ఆమె… ఒక డిస్ఫోరియా
నా కథ చెబుతా వినండి... ‘‘నా పేరు మమత. ప్రతిసారీ మీరు చెప్పే సమస్యలు వింటున్నాను. వింటున్నకొద్దీ బాధ మరింత ఎక్కువ అవుతూ ఉన్నది. నా కలల ప్రపంచాన్ని ఛిద్రం చేసిన నా జీవితం గుర్తుకు వచ్చి మరింతగా నొప్పి అనిపిస్తున్నది. ఈ స్నేహిత సంస్థలో ప్రతి ఒక్కరూ తమ జీవితం గురించి చెప్పేటప్పుడు మీ అందరి జీవితాలకంటే నా జీవితం, కథా దుర్భరమైనవి, భిన్నమైనవి అంటూ ఉన్నారు. నేనూ అదే చెప్పబోతున్నాను. నిజానికి నా జీవితం మీ అందరికంటే భిన్నమైనది. చాలా మంది భర్తల అత్యాచారాల రూపాలు మన అందరికీ.. కొన్నిసార్లు ఒకే రకంగా మరికొన్ని సార్లు










