నిండైన ఆలోచనాపరుడు రామ్మోహన్‌సార్
పాణి రామ్మోహన్ సార్‌కు ఆరోగ్యం బాగోలేదని, ఆయన కోసం పుస్తకం తీసుకరావాలనుకొని రాఘవాచారిగారు వ్యాసం రాయమన్నారు. తనతో కలిసి జీవిస్తున్న వారు తన గురించి ఏమనుకుంటున్నదీ, ఈ ప్రపంచ కల్లోలాలపై వేర్వేరు సందర్భాల్లో ఆయన చేసిన విశ్లేషణల్లో ఏమున్నదీ ఒక చోటికి చేర్చి రామ్మోహన్‌సారుకు అందించాలని పాలమూరు అధ్యయన వేదిక అనుకున్నది. మామూలుగా అయితే ఇలాంటి పుస్తకం చదివాక రామ్మోహన్‌సారు తప్పన ఏదో ఒక సునిశిత వ్యాఖ్య చేసేవారే. కానీ ఇంకా పుస్తకం పని పూర్తి కాక ముందే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దాంతో అప్పటికి సేకరించిన వ్యాసాలను ఒక పుస్తకంగా కూర్చి ఆయన చేతిలో










