సాహిత్యం వ్యాసాలు

డిజిటల్ పాఠాలు పేద విద్యార్థులకు చేర్చడంలో పాలకులు విఫలం

అంతర్జాతీయ కరోనా విపత్తు వలన గత ఏడాది నుండి తెలంగాణ రాష్ట్రంలో విద్యభోదన ప్రత్యక్ష తరగతిగది విధానంలో కాకుండా డిజిటల్ తరగతుల పేరుతో జరుపుతున్నారు.ఈ విద్యా సంవత్సరం కూడా డిజిటల్ రూపంలోనే తరగతుల భోదన ఉంటుందని విద్యశాఖ స్పష్టం చేసింది. అయితే రూపంలో డిజిటల్ విద్యభోదన ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సారంలో డిజిటల్ తరగతులు ఎంత మంది విద్యార్థులకు అందుతున్నాయనేది నేడు మనందరి ముందున్నట్టి ప్రశ్న. వేల సంవత్సరములుగా మన దేశంలోని శోశితజనసమూహౕలపై జరుగుతున్న సామాజిక,ఆర్థిక అణచివేత వలన నేడు మెజారిటీ ప్రజలు డిజిటలైజేషన్ ఫలితాలను అందుకోలేని పరిస్థితి నెలకొంది. తరగతిగదిలో ప్రత్యక్ష భోదనకు స్కూల్ బిల్డింగ్, టీచరు, బెంచీలు,
వ్యాసాలు

బాబ్రీ వివాదంలోన్యాయం చేయని సుప్రీం కోర్టు

(ప్రసిద్ధ న్యాయవాది, రచయిత, పాత్రికేయుడు, కాలమిస్ట్, ప్రత్యేక/పత్రికా శీర్షికా రచయిత ఎ. జి. నూరానీ 2024 ఆగస్టు 29 నాడు (93 సంవత్సరాలు) మరణించారు. ఆయన మరణంతో మన దేశంలో చట్టాన్ని మాత్రమే కాకుండా, సమాజాన్ని కూడా పర్యవేక్షించే ఒక బలమైన ఆధార స్తంభం కూలిపోయింది. తన జీవితంలో ఎప్పుడూ రాజీపడని స్తంభం. జీవితాంతం తాను సృష్టించిన ప్రజాస్వామిక, లౌకికవాద విలువలకు కట్టుబడి జీవించాడు. ఎమర్జెన్సీకి, బాబ్రీ మసీదు కూల్చివేతకు వ్యతిరేకంగానూ, కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలన్నింటిపైనా నిర్భయంగా రచనలు చేసాడు. బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా తన న్యాయవాద వృత్తి కాలంలో ఎప్పుడూ అన్యాయం చేయలేదు.
సాహిత్యం వ్యాసాలు

రాష్ట్రబడ్జెట్-రాయలసీమ

గత రెండు సంవ‌త్స‌రాల జమా,ఖర్చుల విశ్లేషిస్తూ,రాబోయే సంవ‌త్స‌ర‌పు రాష్ట్ర అవసరాలే గాకుండా,భవిష్య‌త్తును దృష్టి లో పెట్టుకొని వివిధ రంగాలకు నిధులు కేటాయింపు చేయడమే బడ్జెట్ లక్ష్యం.ఇందులో,ప్రజల తక్షణ అవసరాలకై సంక్షేమ కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యతనిస్తూనే,రాష్ట్ర సమగ్రాభివృద్ధికి  దోహదపడేలా నిధుల (మూలధన పెట్టుబడి) కేటాయింపులుండాలి.అప్పుడే క్రమక్రమంగా ప్రజలు తమకాళ్ళపై తాము నిలబడగలుతారు. భవిష్యత్తరాలు,ఆత్మవిశ్వాసంతో జీవనాన్ని కొనసాగించగలిగే అవకాశంవుంటుంది కూడా.అయితే.ఇక్కడ కేవలం ఆర్థికాభివృద్ధి చెందడమే సరిపోదు,అందులో ప్రజలకు వారి వాటకూడా దక్కాల్సివుంటుంది. అలా ఆశించడం ఈ వ్యవస్థలో పేరాశనే అవుతుందనేది మరో అంశం. పొతే, కేవలం ఓట్ల రాజకీయాల్లో,   మంది బలం పై నడిచే నేటి రాజకీయాలలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి  అనేది ఒక
వ్యాసాలు

త‌పాలా ఉద్యోగులంటే మోదీకి ఎందుకింత కక్ష ? 

