కారా స్మృతిలో సాహిత్యం

మాస్టారితో నా గ్యాపకాలు కొన్ని !

మాస్టారు ఇక మనల్ని విడిచి ఏ క్షణమో వేలిపోతారని గత ఏడాది మార్చిలో ఆయన ఆసుపత్రిలో చేరినపుడు అన్పించింది. అయితే ఆయన గట్టి పిండం. వైద్యుల వూహకు అందని రీతిలో కొన్నాళ్ళకు తేరుకున్నారు. ఆసుపత్రిలో చేరిన నాటికి కిడ్నీ, వూపిరితిత్తులు అర్ధ భాగాలే పనిచేస్తున్నయట. పనిచేయని అర్ధభాగాలను మరి బాగు చేయలేరట, పనిచేసే భాగాలు కూడా ఎన్నాళ్ళో చేయవని వైద్యులు  జ్యోతిశ్యం  చెప్పారు నమ్మకంగా.  అంచేత అలా ఇక ఏ క్షణమో అననుకున్నాము. కానీ మాస్టారు వైద్యుల జ్యోతిశ్యాన్ని వమ్ము చేసి   ఆసుపత్రి నుంచి వచ్చాక ఏడాది పైగా నిలబడ్డారు.    ఈమధ్యలో కొన్నాళ్ళు శరీరం అతని మాట
వ్యాసాలు

బాల్జాక్ ప్రపంచంలో..

(ఇటీవల విరసం విడుదల చేసిన ముక్తవరం పార్థ సారథి  *బాల్జాక్ జీవితం - సాహిత్యం* పుస్తకానికి రాసిన ముందుమాట ) ముక్తవరం పార్థసారథి గారికి శరీరం లేదు. ఒక హోదా లేదు. అవార్డులు, రివార్డులు లేవు. పబ్లిసిటీ లేదు. ప్రచారం లేదు. ముఠాలు లేవు. సాహిత్యమే పార్థసారథి గారు. ఆయనతో మాట్లాడితే సాహిత్యం మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఆయన్ని ఎరిగినవాళ్లు సాహితీ సంపదని ఎంతోకొంత సంగ్రహించకుండా ఉండరు. అందుచేతే ఎరిగినవాళ్లు, ఆయన్ని ఎరగని వాళ్లలా నడుచుకుంటారు. అయినా కించిత్తు కూడా విచారించరు. బావిలో నీళ్లు చేదకపోతే వూట తగ్గిపోతుందేమోనన్నట్టుగా, నిరంతరం ఒక ప్రవాహంలా సాహిత్యాన్ని వెలువరిస్తారు. ఆర్బిఐ లో అధికారిగా
సాహిత్యం వ్యాసాలు

నిశ్శబ్దంగా నిష్క్రమించిన రచయిత

మూడేళ్ళ క్రితం ఓ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ మా కాలేజీకి వచ్చారు. డెబ్బై ఏళ్లు ఉండొచ్చు. నల్లగా, అంత ఎత్తూ కాని, లావూ కాని పర్సనాలిటీ. మనిషి చాలా నెమ్మది అని చూడంగానే అర్థమవుతుంది. పరిచయం చేసుకొని తాను రాసిన కథల గురించి చెప్పారు. దేవిరెడ్డి వెంకటరెడ్డి - పేరు విన్నట్టుగా ఉంది. కథలు గుర్తు రావడం లేదు. ఇప్పటి వరకు పుస్తకం పబ్లిష్ చేయాలనుకోలేదని, ఇప్పుడు ఆ ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. దీన్ని విరసమే ప్రచురించాలని తన కోరిక అన్నారు. నేను సంస్థలో చర్చిస్తానని చెప్పాను. ‘ముందుమాట మీరే రాయాలి’ అన్నారు. ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను
వ్యాసాలు

సార్థ‌క జీవి ఆలూరి ల‌లిత‌

విప్ల‌వోద్య‌మం మ‌నుషుల‌ను  అద్భుతంగా తీర్చిదిద్దుతుంద‌నడానికి  ల‌లిత‌గారే ఉదాహ‌ర‌ణ‌.  సంప్ర‌దాయ జీవితం నుంచి  అజ్ఞాత  ఉద్య‌మ  జీవితానుభ‌వం గ‌డించేదాకా ఆమె ఎదిగారు.   ఒక మామూలు గృహిణిగా   జీవితాన్ని ఆరంభించి త‌న కుటుంబం ఉద్య‌మ కేంద్రంగా మారే క్ర‌మానికి దోహ‌దం చేశారు. ఆ కుటుంబం ఉద్య‌మ‌కారుల,  అమ‌ర వీరుల‌ కుటుంబంగా ఎదిగే మార్గంలో ల‌లిత‌గారి అడుగుజాడ‌లు ఉన్నాయి. ఇదంతా ఆమె ఒక్క‌రే సాధించి ఉండ‌రు. అస‌లు ఆమె గురించి విడిగా ఎవ్వ‌రూ మాట్లాడ‌లేరు. భుజంగ‌రావుగారితో క‌లిపే చూస్తారు. ఇది పితృస్వామ్య కోణం కాదు. విప్ల‌వోద్య‌మంలో, సాహిత్య ర‌చ‌న‌లో ఆ ఇద్ద‌రి క‌ల‌యిక అలాంటిది. నిజానికి ల‌లిత‌గారి ప్ర‌స్తావ‌న‌, ప్ర‌మేయం లేకుండా భుజంగ‌రావుగారికి ఉనికి
సాహిత్యం వ్యాసాలు

Let Oppressed Identities and Class struggles be united Against Fascism.

