లోచూపు కాలమ్స్

మానవత్వం పరిమళించాలంటే పోరాటం అనివార్యం

ఇతరేతర జీవుల వలె కాకుండా, మనిషి ఒక విలక్షణ జీవి. పరిస్థితులకు లోబడి ఉండకుండా పోరాడే నైజం వల్లనే ఆ విలక్షణత మనిషికి అబ్బింది. కనుకనే ప్రకృతిలో భాగమైన మనిషి ఆ ప్రకృతితో పోరాడుతూనే ప్రకృతిపై ఆధిపత్యం సాధించాడు. ఇలా ప్రకృతిపై ఆధిపత్యం సాధించుకుంటున్న క్రమంలోనే మనుషులు తమలో తాము అనేక విభజనలకు గురయ్యారు. మనదేశంలో తొలుత ఆ విభజన ఆర్థికేతరమైన వర్ణవ్యవస్థ రూపంలో. ఆ తర్వాత ఆర్థిక కోణంలోని వర్గ వ్యవస్థ రూపంలోనూ రూపొంది, కులం, మతం, జెండర్ వంటి బహుళ ఆధిపత్య వ్యవస్ధల రూపాల్లోనూ ఆ విభజనలు  కొనసాగుతూ వస్తున్నాయి. మునుపటి కంటే భిన్నంగా నేటి
ఆర్ధికం కాలమ్స్

కరోనా అయితేనేం..? కుబేరులకు కాసుల పంటే

భారత్‌లో ప్రజావ్యతిరేక కార్పొరేటు అనుకూల‌ మోడీ ప్రభుత్వ విధానాల వ‌ల్ల అత్యధిక ప్రజ‌లు కొనుగోలు, ఆదాయాల‌ను కోల్పోతోంటే అపర కుబేరులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నారు. మార్చి 2న హురున్‌ గ్లోబల్‌ 10వ వార్షిక నివేదిక రిచ్‌ లిస్టు 2021 భారత్‌లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 209కి చేరిందని తెలిపింది. 100 కోట్ల డార్ల సంపద కలిగి ఉన్న వారిని బిలియనీర్‌ అంటారు. ప్రస్తుత డాల‌ర్‌ మారకం రేటు ప్రకారం రూ.7400 కోట్ల పైమాటే. మొత్తం 209 మందిలో 177 మంది బిలియనీర్లు భారత్‌లోనే నివసిస్తుండగా మిగిలిన వారు విదేశాల్లో స్థిరపడ్డట్లు నివేదిక వెల్ల‌డించింది. అత్యధిక మంది బిలియనీర్లున్న దేశాల‌
మీరీ పుస్తకం చదివారా ?

ఆమె వొక ఆయుధం.. తన కవిత్వమొక యుద్దమైదానం..

మానవజీవితంలో కవిత్వం ఒక నిరంతరం అన్వేషణ. సమాకాలీన ప్రపంచంలో నిజం ఎక్కడున్నా వెలుగులోకి తెచ్చే ప్రతిస్పందనా సాధనం. ఏ భాషలోనైనా`ఏ ప్రాంతంలోనైనా అది కొనసాగే సంవాదం. ఆకలి` ఆవేదనలను నిర్మోహమాటంగా గుండెల్లోకి పంపించే అక్షర సముదాయం                                                                                                                                                 -అద్దేపల్లి రామ్మోహన్‌ రావు. కవిత్వమే ఆయుధంగా సమాజాన్ని నడిపించాలని అహర్నిశలు కలలు కన్న వాళ్ళలో చాలా మంది ఉంటారు. కొంతమంది బయట ప్రపంచానికి తెలిసి ఉండటమో..తెలియకపోవడమో యాదృచ్చికం. కాని వాళ్లు సృజియించిన అక్షరాలు మాత్రం ఎన్నితరాలు మారినా అవి శాశ్వతంగా ఈ యుద్దమైదానంపై పోరాడుతూనే  ఉంటాయి. అటువంటి పోరాట పటిమ ఉన్న నిండా సామాజిక చైతన్యం కలిగిన కవయిత్రి కొత్త
బహుజనం కాలమ్స్

