బస్తర్‌లో మావోయిస్టు వ్యతిరేక సైనికచర్యలో మరణించిన బాల సైనికురాలు: ఆమె ఒక్కరే కాదు
మావోయిస్టులు తక్కువ వయస్సు గల సైనికులను రిక్రూట్ చేసుకుంటున్నారు; అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి రాజ్యం వారిని చంపేస్తోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవులలో లోతట్టు ప్రాంతాలలో, స్థానిక ఆదివాసీ సముదాయాల నుండి పార్టీలోకి చేర్చుకొన్న మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్రస్థాయి యుద్ధంలో బంధితులయ్యారు. ఈ సంవత్సరం, ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, దాదాపు 40 ఎన్‌కౌంటర్లలో 153 మంది మావోయిస్టులను హతమార్చామని, ఇది 2009 మినహా గతంలో చూసిన వార్షిక సంఖ్య కంటే ఎక్కువ అని ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌లు జరిగిన ప్రదేశాలకు వెళ్లి, మరణించిన వారిలో 37 మంది కుటుంబాలతో










