సాహిత్యం సమీక్షలు

విప్లవోద్యమాన్ని సృజనాత్మకంగా ఆవిష్కరించిన కథలు

నేను ఈ మధ్య అల్లం రాజయ్య గారు సంపాదకత్వం వహించిన దండకారణ్యం కథలు చదివాను. ఈ పుస్తకాన్ని విరసం వాళ్ళు ప్రచురించారు. ఈ కథలు మూడు సంపుటాలుగా రావడం జరిగింది. ఈ కథలన్నీ అరుణతారలో ప్రచురణ అయ్యాయి. మొదటి కథల సంపుటి 2005 - 2012. 16 కథలతో మొదటి సంఖలనం తీసుకువచ్చారు. 2013 -2017 మొత్తం 8 కథలతో రెండవ సంకలనం ప్రచురించారు. 2016 -2019 మొత్తం14 కథలతో మూడవ కథల సంకలనం తీసుకువచ్చారు. ఈ కథలలో గత 50 సంవత్సరాలుగా మూడు తరాలుగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక రాజ్యాధికార దిశగా సాగుతున్న విప్లవోద్యమాన్ని సాహిత్య పరంగా
సాహిత్యం కథలు హస్బెండ్ స్టిచ్ - 3

మాట్లాడు!!

నువ్వు నాతో మాట్లాడు ఈ ప్రపంచాన్నంతా పక్కన నెట్టేసి వింటాను నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండు ఈ ప్రపంచాన్నంతా నీలోనే చూసుకుంటాను మాట్లాడు... మాట్లాడు స్నేహితుడిలా... ప్రేమికుడిలా... సహచరుడిలా రోజూ నన్ను పలకరించే తోటలోని గువ్వలా... మాట్లాడు... మాట్లాడు - స్వర “ఏమిటీ మెస్సేజీలు చెత్త కాకపోతే... ఏం మాట్లాడాలి నీతో? పని చేస్కోనీవా...?” కోపపు ఎమోజీ ఎర్రగా... చిరాగ్గా కార్తీక్ నుంచి. స్వర కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఏమీ లేవా తమ మధ్య మాటలు...? పంచుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి తెలపాల్సినవి... రోజూ చూసుకునే ఇద్దరి మనుషుల మధ్య... సహచరుల మధ్య? ఈ సంభాషణ లేని జీవితం ఏమిటి? ఈ
సాహిత్యం కథావరణం

” రైతుకు పనే  ప్రపంచం.రైతు పనిముట్లు కూడా అతడి కుటుంబ సభ్యులే  “

వ్యవసాయం ఆధారం చేసుకుని మనుషుల్ని పల్లెల్ని చిత్రీకరించిన కథలు తెలుగులో చాలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం అంటే ఒక జ్ఞాపకంగా మారిపోయింది. వ్యవసాయం అనేది వర్తమానానికి కాక గతానికి సంబంధించిన విషయంగా భావిస్తున్నారు కొందరు ఆధునికులు . అంతగా వ్యవసాయం కనుమరుగవుతూ వస్తున్నది. అయినా రైతులు రాజీ పడకుండా, జీవన పోరాటం చేస్తూనే ఉన్నారు రైతుకు బాసటగా తెలుగు కథకులు ఆది నుండి నిలబడ్డారు. అనంతపురం లాంటి రాయలసీమ జిల్లాల్లో రైతు పక్షం వహించిన రచయితలు పాదయాత్రలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. నిరసన కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో రైతులతో పాటు పాల్గొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాయడం
సమీక్షలు సాహిత్యం