జీవితం కథలో ‘అమ్మ’మనస్తత్వం – పరిశీలన

 ‘జీవితం’  కరుణ రాసిన కథల సంపుటి. ఇందులో మొత్తం 30 కథలున్నాయి. వాటిలో జీవితం ఒక కథ. ఆ కథ పేరే పుస్తకం పెరయ్యింది. 30 కథలు విభిన్నమైన సారూప్యమైన ఇతి వృత్తాల కలయికగా, పాఠకులకు పరిచయమై అనేక సన్నీవేశాలతో, సంఘటనలతో, పాఠకులు తమను తాము పాత్రలలో ప్రవేశ పెట్టుకునేంత సహజ సిద్దంగా , మమేకత్వంతో పాత్రలను, కథనాలను, నిర్మించడం రచయిత్రీలోని ప్రత్యేకత. ఆ ప్రత్యేకతే ఈ పుస్తకంలోని కథలు ఎక్కువ కాలం పాఠకుని మనసులో నిలిచిపోయేందుకు కారణం అవుతోంది. సంపుటిలోని ప్రతి కథ ఒక సందేశాత్మక ఇతివృత్తంతో ఉంటుంది. రచయిత్రి ఆ మూలాగ్రం తన కథలలోని, విభిన్న
ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థిక వ్యవస్థ

దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదేపదే ప్రగల్భాలకు పోతోంది మోడీ ప్రభుత్వం. మోడీ మాటలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు భిన్నంగా దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. పిల్లలకు పోషకాహారం దొరకడం లేదు. ఫారెక్స్‌ నిల్వలు హరించుకుపోతున్నాయి. వాణిజ్య లోటు పెరిగిపోతోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) ఐదు మాసాల కనిష్టానికి పడిపోయింది. 2015-2023 మధ్యకాలంలో 18 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (యంఎస్‌యంఇ) మూతపడి 24 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. శ్రామిక శక్తి గణనీయంగా తగ్గింది. రుణభారం పెరిగిపోతోంది. విదేశీ నిధులు రావడం
కథ..కథయ్యిందా! సాహిత్యం కాలమ్స్

అపార్థాల‌ను చెదరగొట్టిన కథ

ఉదయమిత్ర రాసిన కథ , ఈ పండుగ నీ పేరుమీద. దీన్ని జనవరి 2017 లో  అచ్చయిన దోసెడు పల్లీలు కథా సంపుటిలో చదవొచ్చు. పైకి  కథ  తాగునీటి సమస్య చుట్టూ  నడుస్తుంది. సారాంశంలో  కథ మతసామరస్యానికి ప్రాధాన్యతనిస్తుంది. ఒకానొక  కరువు పీడిత ఒక మోస్తరు(మేజరు పంచాయతీ) పట్టణంలో, దళిత కులాల నుంచి వచ్చి  లెక్చరర్ గా వున్న గృహస్తుడొకడు , వినాయకచవితి నాడు తాగునీళ్ల కోసం  పడే  తిప్పలు కథావస్తువు. వీధి కొలాయీ  కలలో మాత్రమే పారుతుంది. వాస్తవంలో  చుక్కరాల్చదు. ఆ టౌనుకు నీళ్లాధారమైన  వాగు యిసుక తోడేయడం వల్ల ఎండిపోయింది. పౌరులకు  నీటిని సరఫరా చేయడం
కాలమ్స్

ఈ కవిత్వం గూర్చి మాట్లాడదాం రండి..!!

(ప్రముఖ కవి , సాహిత్య విశ్లేషకుడు , సాహితి స్రవంతి నాయకుడు కంగార మోహన్ ఈ సంచిక నుంచి కొత్త పుస్తకాల సమీక్షా కాలం *ఈ పుస్తకం  చదివారా ?* ప్రారంభిస్తున్నారు - వసంత మేఘం టీం ) సాహిత్యంలో వస్తువు పాఠకులకొక సారాన్ని అందించాలి. అలా అందించడానికి తగిన రచనా విధానాన్ని వదిలిపెట్టి, వస్తువుకు అనవసరమైన అలంకరణల్ని అతికించడం వల్ల ప్రయోజనం లేదు. సాహిత్యాన్ని చదివినవాడు లేదా విన్నవాడు ఆనందించడంతోబాటు ఎంతో కొంత చైతన్యానికి గురికావాలి. సుష్టుగా భోంచేశాక నిద్ర వచ్చినట్టుండకూడదు సాహిత్యం. అది ఆలోచింపజెయ్యాలి. ఆ ఆలోచనచైతన్యాన్నివ్వాలి. ఆ చైతన్యం కార్యరూపం ధరించాలి. ఆనందించడానికే అయితే
లోచూపు కాలమ్స్

