అదానీ గుట్టు విప్పిన హిండెన్‌బర్గ్
ప్రధాని నరేంద్ర మోడీకి ఎంతో సన్నిహితుడు గుజరాత్ వ్యాపారి గౌతమ్ అదానీ ఇప్పుడు ఆయన సిరుల శిఖరాల వెనుక అతి పెద్ద కుట్ర దాగి ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే అంతర్జాతీయ సంస్థ జనవరి 24న వెల్లడించిన సమాచారం సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతునిగా ఖ్యాతికెక్కిన గౌతమ్ అదానీ వ్యాపార మోసాల పుట్ట పగిలింది. ఇంతకాలం ఆయన చక్కబెట్టిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అదానీ నెరపిన మార్కెట్ కుంభకోణాలను దాంతో డబ్బు సంపాదనా పరులకు ఆదర్శంగా నిలిచిన అదానీ ఆర్థిక ఎదుగుదల వెనుక గల










