ప్రతిరోజూ పోరాడుతున్నారు. ఈ ప్రాంతంలో బెదిరింపులు, పేదరికం, పోలీసు క్రూరత్వాలు వారి జీవితాలను అనిశ్చితిలోకి నెట్టాయి; ఇక్కడ ప్రతి రోజు వారికి ఒక కొత్త సవాలును తెస్తుంది. వారు తమ స్వరాన్ని పెంచే ప్రయత్నాలకు పోలీసుల నుండి నిరాశ, ఉదాసీనత మాత్రమే ఎదురౌతాయి. సోన్‌భద్ర ఆదివాసుల పట్ల పోలీసుల ప్రవర్తన వారి వాస్తవికతను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. భూమిపై శాశ్వత యాజమాన్యం లేదా ఆర్థిక శక్తి లేని పేద ఆదివాసీలు శక్తివంతమైన పోలీసుల నుండి అణచివేతను ఎదుర్కొంటున్నారు.
మీరీ పుస్తకం చదివారా ?

“గాయాలు ఈనాటివి కావు…”

జీవితాన్ని విశ్లేషించడం ఒక్క సాహిత్యానికి మాత్రమే సాధ్యమౌతుంది. మనిషిలోని మనిషితనం, మనసుతనం చెప్పడమే కాదు, ఈ ప్రపంచాన్ని చిటికెన వేలు పట్టి నడిపించేది కూడా కవిత్వమే. కవికి కవిత్వ వస్తువుల్ని వర్తమాన ప్రపంచమే అందిస్తుంది. ఈ ప్రపంచం అందించే వస్తువును గూర్చి  డా.కిన్నెర శ్రీదేవి ‘‘కవిత్వం వాస్తవ ప్రపంచంలోని నిర్ధిష్ట విషయాన్ని రచయిత సౌందర్యాత్మకంగా వ్యాఖ్యానించి మదింపు చేయడం వలన అది సాహిత్య వస్తువౌతుంది’’ అంటారు. అటువంటి నిర్ధిష్టమైన విషయంతో,  వస్తువును సౌందర్యాత్మకంగా.. మనసును లయాత్మకంగా విన్యాసం చేయించే కవిత్వం ఇటీవల వచ్చిన "వెన్నెల కురవని రాత్రి". ఈ కవిత్వాన్ని అందించిన కవి కర్నూలు జిల్లాకు చెందిన స్వయంప్రభ.
కథ..కథయ్యిందా! కాలమ్స్

పితృస్వామ్యపు విరుగుడు ను చిత్రించిన చాయ్ గ్లాసు

చాయ్ గ్లాసు కథను రాసింది , నిత్య. ఈ కథ మొదట అరుణతారలో అచ్చయ్యాక , సామాన్యుల సాహసం కథాసంకలనంలో కూడా వచ్చింది.కథ, పదకొండేళ్ల వ్యవధితో మూడు దృశ్యాలను చిత్రిస్తుంది. 1994నుంచి 2005 మధ్య దండకారణ్యంలో ఆదివాసీ సమూహంలో నూతన మానవులు ఎలా ఉధ్భవించారో చెబుతుంది కథ. కథలోని  కథకురాలు 1994లో పారెనార్ గ్రామానికి రావడం, అక్కడ ఒక చిన్న పిల్లవాడి ప్రవర్తనలో పితృస్వామ్యాన్ని ఆమె గమనించడం. ఆలోచనలో పడటం. రెండో దృశ్యంలో 2000లో సంవత్సరంలో దండకారణ్యంలో జనతన సర్కార్లు ఏర్పడటంతో విద్యా వ్యవస్థ వేళ్లూనుకోవడం. భూంకాల్ స్కూళ్ల నిర్వహణలో కథకురాలు వుండటం కన్పిస్తుంది. మూడో దృశ్యంలో మొదటి
క్యా చల్రా .? కాలమ్స్