ఆజాదీ కీ ఆవాజ్

యూరప్ లో 14వ శతాబ్దము నుండి రెండు,మూడు శతాబ్దాల పాటు రాచరిక భూస్వామ్యం పై తీవ్రంగా ఘర్షణ పడి, దాన్ని ఓడించి గెలిచిన పెట్టుబడిదారీ వ్యవస్థ(తన స్వప్రయోజనం కోసమే అయినా) ‘మనుషులందరూ సమానమే’, ‘ఏ మనిషికైనా ఒకటే విలువ’ లాంటి కొన్ని ఆధునిక విలువలను ముందుకు తెచ్చింది. పెట్టుబడి తన విస్తరణ కోసం ప్రపంచవ్యాప్తంగా వలసలు ఏర్పరచుకునే క్రమంలో భారతదేశం కూడా ఒక బ్రిటిష్ వలసగా మారింది. ఆ తర్వాత వలసవాద వ్యతిరేక స్వాతంత్ర్య ఉద్యమం ఫలితంగా అధికార మార్పిడి జరిగి,బూర్జువా ప్రజాస్వామ్యం ఇక్కడి భూస్వామ్యంతో తీవ్ర ఘర్షణేమీ లేకుండానే మనదేశానికి దిగుమతి కావడం వల్ల ప్రగతిశీల ఆధునిక
లోచూపు కాలమ్స్

కవిత్వమే సూక్ష్మదర్శిని, దూరదర్శిని

-మెట్టు రవీందర్ మనుషులు విడిపోవడం కంటే మించిన విషాదం లేదు మనుషులు కలవడం కంటే మించిన ఆనందమూ లేదు      అరసవిల్లి కృష్ణ రాసిన ‘ఈ వేళప్పుడు’ కవిత్వం కవి రాసినప్పటి క్షణానికి మాత్రమే సంబంధించినదేనా?  కానేకాదు. అలా ఏ కవిత్వమైనా అది రాయబడిన క్షణానికే   సంబంధించినదయితే, అది పుస్తక పుటల మధ్యనే  నలిగిపోయి    నశిస్తుంది. కానీ ‘ఈ వేళప్పుడు’ కవిత్వం ఒక సజీవమైన కవిత్వం. అది జీవజలం వలె పుస్తక పుటల్ని దాటి పాఠకుల హృదయాల్లోకి  అలవోకగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించే కవిత్వమే జీవిస్తుంది, జీవింపజేస్తుంది.      ఇందులో కవి చూసిన చూపులో  చాలా విశిష్టత ఉంది.
సమకాలీనం

అటవీ హక్కుల చట్టంపై పొంచి ఉన్న ముప్పు; రాజ్యాంగబద్ధతపై విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

షెడ్యూల్డ్ తెగలు (అనుసూచిత తెగలు- ఆదివాసులు) ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం-2006, (దీనిని సాధారణంగా అటవీ హక్కుల చట్టం అని పిలుస్తారు) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల ఆధారంగా సుప్రీంకోర్టు 2025 ఏప్రిల్ 2న కేసున విచారణ చేపట్టనుంది. షెడ్యూల్డ్ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీ నివాసులను అటవీ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో తరలించడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, చట్టపరమైన అడ్డంకులు, పర్యావరణ విధ్వంసం పెరుగుతున్న ముప్పులు, ఇవి చాలా ఆందోళనకరమైన పరిస్థితిని సృష్టిస్తున్నాయి. మరోవైపు, అటవీ హక్కుల చట్టానికి ఉన్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ పైన ప్రశ్నలు లేవనెత్తుతూ,