మావోయిస్టు నిర్మూలనకు మరో వాయిదా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన ప్రధాన లక్ష్యం మావోయిజాన్ని అంతం చేయడం గురించి గురించి మాట్లాడటం. ఛత్తీస్‌గఢ్ మాత్రమే కాదు, మావోయిజం ప్రభావం ఉన్న పరిసర ప్రాంతాల రాష్ట్ర అధికారులతో సహా వరుస సమావేశాలు నిర్వహించి చర్చించారు. అన్ని సమావేశాలు ముగిసిన తర్వాత చివరగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కేవలం దండకారణ్య, బస్తర్, ఛత్తీస్‌గఢ్‌ల నుండి మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగానే మావోయిజాన్ని నిర్మూలిస్తామని చెబుతూ అందుకు ఒక తేదీని, 2026 మార్చి కూడా ఇచ్చారు. వ్యూహాలు రచిస్తున్న తీరు, ప్రభుత్వం