సాహిత్యం కవిత్వం

క‌విత్వ‌మూ -క‌వీ

టి. వెంక‌టేశ్ క‌విత‌లు తొమ్మిది 1నలుదిక్కులు తిరిగేదిమ్మరుల అజ్ఞాత జ్ఞానమే కవిత్వంస్వప్న మార్మికతనుసత్యంగా అనువదించేదే కవిత్వంరాసిన ప్రతిసారిఆనవాలు లేకుండానువ్వు చేసుకునే ఆత్మహత్య కవిత్వం  .2ఒడ్డున నిల్చుంటావుపడవ రాదుసణుకుంటూ వెనుదిరుగుతావుమరలిన తరువాతపడవ వచ్చి వెడుతుందిఆ రాత్రి ' ప్రయాణం ' ముగుస్తుందిపడవకు తెలియదువస్తూ పోతూ ఉంటుందిఒడ్డున నీ ఆఖరి పాదస్పర్శగాలి చెరిపేస్తుందిబతికిన పద్యంఅజ్ఞాతంగా తిరుగాడుతూ ఉంటుందిపడవ దిగిన పరదేశి ఒకరుకవిత్వాన్ని గుర్తిస్తాడుకవి మరణించిలేడని.3 అలా నీవు గడ్డకట్టినపుడుకవిత్వపు నెగడు అంటించుపద్యం వెలుగు ఓ ప్రశాంతత.4అనేకులుశబ్దం లో ఒలుకుతున్నపుడుకవికి పద్యం ఓ ధ్యానం.5వరద ఉధృతిలానీలో అనుభూతి వానకుమొలకెత్తె పచ్చి మట్టివాసన పద్యం.6ఆగిపోయి నిల్చున్నావుఅలాగే ఉండిపోకుఒఠ్ఠిపోతావురెండు పద్యాల్ని సాయమడుగుమళ్ళీ కవి జన్మ నీకు కొత్త.7చూరుకు
సాహిత్యం కవిత్వం

నిండు పున్నమి వెన్నెల వెలుగువై…

నిత్యం జ్వలిస్తూ, సృజిస్తూగుంటూరు నుండి ప్రారంభమైననీ విప్లవ ప్రస్తానం! కృష్టమ్మ అలల హోరులోశతృ కిరాయి బలగాల పహారాలలోనల్లమల్ల చెంచు ప్రజల జీవితాలలోనిండు పున్నమి వెన్నెల వెలుగువైపీడిత ప్రజలకు ఆత్మీయ కర స్పర్శవైఆంధ్ర-తెలంగాణా మైదానాల్లోవర్గ పోరాటాల జ్వాలలనునిత్యం జ్వలింపజేసినవీర యోధుడా! నిరంకుశ దళారీ పాలకవర్గాలఫాసిస్టు అణచివేతకుఅలిపిరి లాంటి విస్ఫోటనంలోపాలకవర్గాల గుండెల్లో గుబులు పుట్టించినబుద్ది చెప్పిన సాహసానికి సంకేతమా! శాంతి చర్చలంటూప్రజలను మోసం చేసేదోపిడీ వర్గాల ఎత్తుల జిత్తులనుపార్టీ ప్రతినిధిగా చర్చలకు వెళ్ళిరాజ్యం వర్గ స్వభావాన్నిచర్చలంటూ మోసగించేవిప్లవోద్యమం అణిచివేతకుదుష్ట కుట్రలను చీల్చి చెండాడిప్రజల ముందు ప్రతిభావంతంగావిప్లవ స్వరాన్ని దృఢంగాప్రజాయుద్ధపు పంథాను ఎత్తిపట్టిదళారీ పాలకవర్గాల ఎత్తుల జిత్తులనుచిత్తు జేసిన పార్టీ నాయకుడిగాచారిత్రక ఘటనకు
కవిత్వం

డోలీ ప్రసవం

నా కడుపున నలుసు పడ్డాక గాని తెలియలేదు ఆ దారి సవాళ్ళ మయమని భుజాన వేసుకొని మోసకెళ్తా ఉంటే ప్రసవానికి కాక కాటికి ఏమో కలత పడుతుంది ప్రాణంలో ప్రాణం స్వేచ్ఛా తెగల్లో పుట్టడమే నా ప్రసవానికి శాపమని నేను తల్లినవ్వబొతుప్పుడే తెలిసొచ్చింది డోలీ డోలీ నన్ను ముద్దాడిన అమృతం తెర ఇక ఈ డోలీలోనే విగతజీవిగా మిగలితానేమో..! ఈ ప్రయాణంలో తల్లిగా ముద్ర గాంచడానికి తల్లి బంధంకి దూరామైతే కారణమెవ్రూ..! చెప్పండి నా శిశువు స్పర్శ నేను గాక నేలముద్దాడతుందేమో శాశ్వతంగా అడవి తల్లి బిడ్డనైనందుకు నన్ను తల్లిపేరు నుంచి దూరం చేసే ప్రయత్నమే డోలీ మార్గం
సాహిత్యం కవిత్వం

