సాహిత్యం కాలమ్స్ కథావరణం

” రైలు కూడా మొగోడే..అంటున్న వినోదిని కథ ‘కట్ట’ “

డాక్టర్ వినోదిని రాసిన "కట్ట" కథ అరుణతారలో 2015 జనవరిలో ప్రచురితమైంది. ఆమె రాసిన 11 కథలతో "బ్లాక్ ఇంక్" కథాసంపుటిని లిఖిత ప్రెస్ హైదరాబాద్ వారు 2015 అక్టోబర్ లో ప్రచురించారు. ప్రధాన స్రవంతి పత్రికలు అచ్చు వేయడానికి నిరాకరించిన  కథలివి.వాడల లోపలి కథలు.  అసలు కథలు ఎందుకు ప్రచురించడానికి భయపెడతాయి? కథలు ప్రచురించడంలో మొహమాటం ఏమిటి? దాపరికం ఏమిటి? నామోషీ ఏమిటి? తరతరాల సంప్రదాయ వాసనలు కొడుతున్న పత్రికల్లో పీతి వాసన గురించిన కథలంటే భయం కలగడం సహజమే.ఈనాడు మంచి రచయితలు తమ కథల్ని ప్రచురించడానికి మంచి పత్రికలను వెతుక్కోక తప్పని పరిస్థితి. పత్రికలకు మంచి
సాహిత్యం వ్యాసాలు

కార్పోరేట్లకు ప్రజల ఆస్తులు

ఎన్నికల ప్రజాస్వామ్యంలో అధికారం కోసం, ప్రజా ఉద్యమాల ఒత్తిడితో అనివార్యంగా ప్రభుత్వాలు ప్రజోపయోగ చట్టాలు చేస్తాయి . కొంతమేరకు అమలుజేస్తాయి కూడా. గత కాంగ్రెస్ ప్రభుత్వం, భూసంస్కరణల, అటవీ, గ్రామీణ ఉపాధి కల్పనల చట్టాలను,  మధ్యతరగతి ప్రజాస్వామిక వాదుల   డిమాండ్ మేరకు సమాచారహక్కు చట్టం, విద్యాహక్కు చట్టం లాంటివి జేసింది. వాటి అమలులో చిత్తశుద్ధి లేదని మ‌న‌కు తెలుసు. అయినా చట్టలు  వుంటే, వాటి అమలుకై పోరాడే అవకాశం వుంటుంది, కానీ బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆ అవకాశం  కూడా లేకుండాపోయింది. సమాచారచట్టాన్ని, అటవీచట్టాలను,కార్మికచట్టాలను, వ్యవసాయరంగ చట్టాలను నీరుగార్చి పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను చేపడుతోంది. తానేమిజేసినా శ్రీరాముని కృప
సాహిత్యం కథలు

చంద్రిక‌

చంద్ర‌ ఆమెను కలిసినప్పుడు చంద్రికకు ఎనిమిది సంవత్సరాలు.  అప్పుడు కూడా, అతనికి ఎప్పుడూ చూడని అందమైన అమ్మాయిగా తను  కనిపించింది. అతని తండ్రికి నగరం వెలుపల  సిమెంట్ తయారు చేసే ఫ్యాక్టరీలో కొత్త ఉద్యోగం వచ్చింది.  తన అమ్మ,  నాన్నలతో కలిసి ఇళ్లు మారాడు. ఇల్లు ఒక అడవి అంచున కూర్చుంది. అది అతని చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన కథల్లో మాదిరి అనిపించింది.  గుబురు చెట్లు, ప్రకాశవంతమైన ఎరుపు,  ఆకాశపు నీలిరంగు స్పర్శతో సాయంకాలం చెట్లకు అసహజ రంగులు వచ్చేవి. ఇది దాదాపు మాయాజాలం అనిపించే రకమైన అడవిగా అతను భావించే వాడు. చంద్ర తన ఇంటి నుండి
సాహిత్యం కవిత్వం ఆడియో

