కథలు ఎరుకల కథలు

అమరజీవి మా కాంతమ్మత్త !

అనుకుంటాం కానీ, అందరికీ ఆ భాగ్యం  దక్కదు. ఆమె చనిపోయినప్పుడు ఆమె పాడె  వెనుక మూడు ట్రాక్టర్లు కదిలాయి. వాటినిండా రంగురంగుల పూలహారాలే. ” అదీ సావంటే. పుణ్యాత్మురాలు. నిద్రలో నవ్వతా నవ్వతానే పోయింది, ఏమి జనం, ఏమి జనం! ఇంత మంది యాడాడి నుంచి  వచ్చిoడారో ?.ఆ మనుషులేమి? ఆ పూలహారాలేమి? ఏమి జనం, సావు కూడా పెళ్లి లాంటిదంటే ఇట్లాంటిదేనేమో. ” అని జనం నోర్లు నొక్కుకున్నారు.  ఇంకో మాట కూడా అనేశారు   "ఎరికిలోలల్లో  ఏ సావుకైనా పై కులమోల్లు, బయట కులాలోల్లు ఇంత మంది వచ్చిండేది ఎప్పుడైనా చూసినారా ? అదీ కాంతమ్మంటే!   ” 
సాహిత్యం కవిత్వం

శాంతి స్వప్నం

పుస్తకాలు రాజ్యాన్ని భయపెట్టిస్తున్నాయి అందుకే అది పుస్తకం పుట్టకముందే పురిటీలోనే బంధిస్తున్నది పే....ద్ద పాలక ప్రభుత్వం చిన్న పుస్తకానికి, పుస్తకంలోని అక్షరాలకు భయపడటం చరిత్రలో మాములే కానీ.. పుస్తకాలు పురిటినొప్పులు  పడుతున్నప్పుడే పుట్టబోయేది "సాయుధ శాంతి స్వప్నమని"  భయపడి బంధించడమే ఇప్పుడు నడుస్తున్న అసలు రాజ్యనీతి అంతేకదా నెత్తురు మరిగిన రాజ్యానికి శాంతి స్వప్నమంటే  పాలకులకు పెనుగులాటే కదా మరి స్మృతులు యుద్ధాన్ని సృష్టిస్తాయట దుఃఖాల కలబోతకు కూడా కలవరపడుతున్న రాజ్యం ఎంత దృఢమైనదో తెలుస్తున్నది కదా అంతా మేకపోతు గంభీరమే అని
సాహిత్యం వ్యాసాలు

మమతా ఫాసిజం మాటేమిటో!

“ఎంత మాట! ఇట్లనవచ్చా? సందర్భశుద్ధి లేకుండా?” అనే వాళ్లుంటారని నాకు తెలుసు. సరిగ్గా అనవలసిన సందర్భం ఇదే. పైగా నిన్న మొన్న కూడా ఈ మాట అన్నవాళ్లకు ఇప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. పశ్చిమ బెంగాల్ విషయంలో సోషల్ ఫాసిజమనీ, మమతా ఫాసిజమనే మాటలు ఎప్పుడో ముందుకు వచ్చాయి. ఫాసిజాన్ని ఇన్ని రకాలుగా, ఇన్ని విశేషణాలతో చెబితే అసలు ఫాసిజం మీద విమర్శ పలుచన అవుతుందనే వాళ్లూ ఉండొచ్చు. మన దేశంలో ఫాసిజం కూడా బహురూపి. సూక్ష్మరూపి, సర్వవ్యాపి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, పాలకవర్గ రాజకీయార్థికానికి అది అత్యంత సన్నిహితమైనది. కేవలం బ్రాహ్మణీయ హిందుత్వ వల్లనే మన దేశంలోని ఫాసిజం
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

