నివేదిక

మణిపూర్ హింస మతపరమైనది కాదు, ప్రభుత్వ ప్రాయోజిత కార్పొరేట్ ఎజెండా

( మణిపూర్ లో హింస ను "స్టేట్ -స్పాన్సర్డ్ " అని , నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ నుండి ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ బృందం తన నివేదికలో బహిర్గతం చేసింది. " రాష్ట్రంలో జరుగుతున్నది మతహింస కాదు లేదా రెండు వర్గాల మధ్య పోరు కాదు, ఇది భూమి, వనరులు, మతోన్మాదులు,  మిలిటెంట్ల చుట్టూ తిరుగుతూ ఉంది.  ప్రస్తుత సంక్షోభానికి దారితీసిన కార్పొరేట్ అనుకూల ఎజెండా అమలు సాకారం చేసేందుకు ఫాసిస్టు ప్రభుత్వం చాకచక్యంగా వ్యూహం పన్నినందువలన  హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. NFIW  ప్రధాన కార్యదర్శి ఆని రాజా , జాతీయ కార్యదర్శి నిషా
నివేదిక

‘అదానీ గో బ్యాక్!’

 'గొందుల్‌పారా' బొగ్గు ప్రాజెక్టుకు ప్రతిఘటనపై నిజ నిర్ధారణ నివేదిక భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలోని 500 హెక్టార్లకు పైగా సారవంతమైన వ్యవసాయ భూములను, అడవులను అదానీ ప్రతిపాదిత 'గొందుల్‌పారా' బొగ్గు గని నాశనం చేస్తుందని నిజ-నిర్ధారణ బృందం తెలియజేస్తోంది. ఐదు గ్రామాలపైన తీవ్ర ప్రభావం పడనుంది. 780 కుటుంబాలు నిర్వాసితులవుతారు. అదానీ బొగ్గు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడినందుకు ప్రభుత్వ అధికారులు తమను హింసించారని గ్రామస్థులు నివేదిక బృందానికి చెప్పారు. నిరసనకారులపట్ల పోలీసులు వివిధ నేరాలకు పాల్పడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు  జీవనోపాధికోసం అందిస్తున్న  ప్రభుత్వ సహాయాన్ని నిలిపివేసారు. అదానీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న రైతుల నుంచి బియ్యం కొనుగోలు చేయవద్దని
నివేదిక

సంతోష్ కుమార్ రాయ్, కృష్ణమూర్తి,వెంకట్ రెడ్డి, సత్యలకు వ్యతిరేకంగాఅవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి

SC 998 of 2018 IV మెట్రోపాలిటన్  సెషన్స్ జడ్జి, రంగారెడ్డి కోర్టులో చర్లపల్లి జైలు ఖైదీ ఇచ్చిన దరఖాస్తు నా పేరు సయ్యద్ గపూర్,  CT నెంబర్ 6634.  నేను చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉంటున్నాను.  14.5.2023  నాడు సాయంత్రం వేళలో జైలు సిబ్బంది నన్ను  కొట్టారు. చిత్రహింసలకు గురి చేశారు.  నాకు ఐదు రోజుల నుంచి తిండి లేదు.  కేవలం నీళ్లతో మాత్రమే ఉన్నాను.  మూడు నెలల కిందట కూడా ఇదే విధమైన వేధింపులకు గురి చేశారు.  మొన్న సంతోష్ కుమార్ రాయ్ సూపరింటెండెంట్,  కృష్ణమూర్తి,  వెంకటరెడ్డి  నా ముఖం మీద కాళ్ళ మీద  తన్నారు. 
నివేదిక

సైనిక క్యాంపులకు వ్యతిరేకంగా పాదయాత్ర

బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ లో సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఏర్పాటు, వివిధ చోట్ల రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా ఆదివాసీలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా మే 12, 13 తేదీల్లో వారు  జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు పాదయాత్ర చేసారు. దాదాపు 200 రోజులుగా, వేలాది మంది గ్రామస్తులు తమ మూడు అంశాల డిమాండ్ల కోసం అబూజ్‌మడ్ తోయ్మెటాలో ధర్నాకు కూర్చున్నారు. ప్రభుత్వం తమ మాట వినకపోవడంతో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. రేషన్, నీళ్లతో  బయలుదేరారు. అబూజ్‌మడ్‌కు చెందిన వేలాది మంది ఆదివాసీలు శుక్రవారంనాడు మండుతున్న ఎండలో రేషన్, నీరు, నిత్యావసర వస్తువులు, సంప్రదాయ ఆయుధాలతో
నివేదిక

ఒడిశాలోని ఆదివాసీ గూడాల్లో  ఆహార సంక్షోభాన్ని బహిర్గతం చేసిన  ఓ చిన్నారి మరణం

ఎనిమిదేళ్ల క్రితం జాజ్‌పూర్ జిల్లాలో పోషకాహార లోపంతో 19 మంది చిన్నారులు చనిపోయారు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని ఘటిసాహి గ్రామంలో ఆదివాసీ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలుడు అర్జున్ మార్చి ప్రారంభంలో మరణించాడు. రెండు రోజుల క్రితం చివరిసారిగా అన్నం తిన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. పోస్ట్‌ మార్టం చేయలేదు, కానీ మీడియా అర్జున్ మరణాన్ని పోషకాహార లోపం కేసుగా ప్రచురించడంతో స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. పరిస్థితి విషమంగా వున్న అర్జున్ తోబుట్టువులు ఇద్దరు, తొమ్మిది నెలల రైసింగ్, 10 ఏళ్ల కునిలను మార్చి 23 నాటికి, జిల్లా
నివేదిక