జీవన లాలస – పాఠకుడి నోట్సు

1998లో అనుకుంటాను గోదావరిఖనిలో కథల వర్కు షాప్ జరిగింది. అల్లంరాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, వారాల ఆనంద్ గార్ల పూనికతో. వర్క్ షాపు అయ్యాక బొగ్గుబాయిలు చూడటానికి పోయాము అందరమూ. పాత అండర్‌గ్రౌండ్ మైనింగ్‌తో పాటు అప్పుడప్పుడే ఓపెన్ కాస్ట్ తవ్వకాలూ మొదలయిన కాలం అది. ఒక కొండను మించివున్న పేద్ద పేద్ద యంత్రభూతాలు నిజంగానే భయపెట్టాయి. నేను, రాప్తాడు గోపాలకృష్ణ, పాణీ బొగ్గు బాయిలను చూడటం అదే మొదటిసారి. లోపల భరించలేని వేడి, ఉక్కపోత, పేద్ద ఫ్యాన్లు పెట్టి గాలి లోపలికి తోలుతున్నా అది సగదూరం కూడా పోదు. ఆకు అల్లాడిన గాలికూడా రాదు. అతి తక్కువ ఆక్సిజనే
సాహిత్యం సమీక్షలు

త‌ల్లుల బిడ్డ‌ల వీర‌గాథ‌

ఆదిలాబాదు విప్లవానికి కన్నతల్లి’ అని ప్రముఖ విప్లవ కవి ఎన్‌కె అంటారు.‘విప్లవానికి సింగరేణి ఊట చెలిమ’ అని ‘తల్లులు బిడ్డలు’ అనే ఈ నవలలో పాత్రగా కనిపించే నల్లా ఆదిరెడ్డి అంటాడు.మొదటిది కవితాత్మక వ్యాఖ్య. రెండోది విప్లవోద్యమ అనుభవం. అదే ఒక సూత్రీకరణ అయింది. అదే ఈ నవల నిరూపించే సత్యం.సింగరేణి ప్రాంతంలోని బెల్లంపల్లి కేంద్రంగా హుస్సేన్‌ రాసిన ‘తల్లులు బిడ్డలు’ నవల నడుస్తుంది. అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అంతా విస్తరించి, ఇటు తెలంగాణలోని మిగతా జిల్లాల్లోకి, అటు ఆదివాసీ ప్రాంతంలోకి ఇందులోని కథా స్థలం చేరుకుంటుంది. పైకి చూడ్డానికి గజ్జల లక్ష్మమ్మ కేంద్రంగా రచన
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

 బ్రెస్ట్ టాక్…

'హస్బెండ్ స్టిచ్' 3 చిన్నారి తల్లీ... నన్ను క్షమించు. ఇక ఇవన్నీ వీడ్కోలు దినాలేనా ఇక మనిద్దరికీ? నిన్నూ... నన్నూ బలవంతంగా విడదీస్తున్నారు. అదీ అసహజంగా... ఇవి నీకు పాలు మాన్పిస్తున్న సమయాలు... నీ నోటి నుంచి ఆహారం గుంజుకుంటున్న కాలాలు! ఎంత దౌర్భాగ్యం ఈ అమ్మకు... ఎంత దురదృష్టం నీకు...? పసి బిడ్డ పొట్టగొట్టి మరీ వాంఛ తీర్చుకునేవాడు మరెవరో కాదు తల్లీ... మీ నాన్న! అవును మీ నాన్నే... బాధగా వుందా పాపా? నా రొమ్ములు చిన్నగా ముడుచుకు పోతాయట నువ్వు పాలు తాగితే... నిజానికి నా హృదయం ముడుచుకు పోతుందని మీ నాన్నకు తెలీదు!
సాహిత్యం సంభాషణ

అమ్మల దినం తల్లుల గుండెకోత

యేటా మేలో రెండవ ఆదివారం ప్రపంచ అమ్మల దినం జరుపుకుంటున్నాం. ఈసారి ప్రపంచ అమ్మల దినం యుద్ధం మధ్యలో జరుపుకోవలసి వస్తున్నది. ఈ అన్యాయపూరితమైన, దుర్మార్గమైన సామ్రాజ్యవాదుల యుద్ధ క్రీడలో బిడ్డలను కోల్పోయి గర్భశోకంతో తల్లడిల్లుతున్న తల్లులకు, తల్లులను కోల్పోయిన బిడ్డలకు సాంత్వన చేకూరాలనీ కోరుకుంటూ సామ్రాజ్యవాదుల మారణకాండలో ప్రాణాలు కోల్పోయిన తల్లులకు, బిడ్డలకు అమ్మలదినపు విషాద ఘడియలలో శిరస్సు వంచి ముందుగా శ్రద్ధాంజలి ఘటిద్దాం. మన పిల్లల కోసం, భవిష్యత్‌ తరాల కోసం దోపిడీ యుద్ధాలు ఎరుగని శాంతిమయ ప్రపంచ సాధనకై పోరాడుదామనీ గట్టిగా అమ్మలమంతా శపథం చేద్దాం. అమెరికా నాటో కూటమి రగిలించిన వివాదం కారణంగా
సాహిత్యం