చెడ్డ‌ పోస్టుమ్యాన్ ఉండ‌డు.. , మంచి పోలీస్ క‌నిపించ‌డు.. అనేది ఓ నానుడి. అంటే..  పోస్ట్ మ్యాన్ పని విధానం ఎంత‌  నిస్వా ర్థంగా త్యాగ‌పూరితంగా ఉంటుందో ఈ సామెత తెలియ‌జేస్తున్న‌ది. నేటికీ మారుమూల గ్రామం మొద‌లు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల దాకా త్యాగ‌పూరితంగా సేవ‌లు అందిస్తున్న ప్ర‌భుత్వ విభాగం ఏదైనా ఉన్న‌ది అంటే అది తంతి త‌పాలా శాఖ (పోస్ట‌ల్ డిపార్ట్ మెంటు) మాత్ర‌మేన‌ని చెప్పుకోవాలి. వృత్తి నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్న గ్రామీణ త‌పాలా ఉద్యోగులు త‌మ స‌మ‌స్య ల ప‌రిష్కారం కోసం  కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూ స‌మ్మె చేస్తే, వారిని కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ బీజేపీ ప్ర‌భుత్వం
వ్యాసాలు

ప‌డిపోతున్న‌  విశ్వవిద్యాలయాల ప్రమాణాలు

రాయలసీమ  విద్యా పరిరక్షణ కమిటీ,  అమ్మకు తిండి  పెట్టలేదు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు కొనిపెడతానని చెప్పాడంట వెనకటికి ఒక ప్రబుద్ధుడు. కర్నూలు  జిల్లాలో రాయలసీమ విశ్వవిద్యాలయం, ఐఐటిడిఎం, ఆంధ్ర ప్రదేశ్ ఉర్దూ విశ్వ విద్యాలయం ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అనే సంగతి పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జగన్నాథ గట్టు దగ్గర క్లస్టర్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. 2008 లో 16 విభాగాలతో ఏర్పడ్డ  రాయలసీమ విశ్వ విద్యాలయం పట్టుమని పది మంది అధ్యాపకులు లేక కీలక విభాగాలు మూసివేతకు గురైనాయి.  అమెరికాలో ఒక ప్రభుత్వం గద్దె దిగగానే ప్రభుత్వంలో ఉన్న సెక్రెట్రీలు కూడా అధికారం
వ్యాసాలు

చదువులు ఎలా ఉండాలి? చదువుల సారం ఏమిటి?

(త్వరలో విడుదల కానున్న కొకు నవల చదువు పునర్ముద్రణకు రాసిన ముందుమాట) కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన నవలలో ఒక పెద్ద నవల చదువు. ఇది 1950లో మొదటిసారిగా అచ్చు అయింది. అప్పటి నుండి ఇది అనేక పర్యాయాలు పునర్ముద్రణ పొందింది. సహజంగానే చదువు అనే టైటిల్‌ ఆ నవలకు ఉండడంతో ఇది ఆనాటి విద్యా విధానానికి సంబంధించిన నవల అని చాలా మంది అనుకోవడం కద్దు. కానీ ఇది చదువులకు మాత్రమే పరిమితమైన నవల కాదు. 1915 నుంచి 1935 వరకు అంటే దాదాపు రెండు దశాబ్దాల కాలపు ఆంధ్రదేశ సాంఘిక చరిత్ర చిత్రణ ఈ నవలలో
సాహిత్యం వ్యాసాలు

విశాఖ ఉక్కును కాపాడుకుందాం

మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. జనవరి 27న కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీ.సీ.ఈ.ఏ) సమావేశం ఉక్కు పరిశ్రమతోపాటు, దాని అనుబంధ సంస్థలలో నూటికి నూరు శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగానే ఉక్కు పరిశ్రమ అమ్మకానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు దక్షిణ కొరియా కార్పొరేట్‌ సంస్థ పోస్కో (పోహాంగ్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీతో సంప్రదింపులు కూడా జరిపారు. మరోవైపు భారత దళారీ, నిరంకుశ బూర్జువా వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యుడు ఆదానీతో కూడా కొన్ని లావాదేవీలు జరిగాయి. ఈ విషయాలేవి ఉక్కు పరిశ్రమ కార్మికులకు గానీ, గతంలో
వ్యాసాలు

అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు: ప్రజాస్వామ్యం ఎక్కడ?

