‘మనోధర్మపరాగం’- పాఠకుడి నోట్స్
మా నాయనమ్మ పేరు వంగళాంబ. వాళ్ళ నాన్న పాలఘాట్ రామనాథఅయ్యర్. తమిళుడు. తెలుగు, తమిళనాడులు మదరాసు ప్రెసిడెన్సీగా వున్నప్పుడు కర్నూలు జిల్లాలో డోన్ అనబడే ద్రోణాచలం గ్రామానికి వచ్చి గడియారాల మరమ్మత్తు షాపు పెట్టుకున్నాడు. ముగ్గురు కూతుళ్లకు ఇక్కడి తెలుగు సంబంధాలే చేశాడు. పేదరికం వల్లనో ఏమో మా నాయనమ్మ మా తాతకు (జేనాన/జేజబ్బ) రెండవభార్యగా వచ్చింది. (ఆయన మొదటి భార్య పురిటిలో చనిపోయింది)కూతుళ్ళ పెళ్లిళ్లు అయిపోయాక ఆ కుటుంబం మదరాసుకు తరలిపోయింది. ఆ తరువాత నాయనమ్మకు పుట్టింటితో ఏ సంబంధాలూ లేకపోయాయి.ఎప్పుడైనా మూడు,నాలగేళ్లకోసారి ఆమె అక్క వచ్చి వారం రోజులుండేది.చెల్లెలు అసలు వచ్చేదేకాదు. అంతులేని ఇంటిబరువు, కుటుంబ










