ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా,
చత్తీస్‌ఘడ్‌లో ఉన్న కోట్లాది విలువైన సహజ వనరులను బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం భారత ప్రభుత్వం దేశ మూలవాసులైన ఆదివాసీలపై అతిక్రూరంగా మారణకాండను దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉంది. అలాగే వారికి మద్దతుగా ఉద్యమిస్తున్న ఉద్యమకారులను కూడా అత్యంత కిరాతకంగా హత్య చేస్తూ దానికి ‘ఆపరేషన్ కగార్’ పేరుతో లక్షలాది బలగాలతో మధ్య భారతాన్ని సరిహద్దు ప్రాంతంగా మారుస్తూ యుద్ధ స్థితిని కొన సాగిస్తుంది. ఇది గాజా, ఉక్రెయిన్‌ల కన్నా దారుణ స్థితిని దాటిపోయింది. మనపక్కన ఉన్న చత్తీస్‌ఘడ్‌లో ఆదివాసీల జీవితాలపై పై భారతసైన్యం తీవ్రంగా దాడి చేస్తున్న విధానాన్ని మానవతావాదులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని,ప్రభుత్వ కార్పోరేట్ విధానానికి అనుకూలంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న పాలనను నిలదీయడానికి ముందుకు రావాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే సబ్బండ వర్గాలు కదిలి తెలంగాణను సాకారం చేసుకోగలిగామో, అలాగే మధ్యభారతంలో ఒకనసాగుతున్న ఆదివాసీల హననాన్ని నిలువరించడానికి, వారి జీవించే హక్కును రక్షించడానికి ఆదివాసులకు బలమైన 1996 పేసా చట్టాన్ని గ్రామసభ తీర్మాణాలను అమలు చేయించడం కోసం మనవంతు బాధ్యతగా ఆచరణాత్మకంగా ముందుకు రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం.
ఆదివాసీ గ్రామాలపై దాడుల నేపథ్యంలో ఆర్నెల్ల పాప హత్యతో మొదలై 15 నెలల కాలంలో మధ్యభారత, గోదావరి తీర అరణ్యాలలో సాగుతున్న మారణకాండల్లో ఇప్పటికే మరణించిన వారిని వ్యక్తులుగా చెప్పడం కష్టమై 453 సంఖ్యతో పేర్కొంటున్నారు. 2024 జనవరి 1న ఆరు నెలల పాప మంగ్లీ సోడితో ప్రారంభమైన కగార్ ఆదివాసీల హత్యాకాండ గత ఏడాదిలో 350 వరకు వస్తే, ఈ ఏడాది ప్రారంభంలో మూడు నెలల కాలంలో 103 సంఖ్యను దాటేసింది. ఆపరేషన్ కగార్ ఆదివాసీల అణచివేత చత్తీస్‌ఘడ్, అబూజ్‌మడ్ ప్రాంతంలో అందులో నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాలోని మొత్తం 4 వేల కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతంలో కొనసాగుతోంది. ఇందులో 237 గ్రామాల్లో గోండు, మోరియా, అబూజ్, హల్వా తెగలకు చెందిన 35 వేల మంది ఆదివాసీలు జీవిస్తున్నారు. ఇక్కడ ఇనుప ఖనిజం, గ్రాఫైట్, సున్నపురాయి, యురేనియంతో పాటు 28 రకాల 70 కోట్ల టన్నుల ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఖనిజ వన రులను కార్పొరేట్లకు అప్పజెప్పడానికి కేంద్రం ఇప్పటికే 104 ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలు 2005 నుంచి కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడున్న ఆదివాసీలు జల్, జంగిల్, జమీన్‌లపై తమకే హక్కు ఉందని పోరాటం ద్వారా చేస్తున్నారు. రాజ్యాంగం, చట్టాలు కూడా వారికి అనుకూలంగానే ఉన్నాయి. 