వాహ్ రే విశ్వగురూ!
మీ మత మౌడ్యమ్
ఐఫిల్ టవర్ ను మించి పోయింది
లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటెర్నిటీ
అనే మూడు విలువల్నిచ్చిన ఫ్రాన్స్ లో
ఈక్వాలిటీ ని తొక్కేసిన అక్షరధామాలూ!
దీనిని లోకార్పణం చేసిన మహామానవా!
ఆడ వాసన గిట్టని స్వాములూ!
మీ విశ్వగురుత్వానికి ద్వేషమే తెలుసు
ఐఫిల్ టవర్ మీదినించి చాటుతున్నా
పారిస్ అంటే ప్రేమ
పారిస్ అంటే స్వేచ్ఛ
పారిస్ అంటే సమానత్వం
అబుధాబి, పారిస్ లో అక్షరాధామాలు
మరి ఢిల్లీ, ఉత్తరాఖండ్ లలో
అల్-ఇస్లాం మసీదులు వద్దా
వాహ్ రే విశ్వగురూ!
(అక్షరధామ్ స్వాముల కోసం ఐఫిల్ టవర్ లో
ఆడ ఉద్యోగులను వేరే విధులకు మార్చిన సందర్భం)




