సాహిత్యం కవిత్వం

ప్రతిధ్వని

నేను ఉరిమితేనీ సింహాసనం కదిలిందినేను వర్షిస్తేవసంతం పులకించిందినాలుగు గోడల బందీఖాననా ఆలోచల్ని ఆపలేదుఅవి ప్రాణ వాయువులాప్రజల ఉచ్వాస నిశ్వాసలనుతడుముతూనే ఉంటాయినేను నిర్జీవంగాఇచ్చట వాలిపోలేదునా నినాదాలుప్రపంచ వ్యాపితంగాప్రతి ద్వనిస్తూనే ఉంటాయినేను స్వేచ్ఛా మానవినిఏ చెరసాలకు లొంగే దాన్ని కాదు
సాహిత్యం కవిత్వం

కాలం తొంగి చూస్తోంది

లిప్తలన్నిటినీ కొలిచిధాన్యపు గాజకు పోద్దాం యీ రెణ్ణెల్లలోఒక్క నీటిగింజమిగిలితే నీమీదొట్టు ఆగడానికే ముందక్కడ?జల్లలో మిగలడానికి చేపలా అవి!కారిపోయే కన్నీరేకదాచివరకుమన దోసిట్లో మిగిలింది    ***   ***    ****కాలం నిన్నూ నన్నూ గమనిస్తోంది ఆసుపత్రుల్లో నవజాత శిశువుల కేరింతలు లేవునదుల్లో సృష్టినిమోసే జీవమూ లేదుపీక్కుతినేయగా మిగిలిన అస్తుల లెక్కనీవో, నేనో అప్పజెప్పాలి రాజూ లేడు..మంత్రీ లేడూ పూచీపడడానికిరాజ్యం పేరున సరిహద్దులు మాత్రమే వున్నాయిఅక్కడా మానవ హననమేపేరు ఎదయితేనేం?న్యాయంలేదు అడ్డుపడడానికిచట్టం పేరున సంకెలలు మాత్రమే వున్నాయిఅక్కడ నిండా మోసమే!***     ***      ***తర్కించుకొని తడిమిచూసుకుందామా కాసేపులిప్త కాలమైనా చాలులే! అగ్నిధారలై  ఏళ్లుగా కలసి ప్రవహించిన మనంఎప్పుడు  విడిపోయాం!కలవలేనన్ని పాయలుగా మత మానవులుగాస్త్రీలుగా , పురుషులుగాకులాలుగా,
సాహిత్యం కవిత్వం

చేవ

నాకు కావాల్సిందివేరు నెత్తురులో ఇంకిపోయిన సముద్రంఇక్కడ నుంచుంటే అక్కడ రాలిపడే ఆకుల చర్మం కాదుమూలాల్లోకి ఇంకా ఇంకా నడవాల్సిన బాకీఎప్పుడూ వెంటాడుతుందిమట్టి తన గుట్టు విప్పమని పిలుస్తుందిగుండెల నిండా పర్వతాల్ని మోస్తూ పరుగులు పెట్టే వెర్రి వాగులుకొరడాలై కొడుతూ ఉంటాయ్పూర్తికాని ఇల్లూ తెరవలేని తలుపులూ తెల్లారేసరికిఎజెండాలను దండే నికి తగిలిస్తాయ్ ఇటుపక్క ఎండ నిప్పులు చిమ్ముతుంటేఅటుపక్కకు తిరిగే అడవి నోటినిండా పాఠాలేఒంగిపోయారా లొంగిపోయారా మొసళ్ళ పళ్ళు తోమారామృగాల వళ్ళు పట్టారా లేక తోడేలునూ మేకనూ కలిపిఒకే వేటుకు నరికారా తరవాతి విషయం తరతరాలుగా కనురెప్పల కింద వణుకుతున్నకన్నీటి వంతెన మీద నడుస్తూ ఎప్పటికప్పుడు పైకప్పులువిరిగిపడుతున్నా తట్టుకొని నిలబడే అడుగు
సాహిత్యం కవిత్వం