1996లో వచ్చిన’పేసా’ చట్టం గ్రామ. సభల తీర్మానమే అంతిమంగా చెబుతూ అడవిపై ఆదివాసీలకే హక్కు ఉందని బలంగా ప్రకటిస్తున్నది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో బాక్సైట్ వెలికితీతకు వ్యతిరేకంగా 1997లో సమతా స్వచ్ఛంద సంస్థ వర్సెస్ కేంద్ర ప్రభుత్వంతో జరిగిన న్యాయ పోరాటంలో సుప్రీం కోర్టు పై కూడా ప్రభుత్వాన్ని ఆదివాసేతరుడుగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చింది. ఇలాంటి ఆదివాసీ ప్రత్యేక చట్టాలన్నింటిని అమలు చేయకుండా ఆదివాసీల అణచివేతను కొనసాగిస్తున్నది. అందులో భాగంగానే ‘ఆపరేషన్ కగార్’ పేరుతో 650 పోలీసు క్యాంపులను 7 లక్షల పోలీసు బలగాలను, వందలాది డ్రోన్లను పదుల సంఖ్యలో హెలికాప్టర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగిస్తూ ఆదివాసీల హననాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రజాస్వామిక దేశంలో ప్రజలు, ఉద్యమకారులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే హక్కు అవకాశం ఉందని మన ప్రజాస్వామిక వ్యవస్థ చెబుతుంది. ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పరిష్కరించడం కన్నా ప్రజా ఉద్యమాల అణచివేతనే పరిష్కారంగా భావిస్తూ ఇప్పటికి 50 ఏళ్లుగా దాన్నే కొనసాగిస్తూ 20 వేలకు పైగా ఎన్‌కౌంటర్ పేరుతో ఆదివాసీల హత్యలను కొనసాగించాయి. ఆపరేషన్ గ్రీన్‌హంట్ 2005 నుండి సల్వాజుడుం పేరుతో 950 మంది ఆదివాసీలను రమణ్ సింగ్ ప్రభుత్వం హత్య చేసింది. లక్షయాభైవేల ఆదివాసీలను విస్తాపనకు గురి చేసింది. ప్రొ.నందిని సుందర్, పిటీషనర్‌గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ నిస్సర్‌లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ 2011లో సల్వాజుడుంను రద్దు చేసింది. కానీ అందులో పని చేసిన వారందరూ నేరస్తులే అయినప్పటికి వారికి ఆక్సిలరీ ప్రమోషన్ ఇచ్చి డిస్టిక్ రిజర్వ్‌గార్డ్ బలగాలు (డీఆర్‌జి) పేరుతో కొత్త ఫోర్స్ ప్రభుత్వంలో చేర్చుకున్నారు. సల్వాజుడుం తర్వాత 2009 లో ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ ప్రకటించబడిరది. దీనితో సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు డీఆర్‌జి బలగాలు కూడా ఆదివాసులపై దాడులు చేస్తూ హత్యాకాండను కొనసాగించాయి. అందులో భాగంగానే 2012లో జరిగిన బాసగూడ ఆదివాసీల ఎన్‌కౌంటర్ హత్యాకాండ 2013 లో ఎడిసిమెట్టలో కూడా ఇటువంటి మారణకాండనే కొనసాగించారు. ఒక్కక్క ఎన్‌కౌంటర్ ఘటనలో 17 మంది ఆదివాసీలు మరణించారు. ఇందులో స్కూలుకు వెళుతున్న మైనర్ బాలులు ఐదుగురు ఉన్నారు. ఈ ఘటనలపై ఏర్పాటు చేసిన జస్టిస్ అగర్వాల్ కీమషన్ కూడా ఏకసభ్య కమీషన్ కూడా ఇది ఎన్ కౌంటర్ కాదని స్పష్టం చేసింది. 2011 నుండి ఆపరేషన్ గ్రీన్‌హంట్ రెండవ దశ అమలవుతూ వస్తుంది. ఈ కాలంలో అదివాసీల అక్రమ ఆరెస్టులు నిర్వరామంగా కొనసాగాయి. సుక్మా, దంతెవాడ, జగదల్పూర్, రాయపూర్ జైళ్లన్నీ ఆదివాసీలతో కుక్కివేయబడ్డాయి. అందరిపై ఉపా కేసులు, 2005 ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక భద్రతా చట్టం కేసు కూడా మోపారు. 2017 నుండి ‘ఆపరేషన్ సమాధాన్’ పేరుతో డ్రోన్లతో దాడి ప్రారంభించారు. ఈ స్థితిలోనే అక్కడ ఉన్న జర్నలిస్టులకు పత్రికా స్వేచ్ఛ లేకుండా పోయింది. అడవిలోకెళ్ళి ఎవరు వార్తలు సేకరించినా వారిని కాల్చి పారేయండని అధికారులు 1991 జన్‌జాగరన్ అభియాన్ కాలంలో కలెక్టర్లే బహిరంగంగా మాట్లాడిన స్థితి నేడు అమలవుతున్నది. అందులో భాగంగానే చత్తీస్‌గఢ్ లో ప్రధాన మీడియూను నిశ్శబ్దం చేయడం మూలంగా కేవలం య్యూట్యూబ్ ఛానల్ బస్తర్ జంక్షన్, బస్తర్ టాకీస్, స్థానికంగా ఆదివవాసులపై జరుగుతున్న హనన వార్తలను ప్రపంచానికి అందిస్తున్నాయి. వారిపై కూడా తీవ్ర నిర్బంధం అమలవుతున్నది. అందులో భాగంగానే రహదారి నిర్మాణ అవినీతి కేసును బయటకు తీసినందుకు ముఖేష్ చంద్రాకర్ అనే బస్తర్ టాకీసుకు చెందిన యువ జర్నలిస్టును దారుణ హత్య చేశారు.
