మట్టి మాటల కవి
Truly to sing, that is a different breath. Rainer Maria Rilke. (Austria poet) ఇప్పుడు రాస్తున్న యువకులు అంతా తమ కొత్త గొంతుతో ధిక్కార స్వరంతో తమదైన నుడికారంతో రాస్తున్నారు. ఇటీవలి విరసం సభలలో ఆవిష్కరించిన "నేల నుడికారం" కవిత్వం ఉదయ్ కిరణ్ రాసింది చదువుతుంటే మనల్ని మనంగా నిలవనీయని ఒక కుదుపు ఆ పదాల పొందికలో చూసిన అనుభూతికి లోనవుతాం. తీరికగా కూచుని కవిత్వం రాసే తరం కాదిది. పొట్టకూటి కోసం నిరంతరం శ్రమిస్తూనే తమ రోజువారీ పనులు చేస్తున్నట్లుగానే ప్రజల పట్ల ఒక బాధ్యతగా రాస్తున్న యువతరమిది. చెప్పాలనుకున్నది సూటిగా గుండెల్లోకి










