వెలుగును హత్య చేసిన చీకట్ల కథలే మార్జినోళ్లు
సమాజం పట్ల బాధ్యత గల రచయితల్లో సమాజానికి ఏదో చేయలాని తపన పడి, సమాజం వైపు నిలబడి తమ గళాన్ని విప్పిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. సామాజిక సృహను కలిగి సాహిత్య సేవా దృక్పథంతో, సమాజం మార్పు కోసం ఎల్లప్పుడూ ముందుండే రచయితల కలం నుండి మాత్రమే భావోద్వేగమైన కథలు బయటికొస్తాయి.అలాంటి కథలే పి.శ్రీనివాస్ గౌడ్ రాసిన మార్జినోళ్ళు కథలు. ఈ కథలు సమాజంపై ప్రభావం చూపే కథలని చెప్పొచ్చు. ఇలాంటి రచయితలు ఒక నిబద్ధత, సమాజం పట్ల కొంత బాధ్యత వుండడం వల్ల కూడా ఇటువంటి కథలను రాస్తారు. నేటి కాలంలో ప్రేమ కవితలకో, కథలకో