మానవత్వం చంపబడుతోంది

మానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి సోంతలాభం కోంతమానిపోరుగువారికి తోడ్పడవోయ్గీసుకున్న దేశభక్తి గీతదాటిఅడుగు ముందుకేసిసోంతలాభం అసలే వద్దుప్రజలకోరకే తన ప్రాణమంటుమానవత్వం శిఖరమెక్కినమనిషి చంపబడ్డాడుమానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి అన్నం రాశులు ఒకచోటఆకలి మంటలు ఒకచోటవ్యత్యాసాల ఎత్తుపల్లాలు ఆర్పడానికినాలుగడుగులు ముందుకేసిఅన్నం రాశులు ఆకలి సంచులు నింపినమనిషి చంపబడ్డాడుమానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి నెత్తురు మండే శక్తులు నిండేసైనికులారా రారండిపిడికిట్లో నినాదం పిడుగులు పట్టుకొనిమరో నాలుగడుగులు ముందుకే నడిచికోయ్యూరు నండి కోయ్యూరు దాకజనం అలజడి నాడిస్టెతస్కోప్ చేతులతో పట్టినమరో ప్రపంచపు నూతన మానవుడుమానవత్వం నాటుకుంటూ వస్తున్నమనిషిని చంపేశారు రండి చంపబడ్డ మానవత్వాన్ని పిడికిళ్ళ నిండా మనిషింత తెచ్చుకుందాం
సాహిత్యం కవిత్వం

దీపాల వెలుతురు నీడలో

తాము కాలిపోతూవెలుతురిస్తాయి దీపాలు సమస్త చీకటి విషాలను మ్రింగికాంతినిస్తాయి మిణుగుర్లు మన గాయాల్ని వాళ్ళ దేహాల్లో నింపుకొనిమందు కనుగొంటారు శస్త్రచికిత్సా కారులు వెలివేతలను తలరాతలుగా వ్రాయించుకొనిమైలపేరుతో మూలపడిమూతులకు కుండలు కట్టించుకునేబడుగుబతుకుల్లో ఆత్మగౌరవాన్ని తట్టి లేపుతారుజ్ఞానవంతులు కార్మీక కర్షక జనావళిఊపిరికి ప్రాణం ఉందనిరుజువుచేసిసంఘటితస్పర్శ ఎంత శక్తివంతమైందో తెలియజేసినడవడానికో పోరుబాటని సిధ్ధం చేస్తారునాయకులు వాళ్ళపాదాల్రాసిన కఠిన కాల చరిత్ర పుటలపైతలలెత్తుకొని నిలబడబానికి ప్రయత్నిస్తాయిగడ్డిపోచలు గడ్డిపోచల నుదుర్లను ముద్దాడుతుందివసంతం వసంతాన్ని కౌగిలించుకుంటుంది మేఘగర్జన గూడెం పిల్లోడి చేతిలో విల్లంబులా సాయంత్రంక్షితిజం పై ఒరుగుతుంది రేపటికొక కొత్త సూర్యుణ్ణి కంటానని వాగ్ధానం చేస్తూ...
కవిత్వం సాహిత్యం

