సాహిత్యం వ్యాసాలు

SOLIDARITY WITH THE PALESTINIAN PEOPLE VICTORY TO THEIR STRUGGLE

Another bloody attack was unleashed by the Zionist-fascist state of Israel against the Palestinian people. Bombings with hundreds of casualties are followed by threats of army incursions, announcing in advance even greater massacres. The killer state of Israel, planted by the imperialists in the Middle East and assigned the role of their bodyguard, has been trying for many decades to exterminate the Palestinians. They have imprisoned them in a strip
సాహిత్యం వ్యాసాలు

ప్రేమ్ చంద్ నవలల్లో స్త్రీ పాత్రలు -ఒక సమీక్ష  

                                           రచయిత్రి నిత్య రాసిన "ప్రేమ్ చంద్ నవలల్లో స్త్రీ పాత్రలు "పుస్తకం పై ఒక సమీక్ష  . ఈ పుస్తకాన్ని "మహిళా మార్గం "పత్రిక వాళ్ళు 2002 జనవరి లో ప్రచురించారు . కృష్ణాబాయి గారు "ప్రజా రచయిత ప్రేమ్ చంద్ "అన్న పేరుతో ముందు మాట రాస్తూ "భారతీయ సాహిత్యంలో వాస్తవికతని బలంగా ప్రతిపాదించిన తొలిరచయితలలో ప్రముఖుడు ప్రేమ్ చంద్ "అని చెప్తూ  సమకాలీన సాహిత్యంలో మధ్య
సాహిత్యం సమీక్షలు

అనేక ఎరుక‌లు

మొత్తం పదకొండు కథల విశ్లేష‌ణ‌ ఈ క‌థ‌ల పేర్లే చాలు ఏదో  కొత్త దనం.   కథలు   సులభంగా నడిచాయి. ఇతివృత్తాలు అంత గంభీరమైనవి. అంత సారవంతమైనవి. జీవితాలను ఆవిష్కరించాయి.  రచయితల భాష సరళమైనది. ఆకర్షణీయమైనది. కఠిన పదాలు లేవు.  పదప్రయోగ వైచిత్రి కై పెనుగులాట కనిపించవు.  చదువరుల‌ను ఆలోచింపజేస్తాయి. విసుగు అనిపించదు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతంలోని మాండలిక సౌరభమంతా  మాండలికాల వ‌ల్ల  క‌థ‌ల్లోకి వ‌చ్చింది. అదే ఒక నిండుదనం తెచ్చింది. చిన్న కథలలో ఆవేదన, విషాదం తో బాటు ఆవేశం అగ్ని ప్రవాహంగా తన్నుకు వస్తాయి. ప్రతి కథలో స్పష్టమైన లోతైన వాడైన ఆలోచనలతో పాటు వర్తమానాన్ని అద్దంలా
సాహిత్యం వ్యాసాలు

*చాయ్ గ్లాస్‌* విశ్లేష‌ణ 

సుదీర్ఘ కాలంగా  జైలు జీవితం అనుభవిస్తున్న కామ్రేడ్ నర్మద క్యాన్సర్ వ్యాధితో మరణించడం భారత విప్లవోద్యమానికి ఒక లోటు. ఆమె కఠినమైన విప్లవకర జీవితాన్ని ఎంచుకోవడం, జీవిత కాలమంతా దానితో మమేకం కావడం, అనారోగ్య సమస్య వున్నా నిమగ్నమై పని చేయడం, తాను పని చేస్తున్న క్రమంలో కేవలం కార్యకర్త గానే కాకుండా తాను పని చేస్తున్న కార్య క్షేత్రంలో జరుగు తున్న అనేక నిర్మాణ రూపాలను,  పాలక వర్గాల అణిచివేత చర్యలను ఆదివాసీ జీవితాల్లోని పితృ స్వామ్య సంబంధాలను పురుషుని ఆధిక్యతను ,పెత్తనాన్ని, అందులో వ‌స్తున్న మార్పుల‌ను  నర్మద హృదయ గతం చేసుకున్నారు. భారత విప్లవోద్యమంలో   ఆమె
సాహిత్యం వ్యాసాలు

రారా విమర్శలో ఆధునికత ఎంత?

రాచమల్లు రామచంద్రారెడ్డి  గురించిన అంచనా లేకుండా తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ పురోగతిని నిర్ధారించలేం.  సాహిత్య విమర్శలోని కొన్ని అంశాల్లో ఆయన  ప్ర‌త్యేక ముద్ర‌ వేశారు.  విమర్శలోకి ఒక వరవడిని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో మంచి వచనం రాసిన కొద్ది మందిలో ఆయన ఒకరు. చాల సూటిగా, నేరుగా, పదునుగా ఆయన వాక్య విన్యాసం ఉండేది.   తన రచనలతో ఆయన విమర్శ రంగాన్ని ముందుకు తీసికెళ్లారు.  అయితే ఆయన ఎంత ముందుకు తీసికెళ్లారు?  ఆందులో ఆయన ప్రత్యేకత ఏమిటి?  పరిశీలించాలి. విమర్శలో  నిక్కచ్చిగా ఉంటాడని  ఆయనకు  పేరు.  కాబట్టి ఆయన విమర్శను కూడా అలాగే చూడాలి.     మనం
సాహిత్యం కవిత్వం

కదిలే కాలం..

