పురాతన యుద్ధభూమి
(ఇటీవల విడుదలైన పి. చిన్నయ్య కథా సంపుటి ఊడలమర్రి ముందుమాట) మిత్రులు పి.చిన్నయ్య తన ఊడలమర్రి కథల సంపుటికి ముందుమాట రాయమని, పదిహేనేండ్ల కాలంలో తాను రాసిన పదహారు కథలు పంపారు. ఈ కథల్లో దాదాపు అన్నీ విరసం కథల వర్క్ షాపుల్లో చదివినవే. కథల గురించి రకరకాల చర్చలు జరిగినవే. ఒక్కొక్క కథ చదువుతుంటే.. ఆ సన్నివేశాలన్నీ రూపుకడుతున్నాయి. సాధారణంగా రచయితలు కనపరిచే ఉద్విగ్నతలు, ఆవేశకావేశాలు ప్రదర్శించకుండా సీదాసాదాగా.. ఏమాత్రం డాంబికం లేకుండా చిన్నయ్య మాట్లాడే పద్ధతి - స్థిరమైన ఆ కంఠస్వరం నాకిప్పటికీ గుర్తే. ఇవి అంతిమ తీర్పులో... పరమ సత్యాలో... అనే భావనతో కాకుండా










