వ్యాసాలు

“DIVULGE, DIVEST, WE WILL NOT STOP, WE WILL NOT REST”

Students have declared their unwavering support to the Palestinian liberation movement and have come out avowedly against the genocides conducted by the Zionist Israeli state with the overt support of imperialist forces, especially US and UK imperialism. The protest is escalating at a time, when Biden signed a new military package of $31 billion to provide shoulder to the Zionist crime, causing humanity Crisis in Palestine. The movement that begun
వ్యాసాలు

2010 రోజుల ఏకాంత వాసం

 జమ్ము, కశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లోని జైళ్లలోఐదు సంవత్సరాలకు పైగా  2010 రోజులు..  జైలులో వున్న కశ్మీర్ జర్నలిస్ట్ ఆసిఫ్ సుల్తాన్ గాథ  2024 ఫిబ్రవరి29 న,  ఇంటికి తిరిగి వచ్చారు . అప్పుడు   ఆసిఫ్ సుల్తాన్ ఆరేళ్ల కుమార్తె అరీబా తన తండ్రిని మొదటిసారిగా స్వేచ్ఛాయుత వ్యక్తిగా చూసింది. అంతకుముందు, శ్రీనగర్ సెంట్రల్ జైలు జాలీ గోడ వెనుక చేతికి సంకెళ్లతో కటకటాల వెనుక వున్నప్పుడు చూసింది. ఆ తరువాత  ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లా జైలుకు, ఆపై జమ్మూలోని కోట్ భల్వాల్ జైలుకు తరలించారు. "అరీబాకి తన తండ్రిని మొదటిసారి చూసినట్లు అనిపించింది" అని ఆసిఫ్ 67 ఏళ్ల
ఓపన్ పేజ్

‘ఇతరుల’ గురించి మాట్లాడలేమా?

మనుషుల స్పందనలు బహు విచిత్రం.  ఎప్పుడు దేన్ని పట్టించుకుంటారో.  ఏ విషయంలో  మౌనంగా ఉంటారో. దేన్ని తప్పించుకొని జాగ్రత్తగా తిరుగుతారో. చెప్పడం అంత సులభం కాదు. ఆరోపించీ లాభం లేదు. దీన్నంతా ఇష్టా ఇష్టాలుగా తేల్చవచ్చా? ఉద్దేశాలకు, రాజకీయాలకు మాత్రమే ఆపాదించవచ్చా? చైతన్యం గీటురాయి మీద పరీక్షించవచ్చా? సాంస్కృతిక స్థాయిగా కూడా చూడవచ్చా? ఇట్లా ఎన్ని చెప్పుకున్నా ఎంతో కొంత  మిగిలే ఉంటుంది. దీనికి చాలా కారణాలే ఉంటాయి. సమాజం యావత్తూ స్పందించడం సరే. అక్కడ చాలా సంక్లిష్టతలు పని చేస్తుంటాయి. స్పందనకూ మౌనానికీ  జటిలమైన కారణాలు ఉంటాయి. కానీ సమాజ కంఠస్వరంగా వినిపించే వాళ్ల మాటలనూ, మౌనాన్నీ
వ్యాసాలు

రాజకీయాలు – సామాజిక మాధ్యమం

రాజకీయ, సాంస్కృతిక వ్యక్తీకరణలో  చొరబడిన ‘సామాజిక మాధ్యమం’ అనేక మానవీయ విషయాలలో గందరగోళం సృష్టిస్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా సోషల్‌ మీడియా ప్రజల ఆలోచనాధారలోకి ప్రవేశించింది. ప్రధాన స్రవంతి మీడియాకు ప్రత్యామ్నాయంగా మనిషి చేతికి సామాజిక మాధ్యమం అంది వచ్చింది. సృజనాత్మక అభినివేశం గల మానవుల సాంస్కృతిక, రాజకీయ వికాసపు వ్యక్తీకరణకు సోషల్‌ మీడియా ఆలంబనగా నిలిచింది. పదేళ్ల కాలంలో సోషల్‌ మీడియా భారత సమాజంపై తనదైన ముద్ర వేయగలిగింది. మన ఇంటి పక్క అమ్మాయి, లేదా అబ్బాయి తమకున్న సృజనాత్మతతో లక్షలాది వీవర్స్‌ను సంపాదించకోగలుగుతున్నారు. కొందరికి ఆర్ధిక వనరయింది కూడా.  సోషల్‌ మీడియాకు సమాజమే ప్రతిబింబం. దిన పత్రికలను,
వ్యాసాలు

గాజాలోని సామూహిక సమాధుల్లో చేతులు కట్టేసి వున్న మృతదేహాలు

గత వారం చివర్లో గాజా కేంద్ర ప్రాంతంలోని ఖాన్ యూనిస్‌లో వున్న నాజర్ హాస్పిటల్‌లో, ఉత్తరాన గాజా సిటీలోని అల్-షిఫా హాస్పిటల్ మైదానంలో వందలాది మృతదేహాలను ఖననం చేసి, చెత్తతో కప్పారు. గాజాలో సామూహిక సమాధుల గురించి కలతపెట్టే నివేదికలు వస్తున్నాయని ఐక్యరాజ్యసమితి (ఐరాస) మానవ హక్కుల కార్యాలయం (ఓ‌హెచ్‌సి‌హెచ్‌ఆర్) ఏప్రిల్ 23 మంగళవారంనాడు తెలిపింది. పాలస్తీనా బాధితుల మృతదేహాల చేతులు వెనక్కు  కట్టేసి, నగ్నంగా ఉన్నాయి. ఈ సమాచారంతో ఇజ్రాయెల్ దాడుల్లో యుద్ధ నేరాలకు సంబంధించి  కొత్త ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గాజాలోని స్థానిక ఆరోగ్య అధికారులను ఉటంకిస్తూ  అల్-షిఫా ఆసుపత్రి నుండి మరిన్ని మృతదేహాలను
వ్యాసాలు

