నాలుగు పిట్టలు ( మినీ కవితలు)
కాలపు చరకలో కొంత గతాన్నివొదులుకున్నానుబంగారుభవిష్యత్తీగను వొడికిఇస్తుందని వేచి చూస్తున్నాను****చెరువును అంగీలాతొడిగిన నేలచేపల్నినగిషీలు చేసుకుంది***వెన్నెల అద్దంలోతన మోము చూసుకొనిచెరువుమురుసిపోతోంది***ఎండ మగ్గం తోమబ్బుల బట్టను అల్లుకొనికప్పుకుందినింగి***ఈ మౌన రాత్రిలోకొంత శబ్దాన్ని కోరుకున్నానువెన్నెల కొలనునుముద్దాడింది***చేపలకు కొలను చెబుతున్నకథలనుతారకలు కూడాఊ కొడుతూ వింటున్నాయి***కొలనును కాగితం చేసుకొనికవిత్వం రాస్తున్నాడుచందమామచేప పిల్లలు అక్షరాలు***సూఫీ పాడిన పాటనువినిఅలల చప్పట్లతోఆదరించింది చెరువు***16.11.22










