నా తలపుల తలుపులు తెరిచీ..
నా జ్ఞాపకాలునీ రెక్కలునీ రెక్కలునా జ్ఞాపకాలు ఎగరు సీతాకోకనింగి అందేదాకా ఎంత సున్నితంగాతాకుతాయో కదా నీ రెక్కలుగాలిని నీ రెక్కల కుంచెతోగాలి కాన్వాస్ మీదఎన్ని వర్ణచిత్రాలు వర్షిస్తావో కదా రుతువుల మోములన్నీమోహపు వీణలౌతాయి కవితలేవో నేను అల్లడానికికుట్ర పన్నుతాయి నీ రెక్కలు కదిలినప్పుడంతానాలో స్ళేఛ్ఛా కాంక్ష పురి విప్పిన నెమలి అవుతుందిఅరణ్యం పై పరుచుకునే కెంజాయరంగౌతుంది అపుడునా ఏకాంతాన్నీ,నా భావాలనూనీ భుజాలు నొప్పెట్టెలా మోస్తావు నా ఊహల స్పర్శతోనీ రెక్కలు పులికిస్తాయోనీ రెక్కల స్పర్ళతో నా ఊహలు అలలై కదులుతాయో తెలియదు కానీ నీ రెక్కలు కదిలేప్పుడంతానేనూ కదులుతానునా గుండెకొక లయ ఉన్నట్టనిపిస్తూనాకు నేను కొత్త కావ్యాన్నై పరిచయమౌతాను