మధ్యభారత అటవీ ప్రాంతాలు 29 రకాల విలువైన ఖనిజాలకు, కోట్ల రూపాయల విలువైన సంపదకు పుట్టినిల్లుగా ఉన్నాయి. అది మన దేశ ప్రజలందరి సంపద. దానిపై ప్రభుత్వాలకే కాదు, ప్రజలందరికీ అధికారం ఉంటుంది. అందులో భాగంగానే ఆదివాసులకు మరింత ఎక్కువ అధికారం ఉంటుందని, 1996లో వచ్చినటువంటి పేసా చట్టం, గ్రామసభ తీర్మాణాన్ని స్పష్టం చేస్తాయి. కానీ, ప్రభుత్వాలు మాత్రం తమకు మాత్రమే అధికారం ఉన్నట్టు పాలన చేస్తున్నాయి. ఆదివాసీలకు సంపదపై ఎంత హక్కు ఉంటుందో, అంతే హక్కు మనకూ ఉంటుంది. వారు ఆ సంపద రక్షణ కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేస్తున్నా, నాగరికులుగా ఆ సంపద రక్షణ కోసం పోరాడటానికి మనం భయపడుతున్నాం. ఇది న్యాయం కాదు. మనం ఆదివాసీల పక్షాన మాట్లాడుదాం. మనం ప్రత్యక్షంగా సంపద రక్షణ కొరకు పోరాటం చేయకపోయినా, పోరాడుతూ వారి పక్షాన మాట్లాడుదాం. వారిపై జరుగుతున్న ‘ఆపరేషన్ కగార్’ హత్యాకాండకు నిలువరించేందుకు మనవంతు బాధ్యత తీసుకుందాం.
ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక సంక్షోభాలకు పరిష్కారంగా మనలాంటి మూడవ ప్రపంచ దేశాల్లో ఉన్న విలువైన ఖనిజ సంపద సామ్రాజ్యవాద కార్పొరేట్ల దృష్టిలో పడిరది. సామ్రాజ్యవాదం అంటేనే పెట్టుబడిదారీ అత్యున్నత దశ. ఎంత ప్రజాస్వామిక దేశమైనప్పటికీ కంపెనీల, కార్పొరేట్ల ప్రయోజనాలే దేశ ప్రయోజనాలుగా, దేశ అభివృద్ధిగా ప్రచారం చేస్తూ పాలకులు కీర్తిస్తు న్నారు. వాస్తవం మాత్రం అది కాదు. మన వనరులను కార్పొరేట్లు దోపిడీ చేయకుండా అవసరం మేరకు నేష నల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం వెలికితీస్తే ఆదివాసుల ప్రయోజనాలకు, జీవితాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉంటుంది. కానీ, ప్రభుత్వాలు మాత్రం రకరకాల ఆపరేషన్లతో అత్యాధునిక ఆయుధాలతో ఆదివాసులను హత్యచేస్తున్నారు. అందుకే రెండున్నర దశాబ్దాలుగా వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి వనరులను, దేశ సంపదను రక్షించుకునేందుకు పోరాటం చేస్తున్నారు. వారే నిజమైన దేశ భక్తులు. ఉద్యమిస్తున్న నిరాయుధ ఆదివాసీలపై 2005 నుంచి సల్వజుడుం, 2009 గ్రీన్ హంట్, 2017 సమాధాన్, 2024 నుంచి ‘ఆపరేషన్ కగార్’ పేరుతో శత్రుదేశంపై దాడి చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల హననాన్ని కొనసాగిస్తున్నది.