నాకు హెల్త్ కార్డు అవసరంలేదు

సెప్టెంబ‌ర్ 3 కా. ఎంఎస్ ఆర్‌ అమ‌ర‌త్వ దినం. పాతికేళ్లు నిండకుండానే ఈ  విప్ల‌వ క‌విని   బూటకపు ఎన్ కౌంటర్లో  రాజ్యం హ‌త్య చేసింది.  విప్ల‌వాన్ని, క‌విత్వాన్ని, క‌ళ‌ల‌ను ప్రాణ ప్ర‌దంగా భావించే ప్ర‌పంచ‌ ప్ర‌జా సాహిత్యోద్య‌మ వార‌స‌త్వాన్ని ఆయ‌న త‌న ర‌చ‌న‌తో, ఆచ‌ర‌ణ‌తో జాజ్వ‌ల్య‌మానం చేశాడు.  ఎంఎస్ ఆర్‌ స్మృతిలో ఆయ‌న క‌విత్వాన్ని విందాం. కాగ‌డాగా వెలిగిన క్ష‌ణం పుస్త‌కంలోని *సిద్ధంగా ఉండండి*, *పిలుపు*, *హెల్త్ కార్డు అవ‌స‌రం లేదు* అనే మూడు క‌విత‌ల ఆడియో మీ కోసం.     క‌వితా గానంః కామ్రేడ్ వ‌డ్డెబోయిన శ్రీ‌నివాస్‌
ఆడియో సాహిత్యం కవిత్వం

పిలుపు

సాహిత్యం సంభాషణ

కల‌నేత‌ బతుకులు

అమ్మా నాన్న‌ల త‌ల‌పోత‌ వాటు పడితేనే గానీ డొక్కాడని కుటుంబం మాది. ప్రభుత్వ ప్రచారాల్లో సర్కారు ప్రాంతంలోని ఓ జిల్లా మాది. సముద్రానికి రెండు గంటల దూరంలో ఉంటుంది.  జనాభా ఐదు వేలకు మించే (2001).పచ్చని పొలాలు గట్ల మీద వంపులు తిరిగిన తాటి కొబ్బరి చెట్లు క్షణం తీరిక లేకుండా టక టక సౌండ్‌ చేసే మగ్గాలు, వసారాల్లో ఉండే ఆసుల్సు రాట్నాలతో ఊరు ఆహ్వానం పలుకుతుంది.గ్రామంలో పెద్ద సంఖ్యలో దేవాంగ, కాపు కులాలు ఉన్నాయి. దేవాంగుల వృత్తి చేనేత. కొద్దిమంది కలంకారీ-అద్దకం పనులు చేస్తారు. కాపులు ఎక్కువ వ్యవసాయం, ఒకటి రెండు కుటుంబాలు తప్ప. గ్రామం మీద
సాహిత్యం ఆడియో

సిద్ధంగా ఉండండి

సెప్టెంబ‌ర్ 3 కా. ఎంఎస్ ఆర్‌ అమ‌ర‌త్వ దినం. పాతికేళ్లు నిండకుండానే ఈ  విప్ల‌వ క‌విని   బూటకపు ఎన్ కౌంటర్లో  రాజ్యం హ‌త్య చేసింది.  విప్ల‌వాన్ని, క‌విత్వాన్ని, క‌ళ‌ల‌ను ప్రాణ ప్ర‌దంగా భావించే ప్ర‌పంచ‌ ప్ర‌జా సాహిత్యోద్య‌మ వార‌స‌త్వాన్ని ఆయ‌న త‌న ర‌చ‌న‌తో, ఆచ‌ర‌ణ‌తో జాజ్వ‌ల్య‌మానం చేశాడు.  ఎంఎస్ ఆర్‌ స్మృతిలో ఆయ‌న క‌విత్వాన్ని విందాం. కాగ‌డాగా వెలిగిన క్ష‌ణం పుస్త‌కంలోని *సిద్ధంగా ఉండండి*, *పిలుపు*, *హెల్త్ కార్డు అవ‌స‌రం లేదు* అనే మూడు క‌విత‌ల ఆడియో మీ కోసం.     క‌వితా గానంః కామ్రేడ్ వ‌డ్డెబోయిన శ్రీ‌నివాస్‌
సాహిత్యం సంభాషణ

