వ్యాసాలు

ఫాసిస్టు సందర్భంలో రచన – ఆచరణ

Something is profoundly wrong with the way we live today...our problem is not what to do; it is how to talk about - Tony Judt Social reconstruction begins with a doubt raised among citizens. - Ivan ఇల్లిచ్ ముందుగా విరసం మహా సభలకు విచ్చేసిన అందరకీ అభినందనలు. సాహిత్యంలోని వర్తమాన ధోరణుల గురించిన దార్శనిక సంవాదాన్ని పరిపుష్టం చేయాల్సిన సందర్భంలో ‘‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగ వాదం’’ అనే థీమ్‌తో జరుగుతున్న ఈ సభల పట్ల నాకు వ్యక్తిగతంగా భిన్నాభిప్రాయం ఉన్నది. ఐనప్పటికీ, ఈ చర్చలు
వ్యాసాలు

డ్యామ్ ఒద్దంటున్న అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు

సియాంగ్ నదిపై కట్ట తలపెట్టిన విద్యుత్ ప్రాజెక్టు ఆదివాసీల భూములను ముంపుకు గురిచేసే ప్రమాదం ఉంది. జూలై 8న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పర్యటనకు ముందు డ్యామ్ నిర్మాణ వ్యతిరేక కార్యకర్తలు యిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జూన్ 22న, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఎగువ సియాంగ్ జిల్లా యంత్రాంగం 12 గ్రామాల పంచాయతీ సభ్యులు, పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సియాంగ్ నదిపై ప్రతిపాదిత జలవిద్యుత్ ప్రాజెక్ట్ వల్ల గ్రామాలన్నీ ప్రభావితమవుతాయి, ఈ ప్రాంత నివాసితులు సంవత్సరాలుగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. టిబెట్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర ప్రధాన ఉపనది సియాంగ్. ఈ సమావేశం 10,000 మెగావాట్ల
వ్యాసాలు

వర్తమాన సామాజిక సందర్భంలో మన రచన, ఆచరణ

సాహిత్యరంగంలో విశాల వేదిక నిర్మాణం కావాలి. ఎందుకంటే భావజాలరంగాన్ని నియంత్రించడానికి రాజ్యం పూనుకుంటున్నది. రాజ్యాంగం ప్రసాదించిన పౌరహక్కులూ, పోరాటాల ద్వారా యిన్నాళ్లూ సాధించుకున్న పౌరహక్కులూ కాలరాయడానికి కంకణం కట్టుకున్నది. కేవలం యిపుడు కొందరు మేధావులూ, రచయితలూ, కళాకారులూ (రాజకీయ భావజాల కారణంగా మాత్రమే గాదు, రాజకీయపార్టీల కార్యాచరణలో భాగమైనందుకు) రాజ్యపు నిర్బంధానికి గురయినారే గానీ యిక ముందర కనీస ప్రజాస్వామిక హక్కు గురించి మాటాడే అందరూ గురయే ప్రమాదం వుంది, రాజకీయ కార్యాచరణ లేకపోయినా! దీన్ని నివారించాలంటే విశాల వేదికలు అవసరం. ఈ విశాల వేదికలు గూడా రాజకీయాలీనంగా వుండాలి. వేదిక పరంగా యే రాజకీయపార్టీకీ అనుసంధానం గాకూడదు.
వ్యాసాలు

మన రాజ్యాంగం – మనం

విరసం 29 వ మహా సభల ప్రారంభోపన్యాసం స్నేహితులారా! మనం ఇక్కడ రాజ్యాంగవాద సారాంశాన్ని గురించి మాట్లాడుకోవడానికి కలిశాం. ఈ రోజు మన జాతి చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భం. మన రాజ్యాంగం కేవలం ఒక న్యాయసంబంధమైన డాక్యుమెంట్‌ మాత్రమే కాదు. అది మన ప్రజాస్వామిక స్ఫూర్తికి ఆత్మ లాంటిది. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛల వైపుగా మనం చేసే ప్రయాణాన్ని సుగమం చేసే ఒక శక్తి. మనం ఒక నూతన యుగం ముంగిట్లో నిలబడి వున్నాం. ఈ సందర్భంగా, మన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలపట్ల మన నిబద్దతను మరోసారి ప్రకటిద్దాం. భారతదేశపు రాజ్యాంగ ప్రయాణం పరిణామక్రమంతో కూడుకున్నది. మనలాంటి
వ్యాసాలు

