నూతన మానవుడు
అస్తమించడమంటే రేపటి సూర్యోదయమే కదా అతడు అస్తమించాడు తుమృకోట తూర్పు గుమ్మంలో పొడిచి చిన ఆరుట్ల చిగురు కొమ్మల్లోంచి జాలువారి గుత్తికొండ నెత్తిమీద మొలిచిన సూర్యుడతడు శాంతి పావురంకు ప్రజలంటే ఎంత పావురం విద్రోహ పొగమబ్బుల మధ్యనే శాంతి కపోత పతాకమెగిరేశాడు మంజీర సర్కారు జాగీరు మీద నిలబడి జన ఎజెండా జెండా నాటి ప్రజా ఆకాంక్ష వెల్లువల సద్దిమూట పట్టుకెళ్లాడు పంతులు కదాప్రపంచ గమనాన్ని తన వేకువ వెలుగు దారుల్లో చూపించి జనతన సర్కార్ రాస్తా మీదుగా జనాన్ని నడిపించాడు అతని కిరణాలు అరికాళ్ళు నాటిన అడుగుల నిండుగా జగిత్యాల జైత్రయాత్రలు...జంగల్ మహల్ రెపరెపలు... కన్నతల్లుల కడుపుకోత