నేనే మీ కవిత్వం

నా పెదవులపై తేనెపట్టు లాంటి మాటలేవీ?అవి పక్షులై ఎగురుతుంటాయి హృదయమూ మాటల మధుపాత్రే ఇపుడు మనమధ్య పదాల ప్రసారంఓ అమూల్యమైన అనుభవానికి వాగ్ధానం నిజానికి నా మాటలన్నీప్రాణవాయువుతో పాటు ఆయుష్షు గానాలోకి మీ నుంచి వచ్చి చేరినవే నా ప్రాణం లోపలుందని అనుకునేరుఅది బయటే ఉందినాతో కలిసి నడుస్తున్న వాళ్ళూనా భాగానికి ఇన్ని గింజలు పండిస్తున్న వాళ్ళూనా నడక కోసం దారుల్ని పరిచినవాళ్ళూనేనేదైనా చౌరస్తాలో నిలబడి ఉద్యమాచరణలో భాగంగా నినదిస్తున్నపుడు ప్రతిధ్వనిని అందించేవాళ్ళూ మీరు మీరు మీరంతా నా ప్రాణసమానులుమీరే నా మాటలలోని బరువుకు కారణమైనవారునా పద్యపాదాల్లో జీవం నింపే బతుకుపోరాటంలో నిండా మునిగిఉన్నవాళ్ళు మీ నవ్వులు నా
సాహిత్యం కవిత్వం

కదిలే కాలం..

ఎప్పుడో ఏదో ఒకక్షణాన కమ్ముకున్న చీకట్లుతొలగిపోక మానవు రాబందుల రెక్కలలోచిక్కిన పావురాలుఆకాశంలో ఎగరక మానవు వెనక్కి విరిచేసి సంకెళ్ళేయబడ్డమణికట్లు మరల పిడికిలెత్తిఅభివందనం చేయక మానవు ఓరిమితో ఎదురు చూడాలిసమయమింకా ముగిసి పోలేదుఅందరమూ మరొకసారికలుసుకొని కదిలే కాలమే ఇది!! (దేవాంగన, నటాషా, ఆసిఫ్ ఇక్బాల్ లకు బెయిల్ వచ్చిన సందర్భంగా)
కవిత్వం

బస్తరు నా బడి..!!

చిటారు కొమ్మచేతులు జార్చినమిఠాయి పొట్లంతేనెతుట్టెగ రాలిఅడవి ఎదనంతకప్పేసినట్టు.. ఉమ్మడి శ్రమలేవిరగబూసిగదిగదిగూడిగర్భం దాల్చిమకరందమంతాకలపొదిగినట్టు.. కళ్ళు కాగడాల్ జేసుకకమ్మిన తేనీగలుఝుమ్మను నాదాలసెంట్రి గాసినట్టు… ఏమిటా జనమూలేసెనా రణమూవేలకు వేలూకూడెనా గణమూ బస్తరు తెగువదిఆదివాసి దండదిబాసగూడ పసల్ గూడసిలువేరూ సాకేడు సుట్టెన్ని గూడ్యాలోసుట్టేసి వొచ్చినయ్బతుకుల్ని గూల్చేటిక్యాంపు లొద్దన్కుంట డ్రోన్ల నెక్కు బెట్కుంటపానాలు దీసుకుంటబాంబ్లెయ్య లేదంటుఝూట కూతలతోని రోడ్లేసే సాకుల్తోరైఫిల్లు డంపేసిగుండెల్ల గురిబెట్టిగరిజనుల గాల్చేసి ఎవర్నేమ్ నమ్మిస్తవ్వో ఝూటి సర్కార్దునియంత దెల్సెలేనీ యాపరేషన్ ప్రహార్ రాసి వున్నది నీకురాలిపోవుడు రాతరాసులాడు తుండవురగతాలు పారిచ్చి కలిగంజి కుండల్లుపగిలేసి సల్లుడూఆకులలం కొంపల్లుఅగ్గిబెట్టి ముర్వుడూ ఏయుధ్ధ నీతంటవో జ్ఞానంయారాజ ధర్మంరా శీలంనీ బతుకంత దొంగదాడేజనతన్ల సేతుల్నేమూడే పొద్దస్తమానమూ పొర్లినాపొట్టకూ
సాహిత్యం కవిత్వం కారా స్మృతిలో

