ఆదివాసులను హింసించిమావోయిస్థులపై విజయం సాధించగలరా?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిసెంబర్ 15నాడు రాయ్‌పూర్‌లో ఛత్తీస్‌గఢ్ పోలీసులకు ప్రెసిడెంట్స్ కలర్ అవార్డును ప్రదానం చేశాడు. శాంతిభద్రతల పరిరక్షణలో, నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో, రాష్ట్రంలో శాంతిని కాపాడటంలో వారు చేస్తున్న ఆదర్శవంతమైన పనిని ప్రశంసించాడు. (యుద్ధ సమయంలోనూ, శాంతి సమయంలోనూ అసామాన్య సేవలు చేసినందుకు వాయు, నౌకా సేవా బలగాలకు ఇచ్చే పతకాలు అవి) ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని షా పర్యటన జరిగింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రం నుండి నక్సలిజాన్ని నిర్మూలించడానికి 2026 మార్చి 31ని గడువుగా పెట్టాడు. ఆ ప్రయత్నంలో సాధించిన పురోగతిని ఎత్తిపడుతూ, భద్రతా బలగాలు