తన  పౌరుల పైన, రైతులపైన డ్రోన్‌ దాడి చేస్తున్న ప్రభుత్వం

మానవ రహిత వైమానిక వాహనాలను (యుఎవి) అంతర్జాతీయ స్థాయిలో యుద్ధాలలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. 2021లో, ఆ సమయంలో భారత ఆర్మీ చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే, "కంప్యూటర్ అల్గారిథమ్‌ల ఆధారంతో జరిగే డ్రోన్‌ల దూకుడు ఉపయోగం యుద్ధ సమయంలో ట్యాంకులు, ఫిరంగి, భూతల సేన వంటి సాంప్రదాయ సైనిక హార్డ్‌వేర్‌లను సవాలు చేసింది." అతను చెప్పినది పూర్తిగా సరైనది. డ్రోన్ దాడులు ప్రపంచ యుద్ధాల తీరుని మార్చాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి - వీటన్నింటిలో సైన్యం డ్రోన్ విమానాలను ఉపయోగిస్తోంది. మానవాళికి వ్యతిరేకంగా నేరస్తులుగా, ప్రజా ఉద్యమాలకు డ్రోన్‌లు సవాలుగా మారుతున్నాయి.
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

తెలుగు కథకు కారా చేసిందేమిటి ?

తెలుగు సాహిత్యానికి కాళీపట్నం రామారావు గారి చేర్పు ఏమిటి? నిర్దిష్టంగా ఆయన తన కథల ద్వారా కొత్తగా చెప్పిందేమిటి? దీనికి జవాబు వెతికేముందు కారాని ప్రభావితం చేసిన స్థలకాలాలను కూడా చూడాలి.  స్వాతంత్రం వచ్చేసిందని , నెహ్రు సోషలిజం కూడా తెచ్ఛేస్తాడనే భ్రమలు తొలగి అంతటా ఒక అసమ్మతి రాజుకుంటున్న కాలం. గ్రామాలలో చెక్కుచెదరని భూస్వామ్యంపై జనం తిరగబడుతున్న కాలం. సర్దుబాటు కాదు మౌలిక మార్పు కావాలనే తండ్లాట మొదలైన కాలం. రాజకీయార్థిక తలంలో మొదలైన ఈ కదలికను గుర్తుపట్టడమే కారా గొప్పదనం. గ్రామం నుండి పట్టణానికి అనే రాజకీయ అవగాహనను, ఈ అవగాహన పర్యవసానంగా తనకు సమీపంలో
వ్యాసాలు

రాజ్యాంగ ఆరాధనలో స్పష్టంగా కనిపించని చిత్రం

ఏదైనా ఒక రచనను, లేదా సిద్ధాంత ప్రతిపాదనను అంచనా వేసే సమయంలో దాని చారిత్రక సందర్భాన్ని చూడాలి. ఆరాధనా భావంతో కాకుండా విమర్శనాత్మకంగా చూడాలి. ఆ వ్యాసానికున్న స్పిరిట్‌ అవగాహన చేసుకోవాలి. మొత్తానికి ఆ సిద్ధాంత ప్రతిపాదన  ప్రస్తుత సమాజంలోని వైరుధ్యాల్ని ఎట్లా చూస్తున్నది, అవి పరిష్కారం కావడానికి ఉన్న ఆటంకాలుగా వేటిని భావిస్తున్నది, వాటి మీద ఎటాంటి విమర్శనాత్మక వైఖరిని ప్రకటిస్తున్నది అని చూడాలి.  జనవరి 27, 28 తేదీల్లో విరసం సభలో పి.వరలక్ష్మి ఇచ్చిన కీ నోట్‌ ప్రసంగాన్ని పై నేపథ్యంలో అర్థం చేసుకోవడంలో చాలా మంది విఫలమయ్యారు. ఆ కీనోట్‌ మొత్తం ఫ్రేం వర్క్‌ను
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