ఉద్యోగ హక్కు చట్టం చేయాలి

మిత్రులారా మీ అందరికీ పాలమూరు అధ్యయన వేదిక పక్షాన స్వాగతం ! భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశ స్థాయిని అందుకోబోతున్నది ఎంత నిజమో ప్రపంచంలో అత్యధిక నిరుద్యోగులున్న దేశం అనేది కూడా ఆ స్థాయి నిజం. అయితే నిరుద్యోగ సమస్య నివారణకు ప్రభుత్వాలు, విధానకర్తలు ఏమీ చేయటం లేదు అనేది అంతకన్నా కఠినమైన నిజం. గత యుపిఎ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసిందని మేం అధికారంలోకి వస్తే దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన ఎన్‌.డి.ఎ పాలకులు ఆ విషయాన్ని వదిలేశారు. అలాగే 1994 నుండి మొదలైన మలిదశ తెలంగాణ పోరాటం
నివేదిక

Stop This State Terror Now!

Fourth Drone Bomb Attack on Indigenous People in Bastar, Chhattisgarh Indigenous (Adivasi) people in Bijapur district of Bastar, in the Indian state of Chhattisgarh, have been traumatised by yet another aerial bomb attack from the security forces which have been using drones to carry out these operations. Although the Indian Air Force is not officially deployed for combat in Chhattisgarh, the repeated use of aerial bombardment on civilian populations suggests
నివేదిక

మూడేళ్లలో నాలుగోసారి డ్రోన్  దాడి

తమ గ్రామాల్లో జరిగిన వైమానిక బాంబు దాడులకు (డ్రోన్ దాడులు) వ్యతిరేకంగా బస్తర్‌లోని ఆదివాసీ గ్రామస్తులు మరోసారి తమ గళాన్నెత్తారు. మీడియా నివేదికల ప్రకారం, బీజాపూర్ గ్రామస్తులు తమ గ్రామాలపై 2023 ఏప్రిల్ 7న డ్రోన్ దాడులు జరిగాయని ఆరోపించారు. జబ్బగట్ట, మీనగట్ట, కవరగట్ట, భట్టిగూడ గ్రామాలలో డ్రోన్‌లతో బాంబు దాడులు జరిగాయి. పైన పేర్కొన్న గ్రామాలలో ఉన్న మోర్కెమెట్ట కొండల దగ్గర ఉదయం 6 గంటలకు బాంబు దాడి ప్రారంభమైంది. పరిసరల పొలాల్లో అనేక బాంబులు పడ్డాయి, తరువాత 3 హెలికాప్టర్ల నుండి భారీ మెషిన్ గన్ కాల్పులు కూడా జరిగాయి. పడిన బాంబుల సంఖ్య నిర్ధారణ
నివేదిక

కోల్హాన్ యుద్ధ నివేదిక

జార్ఖండ్‌లోని కోల్హాన్ అటవీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా 2022 డిసెంబర్ 1 నుంచి, గోయిల్‌కెర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలయ్‌బెడ, లోవబెడ గ్రామాల సమీపంలోని లోవబెడ కొండల్లో మావోయిస్టులు, కోబ్రా పోలీసులకు మధ్య ‘ఎన్‌కౌంటర్’ జరిగినప్పటి నుంచి పోలీసులు దాదాపు ప్రతి రోజూ కాల్పులు జరుపుతూనే వున్నారు. ‘ఎన్‌కౌంటర్’ జరిగిన రోజు ఉదయం 8.15 గంటలకు నుండి, సాయంత్రం 5 గంటల వరకు రోజంతా వందలాది ఫిరంగి గుండ్ల (మోర్టార్ షెల్స్‌) వర్షం కురిపించారు. మర్నాడు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫిరంగి గుండ్లను పేల్చారు. ఆ తరువాత,
నివేదిక

చిడియాబేడా ఆదివాసీలపై
పోలీసుల క్రౌర్యం

రూర్ఖండ్‌లోని సరండా అడవుల గురించి మీరు వినే ఉంటారు. భారతదేశంలోనే అనేక పోరాటాలతో ప్రజ్వరిల్లుతున్న నేల అది. ఆ ఉద్యమాలను అణచివేయడానికి చాలా ఏళ్లుగా అక్కడ దారుణ నిర్బంధం కొనసాగుతోంది. అయినా ఆదివాసులు వెనక్కి తగ్గలేదు. చిడియాబేడా, లోవాబేడా, హాథిబురు అడవులలో కోబ్రా బటాలియన్‌ 209, 205, రూర్జండ్‌ జాగ్వార్‌, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన పోలీసు బలగాలు గాలింపులు జరుపగా కొన్ని పోస్టర్లు, బ్యానర్లు సహ రోజువారిగా వాడుకునే దినుసులు దొరికినట్టు, సీరిస్‌ కనెక్షన్‌లో వుంచిన మందుపాతరలను కనుగొని వాటిని డిఫ్యూజ్‌ చేసినట్టు 12 నవంబర్‌ 2022 (ప్రభాత్‌ ఖబర్‌, దైనిక్‌ భాస్కర్‌ తదితర హింది పత్రికలలో) వార్త ప్రచురితమైంది.