వ్యాసాలు

ఉమ్మడి పౌరస్మృతి ప్రజావసరమా? బిజేపి  అవసరమా?

ఈ ప్రశ్నకు సమాధానం ప్రజలందరికీ తెలుసు. కానీ ఇది ప్రజలకు అవసరమై చట్టమని,ప్రజల కోసమే తీసుకువస్తున్నట్లు బీజేపీ చెబుతోంది.  ఉమ్మడి హిందువులకే ఒక చట్టం లేదు..  ఇప్పుడు ఉమ్మడి పౌరసత్వ చట్టం ఎందుకు? అనే  ప్రశ్నకు బీజెపి  వద్ద   సమాధానం లేదు. అది మా ఎజండా అంశం.. ప్రజలందరికి అవసరం.. అందుకే తీసుకు వస్తున్నాం.. అంటోంది.  ఏ లాభం లేనిదీ ఏ రాజకీయ పార్టీ ఏ చట్టాన్నీ తేవాలనుకోదు. ఇది ఎవరేమన్నా ఆర్‌ఎస్‌ఎస్‌ రహస్య ఎజండా! దాన్ని  అమలు చేయటానికి బిజేపి ఎన్ని ఎత్తులు, పొత్తులు, కుట్రలకైనా వెనుకాడదు. సూటిగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఈ చట్టం తీసుకు రాకుంటే
వ్యాసాలు

కామ్రేడ్ ఎల్‌ఎస్‌ఎన్ స్నేహం శరచ్చంద్రిక

కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి అమరుడైన 21 డిసెంబర్ రోజే 53 సంవత్సరాల తర్వాత కామ్రేడ్ ఎల్.ఎస్.ఎన్ మూర్తి అమరుడు కావడం యాదృచ్ఛికమే కావచ్చు. కాకపోతే ముప్పై ఏళ్ళు నిండకుండానే శ్రీకాకుళ విప్లవంలో ఎన్‌కౌంటర్ అయిన సుబ్బారావు పాణిగ్రాహి పూజారిగా పనిచేస్తూ కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడు అయ్యాడు. గుడికి వచ్చే వారికి, గ్రామ ప్రజలకు ఆ భావాలు ప్రచారం చేసేవాడు. ఇక ఎల్.ఎస్.ఎన్ పూర్వీకులది కాంగ్రెస్‌లోనే ‘అతివాదం’గా భావించబడిన రాజకీయ చరిత్ర. గుంటూరులో అన్న లక్కవరం రాధాకృష్ణమూర్తి యింట్లో ఉండి చదువుకున్న రోజుల్లో ఆయన ఇంగ్లిషు లెక్చరర్ అయిన అన్న నుంచి, ఆ ఇంట్లో ఉండి స్ఫూర్తిశ్రీ పేరుతో భారతి
వ్యాసాలు

కుకీలకు మద్దతిచ్చినందుకు కోర్టు సమన్లు

'ది వైర్' కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి, ప్రొఫెసర్ ఖమ్ ఖాన్ సువాన్ హౌసింగ్; కుకీ ఉమెన్స్ ఫోరమ్ కన్వీనర్ మేరీ గ్రేస్ జూ; కుకీ పీపుల్స్ అలయన్స్ ప్రధాన కార్యదర్శి విల్సన్ లాలం హాంగ్షింగ్ లకు ఇంఫాల్ కోర్టు సమన్లు జారీ చేసింది. కరణ్ థాపర్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలలో, ఆ ముగ్గురూ మణిపూర్ కుకీ సముదాయానికి  ప్రత్యేక పరిపాలన ఉండాలనే డిమాండ్‌కు మద్దతునిచ్చారు. దీనితో ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు పలు ఐపీసీ నిబంధనల కింద వారిపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రొఫెసర్ హౌసింగ్ పై మెయితీ ట్రైబ్స్
వ్యాసాలు