కారా క‌థ‌లో స్త్రీ కోణం

 ‘ఆదివారం’ సెలవు కాదా? కారా కథలు గతంలో (దాదాపు మూడు దశాబ్దాల క్రితం ) కొన్ని చదివాను. తన కథల్ని మనకి మిగిల్చి ఇటీవల మాష్టారు వెళ్లిపోయాక మళ్ళీ మొత్తం కథలు చదవడం మొదలుపెట్టినపుడు కొన్ని కథలని మొదటిసారిగా చదివాను. కొన్ని చదువుతున్నపుడు ముఖ్యంగా ఒకే దగ్గర చదువుతున్నప్పుడు ఆయన స్త్రీ పాత్రలను ఎంత బాగా చిత్రించారో గమనించాను. అసలు ‘కారాకథల్లో స్త్రీ పాత్రలు’ అనే అంశం మీద తప్పక రాయాలీ అనిపించింది. ఇప్పటికే  ఎవరన్నా ఆ పని చేసి ఉండకపోతే మాత్రం తప్పక చేయదగ్గ పని. నేను ప్రస్తుతానికి ఒక కథ గురించి మీతో పంచుకుంటాను.  
సాహిత్యం కవిత్వం

చిత్రవధ

చిత్రవధ చేస్తావనుకోలేదుకన్నీళ్లు నడిచి వస్తున్న చరితను కొన్ని రంగు పూసిన పాత్రలుఇంకొంచెం సరిగమలుకొన్ని భౌగోళిక దృశ్యాలుకథే కదా!కాకుంటేకళ్ళు మూసుకొని కళ కన్నావు విషాదం మంచు కురవడం ఎలా తెలుస్తుంది ఒక దేవాలయం ఒక మసీదు ఒక గురుద్వారా ఒక ఆరామం బతుకు వెతుక్కుంటూ భయం రహదారి నడపడం దాల్ సరస్సు దుఃఖమే !ఈ దేహావయవం అన్నందుకే కదా !ఇక్కడ పారిన నెత్తుటికి మతం లేదువయసు లేదు కాశ్మీరీయత తప్ప !నీ తెర అస్పృశ్య౼రెక్కాడితే డొక్కాడని నెత్తుటి వాసనమన ముక్కుపుటాల్లోకి చొరబడుతుంది ఈనేల ఇష్టపడిన పేర్లన్నీ ఈ మట్టిలోనే దాక్కున్నాయి మానభంగాలు మౌనభంగాలు ఎన్ని అర్ధరాత్రులు మౌనం మోశాయి రాలిన కలలన్నీ హిందువులు ముస్లిములు బౌద్ధులు సిక్కులు మరణానికి మతం లేదు కాశ్మీరీయత తప్ప !కళ్ళల్ల చెవులల్లసృజనాత్మక విషం పోసినీ మతం కోరిక తీర్చావుకన్నీళ్ళకు
సాహిత్యం కవిత్వం

జర్నీ

అతడు మన రక్త బంధువు కాకపోతేనేం నలభై ఏళ్లుగా రక్తం ఎవరికి  ధారపోశాడో తెలుసుకో అతను మన కులంవాడు కాకపోతేనేం నలభై ఏళ్లుగా ఏ కులాల వైపు నిలబడ్డాడో చూడు అతను  మనకు అక్షరాలు నేర్పకపోతేనం నలభై ఏళ్లుగా నేర్చుకున్న ప్రతి అక్షరం ఏ వాడల్లోని సూర్యోదయానికి పొదిగాడో  చూడు అతను  మన మతం వాడు కాకపోతేనేం నలభై ఏళ్లుగా  మత రహిత నూతన మానవ ఆవిష్కరణకు చేసిన ప్రయోగాలు ఎన్నో కనుక్కో అతను మన సిద్ధాంతాన్ని అంగీకరించకపోతేనేం నలభై ఏళ్లుగా మనందరం కలిసి నిర్మించాల్సిన జగత్తు కోసం   ఏ ఏ దారుల్లో పాదయాత్ర చేశాడో చూడు అతను
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