యుద్ధమూ – మనమూ

యుద్ధం అంటే ప్రేమ లేనిదెవ్వరికి నీకూ నాకూ తప్ప ఒకరిపై ఒకరు దాడులు చేస్తూ స్మశానాలపై జెండాలెగరేస్తారు సమాధులపై ఇన్ని గులాబీ రేకులు పోసి‌ చేతులు జోడిస్తారు కనురెప్పలకింద ఉప్పగా ఊరిన నీటిని తుడుచుకుంటూ నడిచిపోతారు రేపటికి మిగలని వాటిపై మరల కొత్త పునాదులేస్తారు సదులన్నీ కుదించబడి సముద్రపు పక్కలో ఒరిగిపోయాయి కానీ ఆ తల్లి మాత్రం కడుపు చించుకుంటోంది రాని కొడుకో కానరాని కూతురో ఇంక రారని కనుపాపల వెనక శూన్యాన్ని గుండెలకద్దుకుంటూ యుద్ధం వాడికొక వస్తుమార్పిడి యుద్ధం వాడికొక వ్యసనం యుద్ధం వాడికొక పాచికలాట యుద్ధం నీకూ నాకూ విముక్తి సాధనం యుద్ధం నీకూ నాకూ
సాహిత్యం కవిత్వం

మీరూ… నేనూ… వెన్నెలదారుల కొన్ని మందారాలూ

నే నడిచానాఅంతంత దూరం ఏనాడైనామోశానా అంతంత భారం ఎన్నడైనాపూసినకాసెగడ్డిలో పేట్లఇరుకు దారులవెంటనల్లమలలో ఆ రాత్రి నానడకనిన్ను కలవడానికోనన్ను నేను వెతకడానికో వెన్నెల నీడల మాటునచుక్కలపూల దుప్పటి కప్పుకొనిఆ రాత్రి కొండలన్నీ గడిచానానిన్ను నన్ను కలిపేవేగును అతివేగంగా అనుసరించానాయేగిరంగా నీ ముంజేతిని ముద్దాడాలన్నపిచ్చి తాపత్రయం యేనాటికీ కోసు అంచు కొసలమీద దీర్ఘకాలపు నడకడస్సిపోయోనీ ఆలోచనల్లో మునిగిపోయో…తూలి ఆవలలోయలో పడబోయానునాగురించి చెప్పేపంపావు వాళ్లకు….రెప్పలకింద దాచుకుతెమ్మనినీవు అప్రమత్తుడవు. కలిశానా! ఎట్టకేలకుతెల్లని కోరమీసం కొసనచల్లనినీ నవ్వువెన్నెలపూసి పొగడదండలైనచెట్లమొదలచిక్కని పచ్చనాకుల దాపునమనమిద్దరమో ముగ్గురమో పలువురమోగలగలమని వనమంతా విరిసినమాటలుకొసరు కబుర్లు కొన్ని….కనుల మధ్యవాలిన మౌనాలు మరిన్నిజమేదారి కోయిలో… జమేదారికోయిలో…పాటలు పవనమై ఆడివంతా వీచిభయం లోనో… మోహంలోనో సంభ్రమమైన
సాహిత్యం కవిత్వం

మీరూ – మీ రాజ్యం

నాలుగు రోడ్ల కూడలిలోనిమ్మ కాయ ముగ్గు తొక్కండిభూత వైద్య పట్టాదార్లుబెనారస్ నుండి వస్తున్నారు ఆత్మ పరమాత్మ లసంఘర్షణ ల నిగ్గు తేల్చేనిఖార్సైన చదువులురాజు ఇలాకాలో చెబుతున్నారు ఎలా చస్తేఎలా చంపితేఆత్మ పునర్జన్మ పొందుతుందోచెప్పే ప్రయోగశాలలు తయారవుతున్నాయితొందర పడినోట్లో రాగి చెంబులు పెట్టిడంబెల్స్ తో చంపబాకండి త్రిశూలం వాడితే శివుడొస్తడోచక్రం తో ఛేదిస్తే విష్ణువు వస్తాడోచెప్పే జ్ఞానంబాబాలకి లేదనివిశ్వవిద్యాలయాల్లో పురుడు పోస్తున్నారు నగ్న దేహాన్నిపటాల ముందు ప్రదర్శిస్తేపటాలు శాంతిస్తాయో లేదోననేపరిశోధనలు కొనసాగుతాయి త్వరలో అంతా ద్వైతమేశాస్త్రం సమాధిమీరు కోరుకుంటున్న సమాజమే వస్తుందిఆత్మలన్నీ మరుజన్మ ఎత్తిచావులేని పురాణ వైద్యాన్ని వెలుగులోకి తెస్తుంది రాజ్యం!! బువ్వ పెట్టే వాడ్ని చంపైనామీ మూఢ నమ్మకాన్ని
కవిత్వం

