సాహిత్యం వ్యాసాలు

వర్గకసిని సిరా చేసుకున్న కో.ప్ర

విప్లవోద్యమ ప్రభావంతో 1980, 90లలో కవిత్వం రాసిన అప్పటి యువకవుల్లో కో.ప్ర. తనదైన ప్రత్యేక ముద్రతోవిలక్షణంగా కనిపించాడు. వచన కవితనూ, పాటనూ - రెండిటినీ అవలీలగా నడిపించగల నైపుణ్యం అతనిది. కవిగాఅతని మాటకు శక్తి వుంది. అతని భావంలో ఆర్తి ఉంది. అతని ఆవేదనలో చిత్తశుద్ధి వుంది. అంతకంటే ముఖ్యంగా అతనిఅవగాహనలో వర్గకసి వుంది. వీటన్నిటితో బాటు అతని కవిత్వంలో సూటిదనం, పోటుదనం వున్నాయి.కవిగా కో.ప్ర గా సాహిత్యలోకానికి పరిచయమైన అతని పూర్తిపేరు కోలపూడి ప్రసాద్. అతని వూరు నెల్లూరు జిల్లావెంకటగిరి సమీపంలోని డక్కిలి గ్రామం. 1966 జూన్ 2వ తేదీన పుట్టాడు. 1994 అక్టోబర్ 23న శ్రీకాకుళం
కథలు

దొర్లు దొర్లు పుచ్చకాయ్

జేబులోవున్న ఆ ఒక్కరూపాయి బందా కంబగిరికి అగ్నిపరీక్ష పెడుతున్నది. స్కూలు బయట అమ్ముతున్న బొంబాయి మిఠాయి, ఉప్పుసెనగలు, బఠాణీలు, సొంగలు అంతగనం వూరిస్తున్నాయి. "మా! మా! ఉప్పుసెనగలు కొనుక్కుంటానే!” గంట బంగపోతే ఉట్టిచట్టిలో నుండి అమ్మ తీసి ఇచ్చిన గుండ్రని మిలమిలలాడుతున్న కొత్త రూపాయి బందా. పొద్దుటినుంచి దాన్ని చూస్తున్నాడు… జేబు లోపలికి తోస్తున్నాడు. చూస్తున్నాడు …లోపలికి తోస్తున్నాడు. ఆ రూపాయి వాడికి అపురూపం. కనీసం రెండురోజులన్నా దాన్ని జేబులో వూరబెట్టి…వూరబెట్టి కొనుక్కుంటే…అప్పుడు సెనిగబ్యాల్ల పాశం తిన్నంత తృప్తి. వాని తంటాలు చూసిన జేజి "పాపోడా ! ఎంగావాల్నో కొనుక్కోని తినుకోపోరా! కావాలంటే అనిక నేను రూపాయి ఇత్సా
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

తెలుగు కథకు కారా చేసిందేమిటి ?

తెలుగు సాహిత్యానికి కాళీపట్నం రామారావు గారి చేర్పు ఏమిటి? నిర్దిష్టంగా ఆయన తన కథల ద్వారా కొత్తగా చెప్పిందేమిటి? దీనికి జవాబు వెతికేముందు కారాని ప్రభావితం చేసిన స్థలకాలాలను కూడా చూడాలి.  స్వాతంత్రం వచ్చేసిందని , నెహ్రు సోషలిజం కూడా తెచ్ఛేస్తాడనే భ్రమలు తొలగి అంతటా ఒక అసమ్మతి రాజుకుంటున్న కాలం. గ్రామాలలో చెక్కుచెదరని భూస్వామ్యంపై జనం తిరగబడుతున్న కాలం. సర్దుబాటు కాదు మౌలిక మార్పు కావాలనే తండ్లాట మొదలైన కాలం. రాజకీయార్థిక తలంలో మొదలైన ఈ కదలికను గుర్తుపట్టడమే కారా గొప్పదనం. గ్రామం నుండి పట్టణానికి అనే రాజకీయ అవగాహనను, ఈ అవగాహన పర్యవసానంగా తనకు సమీపంలో
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