కథల తాతయ్య

గదిలో ఒకచోట ఖాళీ నిండిందిఆ వాలుకుర్చీని అల్లుకునిపాలపండ్ల చెట్టొకటి వుండేదికుర్చీ ముందువెనుకలకొన్ని ఆలోచనలు గాలిలో పూసిబహు నెమ్మది మాటలుగా వీచేవిచెవియొగ్గి వినాలి మనంజీవితాన్ని దున్నిన అనుభవాల పంటసేద్యం నేర్చినవాడు చెప్పిన కథ                o0oఅతను గడుసరి, అతను మనసరినిత్య చదువరిగంపెడు ప్రేమ, ఒకింత కోపం మెండుగా మొండితనంకూడికతో అతనొక పిల్లల కోడిమొక్కల్ని, పక్షుల్ని, మనుషుల్ని చేరదీసాడు.దొంగ ఏడుపుల్ని ఎండగట్టిఅసలు దుఃఖపడుతున్న వాళ్లచెక్కిళ్ళు తుడిచాడు                         o0oమక్కువతో చేరదీసిన అన్నిటిపైనాదిగులుపడే తాతతనం నిండినమనిషొకడుండేవాడు యిక్కడఎక్కడో సప్త సముద్రాల ఆవల వున్నవాళ్ళకుశలమూ ఆడిగేవాడుపిల్లలమీద, పుస్తకాల మీద మోహమున్నతొంభైయేడేళ్ల తాతడు మనతో ఇక్కడే వుండేవాడుయీ గుండెలో ఒకచోట శూన్యం నిండింది.                            o0oకనిపించడుగానీ అన్నీ గమనించేవాడుమన
సాహిత్యం కవిత్వం

కనుపాపల్లోనుండి

మా ఇంటిముందురోడ్డువారగా గులాబీ చెట్టుచెట్టు చిన్నదేగానిగుత్తులుగా పువ్వులుఅటుగా వెళుతున్న అందరినిపలకరిస్తున్నట్టుగా ఉంటాయి ఆ చెట్టు పువ్వులపై పడిన కళ్లల్లో ఆశ్చర్యంపెదాలపై దరహాసం నడిచివెళుతుంది ఒక పువ్వు కోసుకోమంటారా!అటుగావెళుతున్న ఒక కేకఆపిలు విన్నప్పుడెల్లావినకుడాని మాటేదో విన్నటు చిరాకు వద్దులే అనిసున్నితంగా తిరస్కరించినప్పుడుఆకేకనిరాశగానిట్టూర్పుతోవెనుదిరిగి వెళ్లిపోతుంటేపువ్వులు ఊపిరి పీల్చుకుంటూఒక కృతజ్ఞతనునా మీదకు విసిరేసేవి ప్రకృతిని శ్వాసించనివికృతదేహాలుపువ్వుల ప్రమేయంలేకుండావాటిని తాకుతున్నపుడుకాళ్ళకింద నలిపేస్తున్నప్పుడునిరశిస్తాయినినదిస్తాయియుద్దాన్ని ప్రకటిస్తాయి పువ్వులు లేనితోటపువ్వులు లేనిఇల్లుమబ్బులుకమ్మిన ఆకాశమే పువ్వులుఆహ్లాదాన్నిస్తాయిపువ్వులుఆనందాన్నిస్తాయి పువ్వులువడలిపోయి రాలిపోతున్నప్పుడుఎన్నటికీకనిపించకుండాపోతున్న బిడ్డల్లా అనిపిస్తాయి ప్రకృతినిఅమితంగా ప్రేమించే సూర్యంచెట్టునిపువ్వుల్నితన మొబైల్ ఫోన్ కెమెరాలోజ్ఞాపకాలుగా దాచుకున్నప్పుడుచెట్టుచెలిమిచేసింది శృతి చెట్టుని దాటుకుంటూ లోనికివస్తున్నప్పుడుచెట్టే తనని పాలకరించిందో!శృతియే చెట్టుని పాలకరించిందో!ముందుఎవరిని ఎవరు పలకరించిపరిచయం చేసుకున్నారోగానిసూర్యం శృతి అమరులయ్యాకచెట్టుదుఃఖమయ్యిందికన్నీళ్ల