అలిశెట్టి  జీవన దృశ్యం

ఏయే విలువల ఆధారంగా ఒక కవిని అంచనా వేయాలన్న ప్రశ్నలు విమర్శకులకు ఎదురవుతాయి. మానవ విలువలకు ప్రతినిధిగా చూడాలా? సమకాలీన ఉద్యమాల్లో పాల్గొనే వ్యక్తిగా చూడాలా? వంటి అనేక ప్రశ్నలు ఎదురవుతాయి. ‘‘మానవ  విలువలు’’, ‘‘ఉద్యమం’’ వేర్వేరే కావు. అంతర్జాతీయ ఉద్యమాల నేపథ్యంలో గొప్ప కవితలెన్ని రాసి ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘‘ఏకైక మహాకవి’’గా  శ్రీశ్రీ గారు గుర్తింపు పొందారు. వివాద రహితమైన అరుదైన కవుల్లో ‘‘అలిశెట్టి ప్రభాకర్‌’’ స్థానం సమున్నతమైంది. అందుకే ఆయన రాసిన ప్రతి అక్షరంలో నిష్కలమైన నిజాయితీ కనిపిస్తుంది. ‘‘బీదరికం  అనారోగ్యం ఒక గొప్ప కవిని మనకు కాకుండా చేశాయి’’. ‘‘ఓడ్‌  టు పోయెట్స్‌’’
కథలు

లోప‌లి ప్ర‌పంచం

          "ఏంబా ఇంకా క్యారేజ్ రెడీ చేయలేదా. కాని టైం అవుతోంది" ఆంజనేయులు అది మూడో సారి అరవడం మూడు రోజులకు సరిపడా చపాతీలు రెడీ చేయడం అంత తక్కువ సమయంలో సాధ్యం కాదు. అయినా ఆకలికి కడుపు మాడ్చు కుంటాడేమోనని పద్మ తయారు చేస్తోంది. "ఇంకెప్పుడు  నువ్వు మాములు డ్యూటీకి వచ్చేది. ఆ బేస్ క్యాంపు డ్యూటీ వేసుకోవద్దు అని చెప్పినా వినవా. ఆ కొండల్లోకి వెళితే సెల్లు పనిచేయదు. నీకు ఏమైందో తెలీక టెన్షన్ పడలేక చస్తున్నా " పద్మ కోపంగా అంది. "ఈ తిట్లకేం గాని  నువ్వు క్యారేజ్ ఇస్తే ఇయ్యి, లేపోతే పో"
కథలు

రాంకో

ఉదయం ఏడుగంటలు కావస్తున్నది. తనతో ఉన్న వారిలో నుండి ఇద్దరిని తీసుకుని ఊళ్లోకి బయలుదేరింది. అది నాలుగు గడపలున్న కుగ్రామం. పేరు మాకడిచూవ్వ.  గడ్చిరోలీ జిల్లా చాముర్షి తాలూకాలో ఉన్నది. రాయగఢ్‌ నుండి వలసవచ్చిన ఉరావ్‌ ఆదివాసులవి రెండు ఇళ్లు.  స్టానికులవి రెండు గడపలు. వర్షాలు జోరుగా కురుస్తూ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే కాలం. ఎడ్ల భుజాల మీదికి కాడిని ఎక్కించిన రైతులు పొలానికి పోవటానికి తయారవుతున్నారు. ఆడ‌వాళ్లు  వంటపని ముగించుకుని అన్నం డొప్పల్లోకి సర్దేశారు.  దానికి విడిగా ఆకు మూత వేసి గంపలో అన్ని డొప్పలనూ పెట్టుకున్నారు. పొలానికి పోవటానికి సిద్ధమవుతున్నారు.  రణితను దూరం నుండే