కోబాడ్ గాంధీ సమాధానంపై మ‌నీషా అజాద్‌

కోబాద్ గాంధీ తన జైలు డైరీకి నా ప్రతిస్పందనను చదివి స్పందించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. కొన్ని ఉద్యమ ప్రాథమిక సమస్యలపైన ఇది మంచి చర్చకు దారితీస్తుందనే ఆయన అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఆయన లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు స్పందించడానికి ప్రయత్నిస్తాను. జార్ఖండ్ ఉద్యమం సమస్యపై నేను తనని తప్పుగా ఉదహరించానని కోబాడ్ గాంధీ అంటున్నారు. వాస్తవానికి, నేను ఈ అంశంపై అసలు ఉదహరించదమనేదే జరగనప్పుడు, తప్పుగా ఉదహరించాననే ప్రశ్న ఎక్కడనుంచి వస్తుంది? ఆ డైరీ మీద  నాకు ఏర్పడిన అభిప్రాయాలను చెప్పాను అంతే.   కానీ ఇప్పుడు అతను రాసిన ఇతర విషయాలకు సమాధానం చెప్పే
కాలమ్స్ అంతర్జాతీయ చిత్ర సమీక్ష

పాలస్తీనా సత్యం : జెనిన్ జెనిన్

పాలస్తీనా భూభాగం లోని ‘జెనిన్’ అనే శరణార్థి శిబిరం మీద ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దారుణమైన దాడి గురించి, దాని పరిణామాల గురించి అరబిక్ భాషలో దృశ్యీకరించిన  డాక్యుమెంటరీ చిత్రం “జెనిన్ జెనిన్”.  దీని స్క్రిప్ట్ రచన, దర్శకత్వం మొహమ్మద్ బక్రీ నిర్వహించారు. ఈ చిత్ర నిడివి 54 నిమిషాలు. “జెనిన్, జెనిన్” అనే డాక్యుమెంటరీ చాలా విషాదకరమైన వినాశనకరమైన ‘జెనిన్ యుద్ధం’ గురించి దృశ్య మాధ్యమంలో హృదయ విదారకంగా  చిత్రీకరించబడింది. ఇది పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ శిబిరం ప్రజలతో పూర్తిగా దర్శకుడు జరిపిన ఇంటర్వ్యూల ద్వారా కథకుడు లేకుండా చెప్పడం చూస్తారు ప్రేక్షకులు. వివిధ
సాహిత్యం సంభాషణ

మనీష్ ఆజాద్ విమర్శకు కోబాడ్ గాంధీ స్పందన

 ఏప్రిల్ 19, 2021 ('ది కోరస్' లో కోబాడ్ గాంధీ పుస్తకం "ఫ్రాక్చర్డ్ ఫ్రీడం" పై విమర్శ రాసిన మనీష్ఆజాద్‌కు సమాధానాలు) పెట్టుబడిదారీ విధానం ప్రజల జీవితాలను, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగడం మంచిది. చర్చల ద్వారా మాత్రమే మనకు మరింత స్పష్టత వస్తుంది. కానీ దీనిని ప్రదర్శించే విధానం భారతీయ వామపక్షానికి విలక్షణమైనది, వీరిలో చాలామంది తమ స్వంత ఆచరణని (దాని ప్రాసంగికతను) విశ్లేషించుకోరు, కాని అసలు విషయం లేకుండా వ్యంగ్యంగా రాయడంలో ప్రవీణులు. మనీష్ ఆజాద్ ప్రశ్నలు మాత్రమే లేవనెత్తి, ఒక్క సమాధానం కూడా ఇవ్వలేదు, అతనికి