బొగ్గు కొర‌త లేదు.. వ్యాపారం అంతే

1 మళ్లీ చీకటిరోజుల్లోకి గ్రామాలను, పట్టణాలను ప్రస్తుత విద్యుత్‌ సంక్షోభం తోసేయనుందా? జ: అలాంటి అవకాశమే లేదు. ఎందువల్లనంటే, ఈ రోజు విద్యుత్‌ ప్రభుత్వ బాధ్యతగా కాక, ఒక సరుకుగా మారిపోయింది. ఎప్పుడైనా సరుకులు అమ్ముడుపోతేనే లాభం వస్తుంది కనుక, విద్యుత్‌ కూడా అమ్ముడుపోవాలి. ఇది నేడు నిత్యావసరమయింది కనుక, ప్రజలు కూడా ధర ఎక్కువైనా తప్పకుండా కొనితీరవలసిందే. 2. థర్మల్‌ విద్యుదుత్పత్తికి కావాల్సిన బొగ్గు కొరత, దిగుమతి సమస్యలే ఈ సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయా? జ: బొగ్గు కొరతే లేదని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి తెలిపారు. తాజాగా ఆర్ధిక అంత్రి ఎటువంటి కొరత లేదని, విద్యుత్‌ ఉత్పత్తిలో
లోచూపు కాలమ్స్

మానవత్వం పరిమళించాలంటే పోరాటం అనివార్యం

ఇతరేతర జీవుల వలె కాకుండా, మనిషి ఒక విలక్షణ జీవి. పరిస్థితులకు లోబడి ఉండకుండా పోరాడే నైజం వల్లనే ఆ విలక్షణత మనిషికి అబ్బింది. కనుకనే ప్రకృతిలో భాగమైన మనిషి ఆ ప్రకృతితో పోరాడుతూనే ప్రకృతిపై ఆధిపత్యం సాధించాడు. ఇలా ప్రకృతిపై ఆధిపత్యం సాధించుకుంటున్న క్రమంలోనే మనుషులు తమలో తాము అనేక విభజనలకు గురయ్యారు. మనదేశంలో తొలుత ఆ విభజన ఆర్థికేతరమైన వర్ణవ్యవస్థ రూపంలో. ఆ తర్వాత ఆర్థిక కోణంలోని వర్గ వ్యవస్థ రూపంలోనూ రూపొంది, కులం, మతం, జెండర్ వంటి బహుళ ఆధిపత్య వ్యవస్ధల రూపాల్లోనూ ఆ విభజనలు  కొనసాగుతూ వస్తున్నాయి. మునుపటి కంటే భిన్నంగా నేటి
ఆర్ధికం కాలమ్స్

కరోనా అయితేనేం..? కుబేరులకు కాసుల పంటే

భారత్‌లో ప్రజావ్యతిరేక కార్పొరేటు అనుకూల‌ మోడీ ప్రభుత్వ విధానాల వ‌ల్ల అత్యధిక ప్రజ‌లు కొనుగోలు, ఆదాయాల‌ను కోల్పోతోంటే అపర కుబేరులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నారు. మార్చి 2న హురున్‌ గ్లోబల్‌ 10వ వార్షిక నివేదిక రిచ్‌ లిస్టు 2021 భారత్‌లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 209కి చేరిందని తెలిపింది. 100 కోట్ల డార్ల సంపద కలిగి ఉన్న వారిని బిలియనీర్‌ అంటారు. ప్రస్తుత డాల‌ర్‌ మారకం రేటు ప్రకారం రూ.7400 కోట్ల పైమాటే. మొత్తం 209 మందిలో 177 మంది బిలియనీర్లు భారత్‌లోనే నివసిస్తుండగా మిగిలిన వారు విదేశాల్లో స్థిరపడ్డట్లు నివేదిక వెల్ల‌డించింది. అత్యధిక మంది బిలియనీర్లున్న దేశాల‌