శాంతి స్వప్నం
పుస్తకాలు రాజ్యాన్ని భయపెట్టిస్తున్నాయి అందుకే అది పుస్తకం పుట్టకముందే పురిటీలోనే బంధిస్తున్నది పే....ద్ద పాలక ప్రభుత్వం చిన్న పుస్తకానికి, పుస్తకంలోని అక్షరాలకు భయపడటం చరిత్రలో మాములే కానీ.. పుస్తకాలు పురిటినొప్పులు పడుతున్నప్పుడే పుట్టబోయేది "సాయుధ శాంతి స్వప్నమని" భయపడి బంధించడమే ఇప్పుడు నడుస్తున్న అసలు రాజ్యనీతి అంతేకదా నెత్తురు మరిగిన రాజ్యానికి శాంతి స్వప్నమంటే పాలకులకు పెనుగులాటే కదా మరి స్మృతులు యుద్ధాన్ని సృష్టిస్తాయట దుఃఖాల కలబోతకు కూడా కలవరపడుతున్న రాజ్యం ఎంత దృఢమైనదో తెలుస్తున్నది కదా అంతా మేకపోతు గంభీరమే అని










