జీవిత కథలు
ఒక దశాబ్ద కాలం నాటి ఒక మనిషి అనుభవం, దాని తాలూకు జ్ఞాపకాలు ఇప్పుడు అవసరమా అని కొందరు పెదవి విరవొచ్చు. కాలం మారింది కాబట్టి సమాజం మారకుండా ఉంటుందా అని మరికొందరు ఎదురు ప్రశ్నించవచ్చు. లేదా రచయిత ముందుమాటలో చెప్పినట్టు కొందరు అగ్రకుల పీడక పీఠాధిపతులు ఎదురు దాడి చేయనూ వచ్చు. నిజానికి రచయిత మోహన్ తలారి అనుభవాలు ఆయన జ్ఞాపకాలు కేవలం ఆయనకే పరిమితమైనటువంటి వైయక్తికమైన అనుభవాలు కావు. అవి వందల, వేలాది మందితో కూడిన కొన్ని జన సమూహాలవి అయినప్పుడు, అవి నేడు నడుస్తున్న చరిత్రలో కూడా అంతర్భాగమైనప్పుడు వాటి నమోదు సమాజానికి ఎంత