కారా కథా దృక్పథం

కాళీపట్నం రామారావు   కథా రచన విషయంలో ‘చూపు’  అనే భావనకు చాలా ప్రాధాన్యం ఉంది. కథా వస్తు సేకరణకు చూపు విశాలం కావాలి. అందుకు నాలుగు పక్కలూ కలయ చూడాలి అంటారాయన. చూపు అంటే కంటికి వస్తువుకి మధ్య సంబంధమే కాదు. వస్తువు వెనుక దాని చలనానికి కారణమైన శక్తులను గుర్తించటం. వస్తువు ఉపరితలాన్నిచీల్చుకొంటూ లోలోతులకు ప్రసరిస్తూ వస్తు తత్వాన్ని గాలం వేసి గ్రహించగలటం . చూపుకు ఆ నైశిత్యం ఇచ్చేది చైతన్యం. అది అనుభవం నుండి. సామాన్య లౌకిక జ్ఞానం నుండి అంతకన్నా ఎక్కువ రాజకీయార్థిక అవగాహన నుండి అభివృద్ధి చెందుతుంది.   దానినే జీవిత
సాహిత్యం వ్యాసాలు

మమతా ఫాసిజం మాటేమిటో!

“ఎంత మాట! ఇట్లనవచ్చా? సందర్భశుద్ధి లేకుండా?” అనే వాళ్లుంటారని నాకు తెలుసు. సరిగ్గా అనవలసిన సందర్భం ఇదే. పైగా నిన్న మొన్న కూడా ఈ మాట అన్నవాళ్లకు ఇప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. పశ్చిమ బెంగాల్ విషయంలో సోషల్ ఫాసిజమనీ, మమతా ఫాసిజమనే మాటలు ఎప్పుడో ముందుకు వచ్చాయి. ఫాసిజాన్ని ఇన్ని రకాలుగా, ఇన్ని విశేషణాలతో చెబితే అసలు ఫాసిజం మీద విమర్శ పలుచన అవుతుందనే వాళ్లూ ఉండొచ్చు. మన దేశంలో ఫాసిజం కూడా బహురూపి. సూక్ష్మరూపి, సర్వవ్యాపి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, పాలకవర్గ రాజకీయార్థికానికి అది అత్యంత సన్నిహితమైనది. కేవలం బ్రాహ్మణీయ హిందుత్వ వల్లనే మన దేశంలోని ఫాసిజం
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

కారా క‌థ‌లో స్త్రీ కోణం

 ‘ఆదివారం’ సెలవు కాదా? కారా కథలు గతంలో (దాదాపు మూడు దశాబ్దాల క్రితం ) కొన్ని చదివాను. తన కథల్ని మనకి మిగిల్చి ఇటీవల మాష్టారు వెళ్లిపోయాక మళ్ళీ మొత్తం కథలు చదవడం మొదలుపెట్టినపుడు కొన్ని కథలని మొదటిసారిగా చదివాను. కొన్ని చదువుతున్నపుడు ముఖ్యంగా ఒకే దగ్గర చదువుతున్నప్పుడు ఆయన స్త్రీ పాత్రలను ఎంత బాగా చిత్రించారో గమనించాను. అసలు ‘కారాకథల్లో స్త్రీ పాత్రలు’ అనే అంశం మీద తప్పక రాయాలీ అనిపించింది. ఇప్పటికే  ఎవరన్నా ఆ పని చేసి ఉండకపోతే మాత్రం తప్పక చేయదగ్గ పని. నేను ప్రస్తుతానికి ఒక కథ గురించి మీతో పంచుకుంటాను.  
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

డాక్యుమెంట‌రీలో మాస్టారు

ఒక మహా పర్వతం చుట్టూ అనేక మంది నిలబడి, తమకు కనిపిస్తున్నంత మేరా ఆ పర్వతం ఎలా ఉందో వ్యాఖ్యానిస్తూ ఉంటారు.ఏ ఒక్కరికీ అటువంటి మహా పర్వతం యొక్క సంపూర్ణ స్వరూపం సాక్షాత్కారం కాదు,స్వభావమూ అర్థం కాదు.వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలను మనం తెలుసుకుంటే తప్ప , ఆ పర్వతం యొక్క సంపూర్ణ రూప స్వభావాలు అర్థం కావు- ఒక గొప్ప మనిషి గురించి కూడా అలాగే ఉంటుంది. కాళీపట్నపు రామారావు మాస్టారు మరణించి అప్పడే రెండు వారాలు గడిచాయి.వారి మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తూ రాస్తున్న వారి సంఖ్య చూస్తూ ఉంటే, ఆశ్చర్యం కలుగుతోంది. రామారావు మాస్టారు
సంభాషణ కారా స్మృతిలో సాహిత్యం

