పితృస్వామ్యపు విరుగుడు ను చిత్రించిన చాయ్ గ్లాసు
చాయ్ గ్లాసు కథను రాసింది , నిత్య. ఈ కథ మొదట అరుణతారలో అచ్చయ్యాక , సామాన్యుల సాహసం కథాసంకలనంలో కూడా వచ్చింది.కథ, పదకొండేళ్ల వ్యవధితో మూడు దృశ్యాలను చిత్రిస్తుంది. 1994నుంచి 2005 మధ్య దండకారణ్యంలో ఆదివాసీ సమూహంలో నూతన మానవులు ఎలా ఉధ్భవించారో చెబుతుంది కథ. కథలోని కథకురాలు 1994లో పారెనార్ గ్రామానికి రావడం, అక్కడ ఒక చిన్న పిల్లవాడి ప్రవర్తనలో పితృస్వామ్యాన్ని ఆమె గమనించడం. ఆలోచనలో పడటం. రెండో దృశ్యంలో 2000లో సంవత్సరంలో దండకారణ్యంలో జనతన సర్కార్లు ఏర్పడటంతో విద్యా వ్యవస్థ వేళ్లూనుకోవడం. భూంకాల్ స్కూళ్ల నిర్వహణలో కథకురాలు వుండటం కన్పిస్తుంది. మూడో దృశ్యంలో మొదటి