Operation Kagar: The most savage stage of the brutal war in Dandakaranaya

Dandakaranya, in its decades of revolutionary journey, pioneered several social and cultural experiments that India needs. It has been bearing the brunt of unparalleled violence for four decades. But now, it is in the midst of a ruthless battle for the past three months.  Operation Kagar (The Final Mission), with more than a hundred thousand paramilitary forces supported by drones, helicopters, and satellite surveillance, reminds us of an invasion of
వ్యాసాలు

కగార్ ఒక యుద్ధ వ్యూహం

(ఇటీవల ఆపరేషన్ కగార్   మీద  విరసం  ప్రచురించిన *దేశం కార్పొరేట్లకు* అనే పుస్తకానికి రాసిన ముందు మాట ) ఒక యుద్ధ వ్యూహానికి అనేక పార్శ్వాలు వుండవచ్చు. ఒకసారి యుద్ధమంటే ఎదురు దాడి. మరోసారి యుద్ధమంటే ఆక్రమణ. ఈ ఆక్రమణ అన్ని సందర్భాల్లోనూ ఒకేలా వుండదు. దేశాల మధ్య యుద్ధం. దేశం లోపల యుద్ధం. దేశాల మధ్య యుద్ధానికి సరిహద్దు, ద్వైపాక్షిక సంబంధాలు కేంద్రంగా వుంటాయి. దేశ అంతర్గత యుద్ధానికి తన పౌరులనే శత్రువులుగా పరిగణించే రాజ్య స్వభావం వుంటుంది. భారతదేశంలో ఆదివాసీ సమూహం భారత రిపబ్లిక్‌కు శత్రువుయింది. ఎందుకిలా అయింది? ఈ ప్రశ్న మరీ పాతది. అయినా
వ్యాసాలు

‘సమూహ’ సృజనపై ఉన్మాద రాముడి దాడి

సాహిత్య రాముడిని సనాతన రాముడిగానే కొలవాలి. ధర్మావతారుడిగానే భజించాలి. రాముడు రామాయణమనే సాహిత్యరూపం కూడా తీసుకున్నాడు కాబట్టి రచయితలు డీకోడ్‌ చేయబోతే ఉన్మాద రాముడిగా వీరంగం తొక్కుతాడు. ఆయన వారసులు మద్యం తాగి, రాముడిని వేదాంత స్వరూపుడిగానే చూడాలని బూతులు తిడతారు. రాముడి గురించి మేం తప్ప మరెవరూ మాట్లాడటానికి వీల్లేదని దాడి చేస్తారు. లౌకికవాదంపై చర్చకు వాళ్ల అనుమతి తీసుకోలేదని మీదపడి కొడతారు. వరంగల్‌ ‘సమూహ’ అనుభవం ఈ దేశం ఎక్కడున్నదో ఎత్తి చూపుతున్నది. లౌకికవాదాన్ని కాపాడుకోవాలంటే మాట్లాడుకోవాలి కదా. ఒకరి మాటలు ఒకరు వినాలి కదా. సభ పెట్టుకోవాలి కదా. లౌకికవాదాన్ని చర్చించబోతే రాజ్యాంగంలోని హక్కులన్నిటినీ
వ్యాసాలు

జెఎన్‌యు పరిణామాలు – రాజకీయ ప్రాసంగికత

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (జెఎన్‌యుఎస్‌యు) ఎన్నికలు - నాలుగు సంవత్సరాల తర్వాత - ఎట్టకేలకు ముగిశాయి. వాటిలో యునైటెడ్ లెఫ్ట్ ఫ్రంట్ విజయం సాధించింది. ‘జెఎన్‌యులో మళ్లీ ఎరుపు వర్ణం పుష్పించింది’ అని వారు, వారి మద్దతుదారులు అంటున్నారు. అయితే ప్రతి పదవిలోనూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అందుకే తమలో విభేదాలు ఉన్న వామపక్షాలు మితవాదులకి భయపడి ఒక్కటయ్యారని, అయినా తమకు, వారికీ మధ్య తేడా చాలా తక్కువగా ఉందని అందుకే తమదే విజయమని అంటున్నారు. గతంలోలాగా విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కచ్చితంగా ఏబీవీపీ
వ్యాసాలు

ఈకాలపు స్త్రీవాద కవిత  ‘బొట్టు’

ఇండియాలో స్త్రీలు అనగానే కట్టు బొట్టు అంటూ మొదలుపెడతారు. అందం మాటున అణచివేత ఉంది. సాంస్కృతిక కట్టడి ఉంది. స్వేచ్ఛగా కదలడానికి వీలు లేని ఆహార్యం స్త్రీలకు నిర్దేశితమైంది. తరాలు మారినా, ఎన్ని కొత్త ఆలోచనలు చేసినా ఇష్టంగానో అయిష్టంగానో ఈ గుదిబండను స్త్రీలు మోస్తూనే ఉన్నారు. ‘తగలెయ్యాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన స్త్రీవాదులతో సహా. ఎందుకంటే అది వదిలించుకోవడం అంత సులభం కాదు. అది వ్యక్తిగత అభిరుచికి సంబంధించినది మాత్రమే కాదు. అది సమాజంలో నీ ఉనికిని, గుర్తింపును, గౌరవాన్ని నిర్దేశించేది. ఒక కుటుంబానికి సంబంధించిన, సమూహానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాల భారాన్ని మోయవలసింది స్త్రీలే.