ప్రజా శేయస్సును పక్కన పెట్టి కార్పొరేట్ దోపిడీకి అనుకూలంగా వుండే అభివృద్ధి నమూనాను విధించే ప్రయత్నంలో అటవీ భూముల నుండి తమని నిర్వాసితులను చేయడానికి ప్రయత్నిస్తున్న రాజ్యంతో ఆదివాసులు పోరాడుతున్నారు . సాంప్రదాయకంగా జీవించే భారతీయ ఆదివాసులు  జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడుతూ   నిరంతర పోరాటంలో చిక్కుకున్నారు. అనివార్యంగా విదేశీ మూలధనంపై ఆధారపడే ప్రాజెక్ట్‌‌ల కోసం, భారతదేశ సహజ వనరుల కార్పొరేట్ దోపిడీ కోసం అడవుల్లో నివసించేవారిని చట్టబద్ధంగా నిర్వాసితులను చేసేందుకు రాజ్యానికి అటవీ హక్కుల చట్టం 2006(ఫారెస్ట్ రైట్స్ యాక్ట్-ఎఫ్ఆర్ఎ), ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 (ఎఫ్‌సిఎ) వంటి చట్టాలు రాజకీయ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. "పరిరక్షణ" అనే
వ్యాసాలు

డప్పు క‌ళ‌

డప్పు-డోలక్ ల‌ను జననాట్యమండలి ఎందుకు స్వీక‌రించింది? ఎలా వినియోగించింది? ఏం ప్రయోజనం నెరవేరింది? వాటిని వినియోగించడంలో ఏ లక్ష్యం సాధించారు? శబ్దం, దరువు – ప్రదర్శనలో గాని పాత్ర బాణీలు మారినప్పుడు ఏ విధంగా డప్పుశాస్త్రం రాయడం, నాలుగు తాళాలు అభివృద్ధి చేయడం ఇంకా భవిష్యత్‌లో అవకాశాలు. పాటకు ఈ వాయిద్యానికి మధ్య సమన్వయం గురించి వివరణలో రాగాలు మారినపుడు ఎలా? జననాట్యమండలి రచయితలు, కళాకారులు ప్రజల జానపద బాణీలతోనే తమ మెజారిటీ పాటలను, రాశారు. కాబట్టి ప్రధానంగా జానపద పాటలకు ప్రధానంగా ప్రజలు వాడే  వాయిద్యం డప్పు కనుక జననాట్యమండలి కూడా అదే వాయిద్యాన్ని తన ప్రధాన
వ్యాసాలు

బ్రాహ్మణీయ హిందుత్వ సాధనాలు  ద్వేషం, భయం, పెత్తనం, హింస

(త్వరలో విడుదల కానున్న పాణి వ్యాసాల సంపుటి ద్వేషభక్తి కి రాసిన ముందుమాట) గత పదేండ్ల హిందుత్వ పాలనను చీకటి కాలంగా గుర్తించడం మామూలు విషయమయ్యింది. నిజమే, చీకటి అలుముకుంటుంది, కాని వాస్తవానికి చీకటి లేనిదెప్పుడు? అయితే చీకటి ఎప్పుడూ వుండేదే కదా అనుకుంటే  ఇప్పుడు మరింత  గాఢంగా మారుతున్న చీకటికి ఎటువంటి ప్రత్యేకత లేదా అనే మరో ప్రశ్న వస్తుంది. అసలు చీకటి, వెలుగులతో మాత్రమే సంక్లిష్టమైన కాలాన్ని, సమాజ చలనాన్ని, అందులోని సంఘర్షణలను అంచనా వేయగలమా అనే ప్రశ్న కూడా వస్తుంది. అందుకే చీకటి, వెలుగులను విశాల సామాజిక, రాజకీయార్థిక అవగాహనతో చారిత్రకంగా అంచనా వేయాల్సివుంటుంది.