*మీలా బ‌త‌క‌డం మీకే సాధ్యం*

మాష్టారూ‌ మీరూ అబద్ధాలాడతారని అనుకోలేదు. 'వందేళ్ళుంటాను ..ఈ వందేళ్ళూ కథకి, కథానిలయానికి చెయ్యాల్సిన పనులున్నాయి అవి పూర్తిచెయ్యాలి'  అని‌ మాటిచ్చి  ఇలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా? మీరూ మోసం చెయ్య‌గలరా ? మీ మాటమీద నమ్మకంతో మేం ధైర్యంగా ఉంటే కూతుర్ని మాత్రం రప్పించుకుని మాకు చెప్పకుండా  అర్థాంతరంగా వెళ్ళిపోవడం మోసం కాదా మాష్టారూ. మీరు ఆడినమాట తప్పుతారని కలలో కూడా అనుకోలేదు. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి రెండో శని,ఆదివారాలు కథానిలయం వార్షికోత్సవాలు జరుగుతాయని, ఆ రెండురోజులూ అదొక సాహిత్యోత్సవంగా జరగుతుందని, దేశవిదేశాల నుండి కథాభిమానులు వస్తారని ముందురోజే రాకపోతే ఊరుకునేది లేదని ఎన్నన్నారు..మూడేళ్ళుగా ఆ సందడే
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

కుల సమస్యను చిత్రించడంలో కా.రా. సఫలమా? విఫలమా?

కా.రా కధల్లో తొలిదశ కథలన్నీ కొ. కు. ప్రభావంలో వచ్చిన కథలు.బ్రాహ్మణ మధ్య తరగతి మానవ సంబంధాల్ని ట్రీట్ చేసిన కథలివి.అందులో కారా సొంతతనం కనిపించదు.మలి దశ కథల్లోనే కా.రా తనం కనిపించేది. ఇందులో వీరుడు- మహా వీరుడూ, శాంతి,కుట్ర,  భయం,తీర్పు  జీవితం తాలూకు మార్క్సిస్టు  ఆర్ధిక రాజకీయ నైతిక పాఠాల్లాంటివి. ఆర్తి, చావు, నో రూమ్,యజ్ఞం, మరి కొన్ని కధల్లో కుల వాస్తవికతను కేంద్రీకరించి రాశాడు.ఇందులో యజ్ఞం, నోరూమ్ కధల్లో తప్ప మిగతా కధలన్నింటిలోనూ ఆనాటి మార్క్సిస్టు ఆర్ధిక నిర్ణాయక కోణం నుంచి కుల సమస్య ను చూపుతాడు. 'ఆర్తి' కథలో దళితుల్ని ఆర్ధిక పీడితులుగా తప్ప
సాహిత్యం సంభాషణ కారా స్మృతిలో

లోచూపు!

జీవితానికైనా రచనకైనా జీవధాతువు స్పందన. ఏయే స్పందించిన విషయాలు నిలువనీయవో ఆయా అంశాలు ఆయా రచయితలకు కథాంశాలవుతాయి. కథా వస్తువులవుతాయి. అందుకే ‘కథాకథనం’లో కారా మాస్టారు ‘కథ రాయాలంటే...’ అని ‘తమకు జరిగే మంచి చెడ్డలకు లోకంలో ప్రతివారూ స్పందిస్తారు. ఆ స్పందన కొందరిలో ఇతోధికంగానూ మరికొందరిలో సాధారణంగానూ ఉంటుంది. సాధారణతను మించి స్పందించే వారెవరైనా రచయితలయ్యే అవకాశం ఉంది’ అంటారు. ‘మన స్వభావం జీవితంలో మంచి చెడ్డలకి తీవ్రంగా స్పందించేదై ఉండాలి’ అని కూడా అంటారు. అలాగే కథకి వస్తువూ పాత్రలూ వాటి వర్ణనలూ సంభాషణలూ సన్నివేశాలూ సంఘటనలూ పాత్రోచిత భాష వాటి నిర్వహణతో అది కథ