సీమ అస్తిత్వ చరిత్రలో వెలుగు కెరటం సుబ్బరాయుడు

( రాయ‌సీమ విద్యావంతుల వేదిక  మూడో బులిటెన్‌కు రాసిన ముందుమాట‌. జ‌న‌వ‌రి 4న క‌ర్నూలులో జ‌ర‌గ‌నున్నఆర్ వి వి రాష్ట్ర మ‌హాస‌భ‌లో ఆవిష్క‌ర‌ణ‌) చరిత్ర చాలా అద్భుతమైనది. తన స్థల కాలాలకు అవసరమైన మానవులను తానే తయారు చేసుకుంటుంది. తన స్వరానికి తగిన గొంతుకలను సిద్ధం చేసుకుంటుంది. ఈ విడత రాయలసీమ ఉద్యమానికి అవసరమైన వాదనలతో  మేధో సమర్థన అందివ్వగల వ్యక్తిగా చరిత్ర సుబ్బరాయుడుగారిని ఎంచుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయే నాటికి ఆయన కేవలం ఇంజనీర్‌ మాత్రమే. వృత్తి వల్ల పట్టుబడిన నైపుణ్యాలతో రాయలసీమ నీటి పారుదల వ్యవస్థ గురించి ఆలోచిస్తుండేవారు. తుంగభద్రలో వృథా అవుతున్న నీటిని ఒడిసిపట్టుకొని
వ్యాసాలు

వందేమాతర స్వరం మారుతున్నది

వందేమాతరం గీతంపై శీతాకాలపు సమావేశాలలో భారత పార్లమెంట్ చర్చి స్తున్నది.   ఆనాటి రాజ్యాంగ సభ దేశభక్తి గీతంగా వందేమాతరం గీతాన్ని ఆమోదించింది. ఇటీవల కాలంలో వాజ్ పేయి(1998) నరేంద్ర మోదీ (2025) పరిపాలనా కాలంలో ఒకానొక చర్చగా ముందుకు వస్తుంది.  వందేమాతరం గీతం సారాంశం ఏమిటి? కాలంతో పాటు ఎందుకు వివాదాస్పదం అవుతోంది. బకించంద్ర ఆనందమఠం  నవలలో వందేమాతర గీతాన్ని రాశారు. జాతీయోద్యమ కాలంలో ప్రజల పాడుకునే విధంగా గీతం ప్రాచుర్యం పొందింది. అధికార మార్పిడి తర్వాత అధికారక దేశభక్తి గీతం అయింది. దేశంలోని భిన్న మతాల ప్రజలలో కొన్ని మినహాయింపులున్నా వందేమాతర గీతాన్ని ఆలపిస్తున్నారు. వందేమాతర గీతాన్ని
వ్యాసాలు

జైలు ఆకాంక్షల్లో రచన రూపేష్ అముద్రిత నవల ‘ఖైదీల జ్ఞాపకాలు’

అక్ర‌మ కేసులో  జైల్లో ఉన్న కేర‌ళకు చెందిన రాజ‌కీయ ఖైదీ రూపేష్ నవల ఖైదీల జ్ఞాపకాలు చదువుతున్నప్పుడు నెల్సన్ మండేలా ఆత్మకథలోని ఒక జైలు జ్ఞాపకం గుర్తొచ్చింది. పాతికేళ్ళకు పైగా జైలులో బందీగా ఉన్న మండేలా, దాస్ కాపిటల్ గ్రంథాన్ని జైలులోనే చదివాడు. జైలుకి వెళ్ళక ముందు మండేలా కేవలం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మాత్రమే చదివాడు. దాస్ కాపిటల్ జైలుకు చేరడం అనేది ఆసక్తికరమైన విషయం. జైలు సూపరింటెండెంట్ అశ్లీల రచనలను లేదా హాస్య కథలను మాత్రమే లోపలికి అనుమతించేవాడు. అయితే, ఈ మధ్యలో ఎవరో ఇతర పుస్తకాలతో పాటు దాస్ కాపిటల్‌ను కూడా సూపరింటెండెంట్ ముందు ఉంచారు.
వ్యాసాలు

ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన – కొన్ని ఆలోచనలు

(ఇది దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పేట్రియాటిక్ డెమొక్రటిక్ మూవ్ మెంట్ – పిడి ఎం) మార్చ్ 26న గుంటూరులో జరిపిన సదస్సులో ‘ఫాసిజం – ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటన’ అనే అంశం మీద చేసిన ఉపన్యాస పాఠం. సమయం లేకపోవడం వల్ల ఆ విశాలమైన అంశాన్ని మాట్లాడలేనని, ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటన ఆవశ్యకత అనే అంశంలో కొన్ని కోణాలను, చరిత్ర అనుభవాలను మాత్రమే వివరిస్తానని ఉపన్యాసకుడు ముందే సూచించాడు) ఫాసిజం అంటే ఏమిటి? ఇవాళ దేశంలో ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన నిర్మించవలసిన అవసరమేమిటి? ఆ ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనను ఎట్లా నిర్మించాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
వ్యాసాలు