కారా కథా దృక్పథం

కాళీపట్నం రామారావు   కథా రచన విషయంలో ‘చూపు’  అనే భావనకు చాలా ప్రాధాన్యం ఉంది. కథా వస్తు సేకరణకు చూపు విశాలం కావాలి. అందుకు నాలుగు పక్కలూ కలయ చూడాలి అంటారాయన. చూపు అంటే కంటికి వస్తువుకి మధ్య సంబంధమే కాదు. వస్తువు వెనుక దాని చలనానికి కారణమైన శక్తులను గుర్తించటం. వస్తువు ఉపరితలాన్నిచీల్చుకొంటూ లోలోతులకు ప్రసరిస్తూ వస్తు తత్వాన్ని గాలం వేసి గ్రహించగలటం . చూపుకు ఆ నైశిత్యం ఇచ్చేది చైతన్యం. అది అనుభవం నుండి. సామాన్య లౌకిక జ్ఞానం నుండి అంతకన్నా ఎక్కువ రాజకీయార్థిక అవగాహన నుండి అభివృద్ధి చెందుతుంది.   దానినే జీవిత
వ్యాసాలు

ఛత్తీస్గఢ్లో ‘చట్టవ్యతిరేక’ కార్యకలాపాలు

ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం కింద ( సిఎస్‌పిఎస్ఎ) మూలవాసి బచావో మంచ్ (ఎంబిఎమ్)ని 'చట్టవ్యతిరేకమైన సంస్థ'గా ప్రకటిస్తూ 2024నవంబర్ 8 నాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది . చట్టవ్యతిరేక కార్యకలాపాల(నివారణ)చట్టం (యుఎపిఎ)- 1967 లాగానే, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారని ప్రభుత్వం భావించే  సంస్థలను నిషేధించడానికి సిఎస్‌పిఎస్ఎ ప్రభుత్వానికి అధికారాన్నిస్తుంది. ఈ చర్య చేపట్టడానికి ఆ  నోటిఫికేషన్ రెండు కారణాలను పేర్కొంది: ఒకటి, "మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల "లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను మంచ్ వ్యతిరేకిస్తోంది;  రెండు, తమ భూముల్లో సెక్యూరిటీ క్యాంపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరిస్తోంది.
సాహిత్యం వ్యాసాలు

మమతా ఫాసిజం మాటేమిటో!

“ఎంత మాట! ఇట్లనవచ్చా? సందర్భశుద్ధి లేకుండా?” అనే వాళ్లుంటారని నాకు తెలుసు. సరిగ్గా అనవలసిన సందర్భం ఇదే. పైగా నిన్న మొన్న కూడా ఈ మాట అన్నవాళ్లకు ఇప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. పశ్చిమ బెంగాల్ విషయంలో సోషల్ ఫాసిజమనీ, మమతా ఫాసిజమనే మాటలు ఎప్పుడో ముందుకు వచ్చాయి. ఫాసిజాన్ని ఇన్ని రకాలుగా, ఇన్ని విశేషణాలతో చెబితే అసలు ఫాసిజం మీద విమర్శ పలుచన అవుతుందనే వాళ్లూ ఉండొచ్చు. మన దేశంలో ఫాసిజం కూడా బహురూపి. సూక్ష్మరూపి, సర్వవ్యాపి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, పాలకవర్గ రాజకీయార్థికానికి అది అత్యంత సన్నిహితమైనది. కేవలం బ్రాహ్మణీయ హిందుత్వ వల్లనే మన దేశంలోని ఫాసిజం