Over the past few years, we have been experiencing the nature of fascismin India. It has similarities and differences to fascism in history. Now we have reached some consensus that Brahminical Hindutva has become fascism in our country. The Hindutva forces have been making preparations for about a hundred years to get to the current state. This added to the crises in the post-colonial Indian political system. Based on these
వ్యాసాలు

మనందరం తెగబడి పోరాడాల్సిన 21 డిమాండ్ల చార్టర్

2024 ఫిబ్రవరి 16న అఖిల భారత గ్రామీణ బంద్; పారిశ్రామిక / రంగాల సమ్మె సందర్భంగా సంయుక్త్ కిసాన్ మోర్చా, జాయింట్ ప్లాట్‌ఫామ్ ఆఫ్ సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ (జెపిసిటియు) విడుదల చేసిన 21 పాయింట్ల డిమాండ్ల చార్టర్  సంయుక్త్  కిసాన్ మోర్చా (ఎస్కెఎం) సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, ఇండిపెండెంట్ సెక్టోరల్ ఫెడరేషన్లు / అసోసియేషన్ల ఉమ్మడి వేదిక మోదీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా 2024 ఫిబ్రవరి 16 న గ్రామీణ బంద్; పారిశ్రామిక / రంగాల సమ్మెకు పిలుపునిచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), ద్రవిడ మున్నేత్ర కాజకాం,
కారా స్మృతిలో సాహిత్యం

ప్రపంచ కథకుడు

నాకు బాగా ఇష్టమైన కథా రచయితలు ఇద్దరే ఇద్దరు. ఒకరు మహాస్వేతాదేవి ఇంకొకరు కాళీపట్నం రామారావు. ఇద్దరి కథలని ఇష్టంగా చదువుకుంటాను. చాల సార్లు కథ రాస్తున్నప్పుడు ఎక్కడైనా తోచక పొతే వీళ్ళ పుస్తకాలలోకి తొంగి చుస్తాను. చిక్కులు కాస్త తొలిగి పోతాయి. సరిగ్గా చెప్పాలంటే వాళ్ళు నాకు రెడీరెకనర్ లాగ ఉపయోగపడుతుంటారు. వీళ్లిద్దరు నాకు సాహిత్యంలో రెండు కళ్ళ లాంటి వాళ్ళు. ఏదైనా కథ నచ్చాలంటే కథలోని ఇతివృత్తంతో బాటు కథ నడిపే తీరు కూడా నచ్చాలి. దాన్ని బట్టే కథలో readability పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలని సైతం పట్టుకోవడంలో వీళ్ళు ఇద్దరు సిద్ధహస్తులు. అంటే
వ్యాసాలు

మరోసారి రైతుల నిరసన జ్వాల

2021 లో ఏడాది పొడవునా నిరసన వ్యక్తం చేసిన తరువాత, భారతదేశ రైతులు వ్యవసాయ రంగాన్ని "సరళీకరించడానికి" ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయించగలిగారు. ఇప్పుడు 2024లో రైతులు మరోసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత నిరసనలకు దారితీసిన వ్యవసాయాన్ని నియోలిబరల్ కార్పొరేటీకరణకు అనువుగా మార్చివేయడం అనే సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ వ్యవసాయ వ్యాపార సంస్థలు, ఆర్థిక మూలధనం భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌పరం చేసేందుకు ఒక నిర్దిష్ట పథకం ప్రకారం ప్రయాస పడుతున్నాయి. ఈ పథకం 1990ల ఆరంభంలో మొదలైంది.  ఈ ప్రణాళికను అమలు చేయడానికి
సాహిత్యం వ్యాసాలు

SOLIDARITY WITH THE PALESTINIAN PEOPLE VICTORY TO THEIR STRUGGLE

Another bloody attack was unleashed by the Zionist-fascist state of Israel against the Palestinian people. Bombings with hundreds of casualties are followed by threats of army incursions, announcing in advance even greater massacres. The killer state of Israel, planted by the imperialists in the Middle East and assigned the role of their bodyguard, has been trying for many decades to exterminate the Palestinians. They have imprisoned them in a strip
వ్యాసాలు

సంతోషకరమైన దినాలు చెల్లిపోయాయి

మూడోసారి నరేంద్రమోదీ సంకీర్ణ ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చాడు.  భారత ప్రజలు విచక్షణతో తీర్పు ఇచ్చారు. దేశంలోని రెండు కూటములకు తగిన ప్రాధాన్యతనిచ్చారు.  ఇది ఎన్నికల సమీకరణల మీద విశ్లేషణ. అయితే మొత్తానికి భారతీయుల సంతోషకర దినాలకు కాలం చెల్లింది.  నిరుద్యోగం, ఆర్థిక కుంగుబాటు భారతీయ కుటుంబాలలో సర్వసాధారణమైంది. అసంఘటిత కార్మికులలో పనిభద్రత ఒక సవాలుగా మారింది.  భారతదేశంలోని కొన్ని నగరాలలో జరుగుతున్న అభివృద్ధికి, నమూనా ముఖ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు వలస కూలీల అవసరం ఏర్పడుతుంది. దేశాన్ని   కలిపే అనేక రైళ్ళు వలస కూలీలతో నిండి ఈ మహా నగరాల వైపు  వెళుతున్నాయి.  గ్రామాలలో ఉపాధి తగ్గింది.  నరేంద్ర