ఆపరేషన్ కగార్ కారణంగా 1,జనవరి 2024 ఆదివాసీల అణచివేతకు మరొక రూపంలో భాగంగా ఆదివాసీ గ్రామాలన్నీ పోలీసు క్యాంపులుగా మార్చేసారు. ఒక్కసారిగా గ్రామాలను 14 వేల నుంచి 20 వేల పారామిలటరీ బలగాలు చుట్టుముడుతున్నాయి. భద్రతా బలగాలను చేసి పారిపోతున్న ఆదివాసులను పట్టుకొని యూనిఫాం తొడిగి హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారు. 2024, జనవరి నుంచి మొదలైన ఈ ఆపరేషన్లో ఆరు నెలల పాప మొదలుకొని 60 ఏండ్ల వృద్ధులను సైతం విడిచిపెట్టడం లేదు. ప్రభుత్వం మాత్రం నక్సలైట్ల నుంచి గ్రామస్థులను కాపాడుతున్నామని, వారి అభివృద్ధికి, వారి భద్రతకు కృషి చేస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. అయితే, ప్రభుత్వం వెనుక బడా కంపెనీలు కార్పొరేట్లు ఉన్నాయన్న ఎత్తుగడను అర్థం చేసుకున్న ఆదివాసీలు మూడేండ్లుగా క్యాంపులకు వ్యతిరేకంగా తమ హక్కుల కోసం గాంధేయ, ప్రజాస్వామిక పద్ధతిలో 18 చోట్ల ఆందోళన తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే 2021లో జరిగిన సిలింగేర్ క్యాంపుకు వ్యతిరేక ఘటనను పురస్కరించుకొని 35 సంస్థలతో కూడిన మూలవాసి బచావో మంచ్ ఆవిర్భవించింది. ఈ నాలుగేళ్ళుగా అది తనకార్యాచరణను కొనసాగిస్తూ వచ్చింది. కాని 2024 ఏడాది కాలంలోనే తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తూ, మంచ్ ప్రధాన నాయకత్వాన్ని అక్రమ కేసులతో జైళ్ళో నిర్బంధించింది. దాని కొనసాగింపుగా ఈ మూలవాసీ బచావో మంచ్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తూ అక్టోబర్ 30, 2024న 2005 చత్తీస్‌ఘడ్ ప్రత్యేక ప్రజారక్షణ చట్టం క్రింద నిషేదించింది. ఫిబ్రవరి 27, 2025న దంతెవాడలో మంచ్‌కు చెందిన అధ్యక్షుడు రఘును ఎన్‌ఐఎ పోలీసులు అరెస్టు చేసారు. చివరికి ఇలాంటి శాంతి పోరాటాలపైనా కాల్పులు జరిపి (సిలింగేర్) ముగ్గురిని హత్య చేసి ఎన్ కౌంటర్‌గా ప్రచారం చేసిన ఘనత ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానిది. చివరికి ఆరు నెలల పాప మంగ్లీ సోడి హత్యను కూడా వక్రీకరించారు. గతంలో ఆదివాసీ హక్కుల కార్యకర్త, టీచర్ సోనిసోరి భర్తను అక్రమ కేసుల్లో ఇరికించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో స్టేషన్లోనే చనిపోయాడు. అతని అంత్యక్రియలకు భార్యను హాజరు కాకుండా నిర్బందాన్ని కొనసాగించారు. ఎంతో మంది ఆదివాసీలు ఇప్పటికే జైలు నిర్బంధంలో ఉన్నారు. ఎన్‌కౌంటర్ హత్యలకు గురవుతున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రెండు తెలుగు రాస్ట్రాలలో ఆదివాసీ హక్కుల పోరాట సంఫీుభావ వేదిక వారి మద్దతుగా ఏర్పడి ఉన్నది. దీనిలో మనందరం కలిసి వచ్చి ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిస్తున్నాం.