అతను రోజూ ఉదయిస్తూనే వుంటాడు

అరణ్యమిప్పుడు ఒక్కసారిగా చిన్నబోయిందిఅతని కవాతు ధ్వని వినపడకఅతని కోసం ఎదురు చూస్తూతెల్ల మద్దె చెట్టు బోసిపోయిందికాసింత విశ్రాంతి తీసుకునే చోటును కదా అని నెత్తురు ముద్దయిన అతని దేహాన్ని చూసిపక్షులన్నీ రెక్కలు తెగినట్లుగా గూటిని దాటి రాలేక రోదిస్తున్నాయి అతని పాఠం వినిపించకతరగతి గది మూగపోయింది అతని దేహాన్ని స్పృశిస్తూ నెత్తురంటిన వెన్నెల ముఖంరంజాన్ మాసపు దుఃఖపు ఆజాలో గొంతు కలిపింది చావు ఎదుట పడినా తన నిబ్బరాన్ని చూసి నిట్ట నిలువునా కుంగిపోయాయిబైలదిల్లా పర్వత సానువులుమనందరి ఆదరువుగా మరలాఅతను రోజూ ఉదయిస్తూనే వుంటాడు తరాలపల్లి తరతరాల వారసునిగా (అమరుడు కామ్రేడ్ సారయ్య @ సుధాకర్ స్మృతిలో)27-3-2025
కవిత్వం

పొద్దు తిరుగుడు పువ్వు

పొద్దు తిరుగుడు పువ్వు ప్రేమగా ఎర్రని సూర్యున్ని ముద్దాడుతూ అడవులను చెట్లను మొక్కలను అన్నిటినీ మనసారా హత్తుకుంటుంది రైతులను ఆదివాసులను ప్రేమగా దగ్గరకు తీసుకొని వారి నవ్వులకు వెలుగులను పంచుతుంది పువ్వులకు పేద ధనిక కులము మతము ఏమీ ఉండవు కదా అందరికీ సమానంగా పరిమళాలను వెదజల్లుతుంది రాజ్యం కుట్ర చేసి పువ్వులను నరుకుతున్నప్పుడు ఆ రాజ్యానికి తెలియదుపువ్వులకు కూడా బలమైన మెదడు ఉంటుందని భూమి మీద విత్తనాలు వెదజల్లుతూపువ్వులు నేలకొరిగిపోతాయి. ఒకనాటికి సూర్యున్ని ముద్దాడడానికి పొద్దు తిరుగుడు పువ్వులు మళ్లీ మొలకెత్తుతాయి.
కవిత్వం

విప్లవ స్వాప్నికుడు

డియర్ సాయి నీవు మరణించావని అంటే నేనెట్ల నమ్ముతాను ఈ రాజ్యం కదా నిన్ను నిలువునా హత్య జేసింది..!నీవు వీల్ చెర్ నుండి కదలలేవని అడుగు కదప లేవని విశ్వమంతా తెలిసినా నీ ఆలోచనల సృజనకు జడుసుకున్న ఈ రాజ్యం సూడో నేత్రపు కత్తుల బోను ప్రహారలో బంధించింది కదా సాయి..!!నాలుగు గోడల తరగతి గదుల నడుమనల్లబోర్డు మీద విద్యార్థులకు ప్రపంచ గతిని మార్చే పాఠాలు చెప్పినందుకు నక్సలైట్ గా ముద్రలు వేసిన రాజ్యం నీ అక్షర కణానికి దాని గుండె గవాక్షాలు మూసుకపోయాయి..!డియర్ సాయిబాబా నీవు దశాబ్ద కాలం మగ్గిన ఆ చీకటి కుహరపు గోడల్లో ఏ
కవిత్వం

కెక్యూబ్ కవితలు రెండు

1 . అక్టోబర్ 8 ఇదో నూతన ప్రతిఘటనా సంకేతం అమెరికోన్ని మూడు చెరువుల నీళ్ళు తాగించిన వియత్నాం వారసత్వం చిట్టెలుకలన్నీ కూడబలుక్కుని పిల్లిని కాదు పులిపై ఒక్కసారిగా విరుచుకుపడి బెంబేలెత్తించిన ప్రతిఘటనా పోరాటం అగ్ర రాజ్యాల అండతో తమకో దేశమంటూ లేకుండా చేసి వేలాదిమందిని ఊచకోత కోసి నిత్యమూ భయంతో తెల్లారే తమ బతుకు నుండి పెట్టిన రాకెట్ల పొలికేక వాడు గొప్పగా చెప్పుకునే ఇనుప తెరను చీల్చి నగరం నడిబొడ్డుపై నడయాడిన నెలవంకల నెత్తుటి పాదాలు వాడు ప్రపంచానికి చూపే అబద్దపు సాక్ష్యాలను మోసే మీడియాకు వాళ్ళొట్టి ఉగ్రవాదులే కానీ తమ నెత్తుటి బాకీ తీర్చుకునే