ఎప్పుడో ఏదో ఒకక్షణాన కమ్ముకున్న చీకట్లుతొలగిపోక మానవు రాబందుల రెక్కలలోచిక్కిన పావురాలుఆకాశంలో ఎగరక మానవు వెనక్కి విరిచేసి సంకెళ్ళేయబడ్డమణికట్లు మరల పిడికిలెత్తిఅభివందనం చేయక మానవు ఓరిమితో ఎదురు చూడాలిసమయమింకా ముగిసి పోలేదుఅందరమూ మరొకసారికలుసుకొని కదిలే కాలమే ఇది!! (దేవాంగన, నటాషా, ఆసిఫ్ ఇక్బాల్ లకు బెయిల్ వచ్చిన సందర్భంగా)
సాహిత్యం నా క‌థ‌తో నేను కాలమ్స్

కథతో నేను

పార్టీ, మంజీర, మాస్టారు లేకపోయి వుంటే నేను కథలు రాసి వుండేదాన్ని కాదేమో. రచయితను మించి కథ వుండదు అని భావిస్తాను. కథలు ఎట్లా రాసానో చెప్పే ముందు నా బాల్యం, అప్పటి నా ప్రపంచం గురించి కొంత చెప్తాను. అందునా గ్రామీణ ఆడపిల్లలకు ఇంటిపని, వాటికి తోడు నిబంధనలు దాటుకుని రావాల్సి వుంటుంది. సమయమూ తక్కువ దొరుకుతుంది. ఇవన్నీ అధిగమించి చదవాలి. ఆడపిల్లగా నిర్బంధాల మధ్య పెరిగాను. పల్లెటూరు, చిన్న ప్రపంచం నాది. మా నాయిన మమ్మల్ని ఇల్లు కదలనిచ్చేవాడు కాదు. మా నాయిన తోబుట్టువుల ఇళ్లకి తప్పితే ఎక్కడికీ పంపేవాడు కాదు. మా అమ్మ వడ్ల మిల్లు పట్టేది కాబట్టి
కారా స్మృతిలో సాహిత్యం కవిత్వం

కథల తాతయ్య

గదిలో ఒకచోట ఖాళీ నిండిందిఆ వాలుకుర్చీని అల్లుకునిపాలపండ్ల చెట్టొకటి వుండేదికుర్చీ ముందువెనుకలకొన్ని ఆలోచనలు గాలిలో పూసిబహు నెమ్మది మాటలుగా వీచేవిచెవియొగ్గి వినాలి మనంజీవితాన్ని దున్నిన అనుభవాల పంటసేద్యం నేర్చినవాడు చెప్పిన కథ                o0oఅతను గడుసరి, అతను మనసరినిత్య చదువరిగంపెడు ప్రేమ, ఒకింత కోపం మెండుగా మొండితనంకూడికతో అతనొక పిల్లల కోడిమొక్కల్ని, పక్షుల్ని, మనుషుల్ని చేరదీసాడు.దొంగ ఏడుపుల్ని ఎండగట్టిఅసలు దుఃఖపడుతున్న వాళ్లచెక్కిళ్ళు తుడిచాడు                         o0oమక్కువతో చేరదీసిన అన్నిటిపైనాదిగులుపడే తాతతనం నిండినమనిషొకడుండేవాడు యిక్కడఎక్కడో సప్త సముద్రాల ఆవల వున్నవాళ్ళకుశలమూ ఆడిగేవాడుపిల్లలమీద, పుస్తకాల మీద మోహమున్నతొంభైయేడేళ్ల తాతడు మనతో ఇక్కడే వుండేవాడుయీ గుండెలో ఒకచోట శూన్యం నిండింది.                            o0oకనిపించడుగానీ అన్నీ గమనించేవాడుమన
కథలు “మెట్రో జైలు” కథలు సాహిత్యం

డిటెన్యూ

 సాయంత్రం లాకప్ అయ్యే ముందు గిన్తీ కోసం అందరినీ వరుసలుగా కూర్చోబెట్టారు. సాయంత్రం డ్యూటీలో ఉన్న ఒక వార్డర్ వచ్చింది.  “డిటెన్యూ లు పక్కకు నిలబడండి” అన్నది. ఇద్దరు పక్కకు నిలబడ్డారు. ఆమె ఒకసారి తాను తెచ్చుకున్న కాగితాలు చూసుకొని “ఇంకొకరు ఉండాలే” అని తలెత్తి కమల వైపు చూసింది. “నువ్వు కూడా!” నేను కూడా అప్పుడే ఆమెను చూశాను. అందరినీ లెక్కబెట్టుకొని వార్డర్ బయటికి నడిచింది. ఆమెతో పాటుగా వచ్చిన ఖైదీల ఇంచార్జ్ (శిక్షపడిన వాళ్ళని నియమిస్తారు) తాళాలు వేసి వార్డరు వెనకనే వెళ్ళిపోయింది. నేను చేతిలోకి వార్తా పత్రిక తీసుకొని చదవడం మొదలుపెట్టాను. కమల నా
కారా స్మృతిలో సాహిత్యం

కారా కథలు ఎందువల్ల నిలుస్తాయి?

వాచ్యంగా చెప్పిన దానికన్న ఎక్కువగా సూచనలు అందించిన కారా కథల గురించి గత నలబై ఏళ్లలో చాలా చర్చ జరిగింది, ఇంకెంతో చర్చ జరగవలసే ఉంది, జరగవచ్చు కూడా. కాగా మరణం తర్వాత కారా గురించి, కారా కథల వర్తమాన అన్వయం గురించి జరుగుతున్న చర్చ మరిన్ని కొత్త అంశాలను ముందుకు తెస్తున్నది. కారా కథల ప్రాసంగికత గురించి కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారాను, ఆ మాటకొస్తే ఏ రచయితనైనా ఎలా అర్థం చేసుకోవాలనే మౌలిక అంశాలు చర్చకు వస్తున్నాయి. కారా కథల్లో చెప్పిన, చెప్పదలచుకున్న విషయాల ద్వారా ఈ చర్చలోకి వెళ్లడం ఆసక్తికరంగా ఉంటుంది. మొదట ఒక