భారతి సాహిత్య ధమ్మం

సాహిత్యంలో సామాజికత సామాజిక వాస్తవికత వంటి భావనలు యివ్వాళ కొంతమందికి యెబెట్టుగా కనిపిస్తున్నాయి. సాహిత్యకారులు సమాజంలోకి చూడటం, సాహిత్యంలో సమాజాన్ని పరిశీలించడం, సాహిత్యం ద్వారా సామాజిక చలనాన్ని వ్యాఖ్యానించటం అవసరం లేదని వాళ్ళ ఉద్దేశం. మరీ అంత చేతి దురద వుంటే ఆ పని యే వ్యాసాల్లోనో  చేసుకోండి, కథ నవల వంటి ప్రక్రియల్లో చేయాల్సిన అవసరం లేదని కూడా గొంతు చించుకుని వక్కాణిస్తారు. పతంజలి ‘పిలకతిరుగుడు పువ్వు’ కథలో  సెషన్స్ కోర్టు జడ్జి తన కింది కోర్టు న్యాయమూర్తి(యస్ కోట మున్సీఫ్  మెజిస్ట్రేట్ గంగాధరం)ని సమాజంలోకి తొంగి చూసి వ్యాఖ్యానించినందుకు  తప్పుపట్టి హెచ్చరించినట్టే శుద్ధ సాహిత్యవాదులు కూడా
వ్యాసాలు

ఎవరిదీ  తెలంగాణ ? ఎవని పాలైంది ?

డెబ్బై ఏళ్ళ తెలుగు రాష్ట్రం రెండు బలమైన ఉద్యమాలను చూసింది.ఒకటి నక్సల్బరీ రెండు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.  సిద్దాంత రిత్యా రెండూ వైరుధ్యమైన ఉద్యమాలు అయినప్పటికీ  రెండు ఉద్యమాలూ సుధీర్గ కాలం నడిచాయి. ఎన్నో నిర్భందాలు ఎదుర్కొన్నాయి అవి ఒక దానికి మరొకటి సంబంధ భాంధవ్యాలను కలిగి ఉంది. తొలివిడత తెలంగాణ మిగిల్చిన అసంతృప్తుల దావాలనమే  నక్సల్బరీ ఉద్యమాన్ని కొనసాగించాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకున్న ప్రతి గొంతూ ఈ రెండు ఉద్యమాలను గుండెలకు హత్తుకున్నాయి. ఇది పోరు భూమి, ఆట పాట సైదోడై కదన రంగాన్ని కవాతు తొక్కేలా చేసాయి.  సీమాంధ్ర దోపిడీ సాంస్కృతిక అభిజాత్యం పాలకుల నిర్లక్ష్యం
వ్యాసాలు

వాకపల్లి మహిళలపై అత్యాచారం – కోర్టు తీర్పు

పర్వత శ్రేణిలో,  మేఘాలతో దోబూచులాడే సుదూర కుగ్రామం వాకపల్లి. లోతట్టు అడవిలో ఎత్తైన కొండల దరి; గుంటలు, వాగులు, వంకలు కలయికతో; పాడేరుకు పోయే రోడ్డుకు సుమారు రెండు కిలో మీటర్ల దూరాన గల వాకపల్లి వాసుల రాకపోకలకు ఉన్న ఒకే ఒక దారి; ఆదిమ ఆదివాసీ తెగకు చెందిన కోందుల ఆవాసాలలో ఒకటి. వాళ్ళకు తెలుగు రాదు; వాళ్ళది కోండు భాష; అనాది కాలం నాటిది. నాగరిక జీవనానికి దూరంగా; దారీ, తెన్నూ తెలియని ఆదిమ ఆదివాసీ గిరిజన గూడెం వాసులపై నాగరికులు, అధునాతన సాయుధులు, ముష్కరులైన ప్రభుత్వ రక్షక దళాలు దాడి చేయడమేమిటి; వాళ్లపై అత్యాచారాలకు