ఉద్యమాల సురవరం
తెలుగు నేల మరో నిబద్ధ రాజకీయ, ఉద్యమ నేతను కోల్పోయింది. జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉండట మే కాదు, ప్రజా, ప్రజాస్వామిక ఉద్యమాలకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన సురవరం సుధాకరరెడ్డి గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత అయిన సురవరం కనుమూయ టం ప్రజా, ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని లోటు. తనకు నిశ్చిత రాజకీయాభిప్రాయాలున్నా.. అన్ని రాజకీయ పార్టీల నేతలతో, ఉద్యమకారులతో స్నేహపూర్వక సంబంధ అనుబంధాలు కొనసాగించిన సురవరం గొప్ప మానవీయ వ్యక్తి. ఆయన స్నేహశీలతనే ఆయనను ఉభయ రాష్ట్రాల్లోనే కాదు, జాతీయంగా కూడా గొప్ప