డాక్యుమెంట‌రీలో మాస్టారు

ఒక మహా పర్వతం చుట్టూ అనేక మంది నిలబడి, తమకు కనిపిస్తున్నంత మేరా ఆ పర్వతం ఎలా ఉందో వ్యాఖ్యానిస్తూ ఉంటారు.ఏ ఒక్కరికీ అటువంటి మహా పర్వతం యొక్క సంపూర్ణ స్వరూపం సాక్షాత్కారం కాదు,స్వభావమూ అర్థం కాదు.వీలైనంత ఎక్కువ మంది అభిప్రాయాలను మనం తెలుసుకుంటే తప్ప , ఆ పర్వతం యొక్క సంపూర్ణ రూప స్వభావాలు అర్థం కావు- ఒక గొప్ప మనిషి గురించి కూడా అలాగే ఉంటుంది. కాళీపట్నపు రామారావు మాస్టారు మరణించి అప్పడే రెండు వారాలు గడిచాయి.వారి మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తూ రాస్తున్న వారి సంఖ్య చూస్తూ ఉంటే, ఆశ్చర్యం కలుగుతోంది. రామారావు మాస్టారు
సాహిత్యం కవిత్వం

మనుగడ కోసం – జీవిక కోసం

వారాంతపు సంతలలో మండుతున్న ధరలు అడవులలో, వూళ్లల్లో పెరుగుతున్న ఖాకీల దాడులు. బతుకు గ్యారంటీ లేని జీవితాలలో బతుకు పోరులో ముందున్నది మా తరతరాల ఆత్మరక్షణాయుధం. ఇక వెనుకున్నది జీవిక కోసం పెనుగులాటలో సగటు ఆదివాసీ సంఘర్శన ఫలం. సమాధాన్, ప్రహార్ లు రాజ్య బీభత్సానికి పేర్లేవైతేనేం! మనుగడ కోసం మా పోరాటం. జీలుగు వద్ద తేఢాలేదు. మండుతున్న ఎండల్లో రాలిపడే  పూవుల కోసం పిల్లా-జెల్లా; ఆడ-మగా అడవంతా మా గాలింపే ఆకలి తీర్చుకోవడానికి అంబలి, సేద తీర్చుకోవడానికి నీరుతో పాటు ఉత్సాహాన్ని, శక్తినిచ్చే సంప్రదాయ సేవనం – జీలుగు కల్లు జెండర్ తేడాలేమీ లేకుండా సమష్టిగా డొప్పల్లో
కారా స్మృతిలో సాహిత్యం సంభాషణ

*మీలా బ‌త‌క‌డం మీకే సాధ్యం*

మాష్టారూ‌ మీరూ అబద్ధాలాడతారని అనుకోలేదు. 'వందేళ్ళుంటాను ..ఈ వందేళ్ళూ కథకి, కథానిలయానికి చెయ్యాల్సిన పనులున్నాయి అవి పూర్తిచెయ్యాలి'  అని‌ మాటిచ్చి  ఇలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా? మీరూ మోసం చెయ్య‌గలరా ? మీ మాటమీద నమ్మకంతో మేం ధైర్యంగా ఉంటే కూతుర్ని మాత్రం రప్పించుకుని మాకు చెప్పకుండా  అర్థాంతరంగా వెళ్ళిపోవడం మోసం కాదా మాష్టారూ. మీరు ఆడినమాట తప్పుతారని కలలో కూడా అనుకోలేదు. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి రెండో శని,ఆదివారాలు కథానిలయం వార్షికోత్సవాలు జరుగుతాయని, ఆ రెండురోజులూ అదొక సాహిత్యోత్సవంగా జరగుతుందని, దేశవిదేశాల నుండి కథాభిమానులు వస్తారని ముందురోజే రాకపోతే ఊరుకునేది లేదని ఎన్నన్నారు..మూడేళ్ళుగా ఆ సందడే